breaking news
Dhabas
-
ఢిల్లీ హైవే ధాబాల్లో కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా ముర్తాల్ లోని ప్రముఖ సుఖ్‌దేవ్ ధాబాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ హైవే మీద ఉన్న రెండు ధాబాల్లో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు దారి తీసింది. గత వారంలో కనీసం10,000 మంది సందర్శించి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్-స్ర్పెడర్ ధాబాలను సందర్శించిన వారినందరినీ గుర్తించడానికి భారీ కాంటాక్ట్-ట్రేసింగ్ పని జరుగుతోందని వారిని కనుగొనడం చాలా పెద్ద సవాలు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే 75 మంది ఉద్యోగులు కరోనావైరస్ బారిన పడటంతో సంబంధిత ధాబాలను అధికారులు సీజ్ చేశారు. సుఖ్‌దేవ్ ధాబాలో 360 మంది ఉద్యోగుల నమూనాలను సేకరించగా, వారిలో 65 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని సోనెపట్ జిల్లా కమిషనర్ శ్యామ్ లాల్ పూనియా చెప్పారు. దీంతోపాటు నటుడు ధర్మేంద్ర యాజమాన్యంలోని గరంధరం ధాబాలో మరో 10 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. కరోనా నిబంధనల ప్రకారం హోటల్‌ను శానిటైజ్ చేయడంతోపాటు, పాజిటివ్ వచ్చినవారిని ఐసోలేషన్‌కు తరలించామన్నారు. కాగా కరోనా వైరస్, లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఆంక్షలను సడలించిన తరువాత, ఆయా రాష్ట్రాలలో మధ్య ప్రయాణాలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలలుగా మూసి ఉన్న హైవే రెస్టారెంట్లు, ధాబాలు వద్ద కౌంటర్లలో జనం బారులు తీరారని, ఇది వైరస్ వ్యాప్తికి దారితీస్తోందని అధికారులు తెలిపారు. -
129 దాబాలకు అనుమతి
సాక్షి, అమరావతి: అత్యవసర వస్తువుల సరఫరాకు వాహనాలను అనుమతిస్తుండటంతో రహదారుల్లో వారికి ఆహార ఇబ్బందులు తలెత్తకుండా పరిమిత సంఖ్యలో దాబాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 129 దాబాలను ప్రారంభించడానికి అనుమతిచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఇవి కేవలం రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసమేనని, సాధారణ జనాన్ని అనుమతించడానికి వీలులేదన్నారు. ఈ దాబాల్లో పరిశుభ్రత, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వీటిని పర్యవేక్షించే బాధ్యతను ఆయా జిల్లాల జీఎంలకు అప్పచెప్పినట్లు రజత్‌భార్గవ తెలిపారు. అనుమతులు ఇలా... ► అత్యవసర సేవలు, నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలకు.. ► పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు... ► నిరంతరాయంగా పనిచేయాల్సిన పరిశ్రమలకు ముడి సరుకు తరలించేందుకు... ► లాక్డౌన్ సమయంలో ఫార్మా, ఆహార శుద్ధి రంగాలకు చెందిన పరిశ్రమలు పనిచేయడానికి అనుమతించడంతో వాటికి సంబంధించిన వాహనాలకు. -
ఢాబాలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
పాకిస్తాన్ మహిళలకోసం 'గాల్స్ ఎట్ డాబాస్'!
