breaking news
DIEO
-
కాసులతో బేరం.. పదోన్నతులు ఘోరం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో మరో అక్రమ బాగోతం బయటపడింది. ఇంతకుముందు ఉద్యోగుల సాధారణ బదిలీల్లో డబ్బులిచ్చిన వారికి పట్టణాల్లో పోస్టింగ్‌లు కట్టబెట్టిన అధికారులు.. బోర్డు ఆదేశాలు లేకుండానే డబ్బులు తీసుకుని గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టారు. తాజాగా సీనియారిటీని కాదని అర్హత లేనివారికి, జూనియర్లకు పదోన్నతుల ద్వారా స్థాయీ బాధ్యతలు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అధికారులు విడుదల చేసిన సీనియారిటీ జాబితాను సైతం పట్టించుకోకుండా అత్యంత జూనియర్లకు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా అధికారులు (డీఐఈవో)గాను, ప్రాంతీయ తనిఖీ అధికారులు (ఆర్ఐవో)గాను పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన తప్పులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరిదిద్దలేదని, తమ అభ్యర్థనలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్హతగలిగిన సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే జాబితా విడుదల గతేడాది డిసెంబర్లో జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌గా ఉన్న 340 మందితో సీనియారిటీ జాబితా విడుదల చేశారు. డీఐఈవో, ఆర్ఐవో పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లో సీనియారిటీ ప్రకారం వీరినే నియమించాల్సి ఉంది. అయితే, మొత్తం ప్రిన్సిపాల్స్ జాబితాలో 1 నుంచి 62 వరకు ఉన్న వారితో నియామకాలు సక్రమంగానే చేపట్టారు. 63 నుంచి 340 వరకు సీనియారిటీని పట్టించుకోలేదు. ఏపీపీఎస్సీ ద్వారా జేఎల్స్‌గా నియమితులైన వారిని కాదని, స్కూల్ అసిస్టెంట్లు నుంచి జేఎల్స్‌గా వచ్చిన వారు, జాబితాలో జూనియర్ స్థాయి వారిని ఆర్ఐవో, డీవీఈవోలుగా నియమించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పిస్తే సీనియర్ అసిస్టెంట్ అవుతారు. తర్వాత సెక్షన్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి నేరుగా సూపరింటిండెంట్‌గా పదోన్నతి ఇవ్వడం అసాధ్యం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటర్మీడియెట్ విద్యామండలిలో దీనిని సుసాధ్యం చేశారు. విద్యావ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలను కాదని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్‌కు కొత్త భాష్యం చెబుతూ కొందరు జూనియర్ లెక్చరర్లకు జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా (డీవీఈవో) పదోన్నతులు కల్పించారు. ఇంటర్ విద్యా మండలిలో జూనియర్ లెక్చరర్లను సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతి కల్పిస్తారు. ప్రిన్సిపాల్స్ సీనియారిటీ ఆధారంగా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు(డీవీఈవో)గా పదోన్నతి ఇస్తారు. కానీ, కొందరు ప్రిన్సిపాల్స్‌కు పదోన్నతి, సీనియారిటీతో సంబంధం లేకుండా జీవో 283లోని లోపాలను అడ్డుపెట్టుకుని నేరుగా డీవీఈవో పదోన్నతులు ఇచ్చారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీనియర్ ప్రిన్సిపాల్స్‌కు అన్యాయం సర్వీసు నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కావాలంటే జేఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్(జీవోటీ), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్(ఈవోటీ) పాసవ్వాలి. డీవీఈవోలుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా ప్రిన్సిపాల్ అయ్యుండాలి. కానీ. అవేం పట్టించుకోలేదు. జీవో 283లో డెప్యూటీ డీవీఈవోలు, ప్రిన్సిపాల్స్‌కు ఉద్దేశించిన ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ అంశాన్ని జేఎల్స్‌గా సర్వీసులో చేరినప్పటి నుంచి సీనియారిటీని లెక్కించాలని కొత్త భాష్యం చెప్పి పదోన్నతులు కల్పించారు. ఈ అంశం తప్పుగా జరిగిందని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ముగియకుండానే తాజాగా డీఐఈవో, ఆర్ఐవోలుగా జూనియర్లను నియమించడంపై గొడవ మొదలైంది. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఈ తరహా నియామకాలు జరగ్గా.. ఇదే తరహాలో మరికొందరికి అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనివెనుక పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన తప్పులపై డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేస్తే పరిగణనలోకి తీసుకుని సరిదిద్దాల్సింది పోయి కనీసం పట్టించుకోకపోవడంపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. -
