breaking news
Development of of villages
-
బాధ్యతతో పనిచేద్దాం
అందుబాటులో నిధులున్నా పనులు మాత్రం జరగడం లేదు. కొన్ని పంచాయతీలకు ఆదాయం బాగా ఉన్నా.. వాటి వినియోగం సక్రమంగా లేకపోవడంతో కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో మురుగుతుండగా.. ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. వీటన్నింటినీ అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. - గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పరిషత్‌లో చైర్పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సోమవారం నుంచి వరుసగా పదిరోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తారన్నారు. అభివృద్ధిపై రాజకీయాలెందుకు..? గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దని మంత్రి మహేందర్‌రెడ్డి హితవు పలికారు. ఆదివారం నాటి గ్రామజ్యోతి అవగాహన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు గైర్హాజరయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అభివృద్ధి కంటే రాజకీయాలే ఆ పార్టీ వారికి ముఖ్యమని, అందువల్లే సమావేశానికి రాలేదని పరోక్షంగా చురకలంటించారు. గ్రామజ్యోతితో పల్లెకు వస్తున్న నిధులు.. వాటి ఖర్చు.. చేపట్టే పనులు.. ఇలా సర్వస్వం ప్రజలకు తెలుస్తుందని, అవకతవకలపైన, ఆలస్యంపైనా అధికారులను నిలదీయవచ్చని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. విద్యపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని, బడీడు, బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. మహిళల్లో అక్ష్యరాస్యత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు గ్రామజ్యోతి మార్గదర్శకాలకు వివరించి అవగాహన కల్పించారు. అనంతరం జెడ్పీటీసీలు అభిప్రాయాలు, సలహాలు ఇచ్చారు. చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ మాట్లాడుతూ జిల్లాలో కూడా పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర అంశాల్లో వందశాతం ప్రగతి సాధించిన గ్రామాలున్నాయని, వాటిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. మద్యపాన నిషేదంతోనే అభివృద్ధి సాధ్యమని, కానీ ప్రభుత్వం చీప్‌లిక్కర్ తెచ్చే ప్రయత్నం చేస్తే పల్లెలు ఎలా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. ఇంతలో మంత్రి కలగజేసుకోవడంతో ఆమె ప్రశ్నకు సమాధానం రాలేదు. సమావేశంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజీవరావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి సీఎం బాటలు
- తెలంగాణకే ఆదర్శనం మహమ్మద్‌నగర్ - జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు నిజాంసాగర్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేస్తున్నారని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మహమ్మద్‌నగర్ గ్రామం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధేతో కలిసి బుధవారం ఆయన గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ సీమాంధ్రుల పాలన వల్ల అభివృద్ధి చేయలేకపోయానని, ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాన్ని సుందరంగా అభివృద్ధి చేశానని చెప్పారు. మొదటి నుంచి గ్రామస్తులు తన వెన్నంటి ఉండబట్టే కీలక పదవిలో నిలిచానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌సింధే సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపట్టానన్నారు. ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ఆసరా పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులకు నెలకు రూ.1000 పింఛను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్జుకింది సునంద, ఎంపీటీసీ సభ్యురాలు కుర్షిద్ఉన్నిసా బేగం, టీఆర్ఎస్ నాయకులు వినయ్‌కుమార్, దుర్గారెడ్డి, మోహన్‌రెడ్డి, మోయిస్, విఠల్, పండరి, సాదుల సత్యనారాయణ, చందర్ తదితరులు పాల్గొన్నారు.