అనాదిగా నెలకొన్న దురాచార, పురుషాధిక్య సమాజం నుంచీ ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ మహిళలు బయటకు వస్తున్నారు. వివక్షత, వేధింపులు, హింసలకు గురయ్యే నేపథ్యం నుంచి... గౌరవంగా, హక్కుగా, స్వేచ్ఛగా బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. పురుషుడు తోడులేనిదే బయటకు రాని పరిస్థితి నుంచీ... ఒంటరిగా, ధైర్యంగా తిరిగే స్థాయికి చేరారు. మహిళల్లో అటువంటి మార్పే ధ్యేయంగా ఏర్పాటు చేసిన 'గాల్స్ ఎట్ డాబాస్' అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పాకిస్తాన్ లోని బహిరంగ ప్రదేశాల్లో.. పురుషులు తోడు లేకుండా మహిళలు పబ్లిక్ ప్లేస్ లో ఒంటరిగాగాని, సమూహంతోగాని స్వేచ్ఛగా, ఆనందంగా గడిపే క్షణాల ఫొటోలను పోస్ట్ చేయమంటూ ప్రారంభించిన ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. భారత మహిళల 'వై లాయ్ టర్' ఉద్యమానికి స్పందిచిన కరాచీ జర్నలిస్ట్ సదియా ఖత్రి.. పాకిస్తాన్ మహిళల్లోనూ అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. 'గాల్స్ ఎట్ డాబాస్' పేరిట ఉద్యమానికి నాంది పలికింది. భారత నగరాల్లోని మహిళలను . 'వై లాయ్ టర్' ఎలా ప్రోత్సహించిందో తెలుసుకొని, భారతీయ నిర్వాహకులతో కలిసి పాకిస్తాన్ లో ఉద్యమం తెచ్చేందుకు నిర్ణయించింది. 'వై లాయ్ టర్' ద్వారా మహిళలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, కచ్చితంగా మాట్లాడగల్గుతున్నారని... భారతదేశంలో జరిగిన ప్రచారాన్నే పాకిస్తాన్ కు పరిచయం చేయాలని ప్రతిన బూనింది. కరాచి, ఇస్లామాబాద్, లాహోర్లతోపాటు అనేక పాకిస్తానీ నరగాల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. పాకిస్తానీ మహిళలు తమ ఇళ్ళనుంచి బయటకు వచ్చి... సమావేశాల్లో పాల్గొని, ఎటువంటి ఆందోళనా లేకుండా సమయం గడపడంతో ఖత్రి ప్రయత్నం కొంతవరకూ సఫలమైంది. పాకిస్తాన్ లో పబ్లిక్ ప్లేస్ లు మహిళలకు నరక కూపాలుగా ఉన్నాయని, రోడ్లపై 25 మంది పురుషులకు ఒక్క మహిళ కనిపించడం కష్టమని, ఈ నిష్పత్తి ఇలా ఉంటే ఇక మహిళలు హాయిగా వీధుల్లో తిరగడం కనిపించే అవకాశమే లేదని ఖత్రి అంటుంది. ఎటువంటి అవసరం ఉన్నా పురుషుడు తోడు లేనిదే బయటకు వెళ్ళలేని పరిస్థితి అక్కడి మహిళలదని, అత్యవసర పరిస్థితుల్లోనూ ఒకరికోసం వేచి చూడాల్సిందేనని అంటుంది. 'వై లాయ్ టర్' స్ఫూర్తిగా పాకిస్తానీ మహిళల్లో స్ఫూర్తిని రగిల్చేందుకు ఖత్రి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లను వినియోగించుకొని మహిళలు తమ అభిప్రాయాలను హాయిగా వెలిబుచ్చేందుకు వేదికలుగా మార్చింది. తోడు లేకుండా బయటకు రాలేని నిస్సహాయ స్థితి నుంచి వారు స్వేచ్ఛా ప్రపంచంలో విహరించేట్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పురాతన దురాచారాల లోతుల్లో పాతుకుపోయిన భావాలనుంచి అక్కడి మహిళలను బయటకు తేవడం కొంత కష్టమే అయినా... పదిమంది సభ్యులు కలిగిన 'గాల్స్ ఎట్ డాబాస్' టీమ్.. సోషల్ మీడియాద్వారా అవగాహన కల్పిస్తూ మహిళల్లో మార్పుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఉద్యమాన్నికేవలం సోషల్ మీడియా ద్వారా నడపడం కష్టమేనంటున్న టీమ్... కనీసం విలువలు, హక్కుల గురించైనా తెలిపేందుకు ఇదో ప్రమాదంలేని, ఉచిత మార్గమని భావిస్తోంది. అయితే ప్రస్తుతం మహిళలను అగౌరవంగా, అతి హేయంగా చూస్తున్న సమాజంలో ఉన్నామని, కనీసం ఓ డాబా వద్ద చాయ్ తాగేందుకు, పబ్లిక్ ప్లేస్ లో ఆనందంగా గడిపేందుకు అవకాశం లేకుండా ఉందని ఖత్రి అంటోంది. హక్కులు, స్వేచ్ఛపై పాకిస్తానీ మహిళల్లో అవగాహనకు తమ ప్రయత్నం కొంత మాత్రమైనా సహకరిస్తుందని ఖత్రి ఆశాభావం వ్యక్తం చేస్తోంది.