గుండెపోటుతో కరీంనగర్ డీఐఈవో మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) టి.రాజ్యలక్ష్మి శుక్రవారం ఉదయం 10.20 నిమిషాలకు గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వారి నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత మూడున్నరేళ్లుగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి టైపిస్టుగా ఉద్యోగంలో చేరి జూనియర్ లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా, డీఐఈవోగా సేవలందించారు. భర్త పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి గతంలోనే పదవీ విరమణ పొందారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వస్థలం సిరిసిల్ల జిల్లా అయినప్పటికి 30ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా కరీంనగర్‌లోని చైతన్యపురిలో స్థిరపడ్డారు. రాజ్యలక్ష్మి భౌతికకాయానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, తదితరులు నివాళి అర్పించారు. -
భువనగిరిలో డీఐఈఓ కార్యాలయం
భువనగిరి అర్బన్ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం(డీఐఈఓ) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఓ ఎన్.ప్రకాష్‌బాబు అన్నారు. బుధవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న వృత్తి విద్యా సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్యా సముదాయ భవనంలో అక్టోబర్ 11 నుంచి డీఐఈఓ విధులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యాలయానికి కావాల్సిన రికార్డులు, ఫర్నిచర్, కార్యాలయం పేరుతో ఉన్న బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది నియామకం కూడా త్వరంలోనే జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ విభాగంలో ఉన్న ఆర్ఐఓ, డీవీఈఓ పోస్టులు రద్దవుతాయని, ఈ పోస్టుల్లో డీఐఈఓ ఏర్పడుతుందని చెప్పారు. నూతన యాదాద్రి జిల్లాలో 69 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 4 టీఎస్డబ్ల్యూఆర్సీ, 1 టీఎస్ఆర్జేసీ, 6 మోడల్ స్కూల్స్, 48 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. ఆయన వెంట పలువురు అధ్యాపకులు ఉన్నారు. -
ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓ పోస్టుల విలీనం
ప్రతీ జిల్లాకు ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డీఐఈఓ కార్యాలయాలు విద్యారణ్యపురి : జిల్లాలోని ఇంటర్ విద్య, జిల్లా వృత్తి విద్యాధికారి పోస్టులను విలీనం చేయబోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పునర్విభజనతో వరంగల్, హన్మకొండ (వరంగల్ రూరల్), భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటుకు ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్య ఆర్ఐవో, జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) కార్యాలయాలు ఉన్నాయి. ఇంటర్ విద్య ఆర్ఐవో ప్రైవేట్ జూనియర్ కళాశాలల పర్యవేక్షణతోపాటు పరీక్షలను నిర్వహించే బాధ్యత చూస్తున్నారు. డీవీఈవో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షిస్తున్నారు. వృత్తి విద్యాకోర్సులును కూడా నడిపిస్తున్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు కానున్నందున ఇక ఆ రెండు కార్యాలయాలు వేర్వేరుగా కాకుండా ఒకే కార్యాలయంగా విలీనం కాబోతున్నాయి. ఇక నూతన జిల్లాలో ఆ రెండు పోస్టులు కలిపి జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ) వ్యహరిస్తారు. దీంతో జిల్లాకో డీఐఈఓ ఉంటారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్య ఆర్ఐవో, డీవీఈవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని సీనియర్ పిన్సిపాళ్లు ఇద్దరు బాధ్యతలను నిర్విర్తిస్తున్నారు. ఇందులో ఒకరిని ఒక జిల్లాకు మరొకరిని మరో జిల్లాకు డీఐఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తే మిగతా రెండు జిల్లాలకు డీఐఈవోలుగా ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ నియమిస్తే మరో ఇద్దరి సీనియర్ ప్రిన్సిపాళ్లను డీఐఈవోలుగా నియమించాల్సి ఉంటుంది. లేదా ప్రస్తుతం ఉన్న ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓలకే అప్పగిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓలు పోస్టులు కలిపి 17 మంది పనిచేస్తున్నారు. ఇక 27 జిల్లాలు కానున్న నేపథ్యంలో వారిని సర్దుబాటు చేసినా అన్ని జిల్లాలకు సరిపోరు. ప్రస్తుతం ఉన్నవారినే సర్దుబాటు చేస్తారా లేదా వేరే సీనియర్ ప్రిన్సిపాల్స్క అవకాశం కల్పిస్తారానేది వేచి చూడాల్సిందే. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్య ఆర్ఐవో కార్యాలయంలో సీనియర్ ప్రిన్సిపాల్ ఆర్‌ఐవోగా విధులు నిర్వర్తిస్తుండగా అందులో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. దినసరి వేతన ఉద్యోగులుగా ఇద్దరు, మరో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ అటెండర్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇక హన్మకొండలోని జిల్లా వృత్తివిద్యా కార్యాలయంలో డీవీఈవో సీనియర్ ప్రిన్సిపాల్ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా ఒకరు çఅడ్మినిసే్ట్రటివ్ ఆఫీసర్ సూపరింటెండెంట్, ఒకరు సీనియర్ అసిస్టెంట్, మరొకరు జూనియర్ అసిస్టెంట్, అటెండర్ తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు ఆర్ఐవో, డీవీఈఓ కార్యాలయాల ఉద్యోగులను కలిపి కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగు జిల్లాలకు సర్దుబాటు చేసి ప్రతిపాదించారు. అయినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయనున్న డీఐఈవో కార్యాలయంలో ఉద్యోగుల కొరత ఉంటుంది. నాలుగు జిల్లాల ఏర్పాటు చేయబోతున్నందున వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న ప్రభు్వత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాలలకు సంబం«ధించిన వివరాలను సైతం ఆయా జిల్లాల పరిధిలోకి వెళ్లేలా ఫైళ్ల విభజన కూడా చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా ఇంటర్ విద్య ఆర్ఐవో కార్యాలయం హన్మకొండలోని సుబేదారిలోని అద్దెభవనంలో కొనసాగుతుండగా హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీవీఈవో కార్యాలయం ఉంది. ఇక రెండు పోస్టులు విలీనంతో ఇక వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) కార్యాలయం అద్దెభవనంలో ఉండబోతుండగా, హన్మకొండకు పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. మిగతా జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఓ హాల్లో ఇంటర్ విద్య ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ఉండేలా ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇక ఇంటర్ విద్య ఎడ్యుకేషన్ఆఫీసర్ జిల్లాకు ఒకరు ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్ప్రైవేట్ జూనియర్ కళాశాలలను కూడా పర్యవేక్షిస్తారు. జిల్లాలో 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో వరంగల్ జిల్లాకు 14, హన్మకొండ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాకు 8, మహబూబాబాద్ జిల్లాకు 8, యాదాద్రి జిల్లాకు 6, సిద్దిపేటకు 2 ప్రభుత్వ కళాశాలలు ఉండబోతున్నాయి. ఈమేరకు ప్రతిపాదించారు. ఇక ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మహబూబాబాద్ జిల్లాకు ఒకటి, వరంగల్ జిల్లాలో ఆరు ఉండబోతున్నాయి. ఇక ప్రస్తుతం వరంగల్ జిల్లాలో 241 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా అందులో కొత్తగా ఏర్పాటు కాబోతున్న వరంగల్ జిల్లాకు 67, హన్మకొండకు 88, భూపాలపల్లి జిల్లాకు 17, మహబూబాబాద్ జిల్లాకు 41 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండబోతున్నాయి.


