breaking news
development of the country
-
నాకు సమాధి తవ్వే పనిలో... విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
మండ్య/ధార్వాడ/హుబ్లీ: పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తనను సమాధి చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందని ఆక్షేపించారు. తనకు ఈ దేశ మాతృమూర్తులు, ఆడపిల్లలు, ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారనే సంగతిని విపక్షాలు మరచిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. పేదల బతుకుల్లో మార్పు దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు. 140 కోట్ల మందిని అవమానించారు విద్యార్థులు తమ చదువులు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని జాతికి అంకితం చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా లండన్‌లో మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులను అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రపంచ దేశాలకు ఆశాకిరణం ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ కర్ణాటకలో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర న్యూఢిల్లీ: చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగిసింది. పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మండ్య జిల్లాకేంద్రంలో ప్రధాని రోడ్డు షోలో పాల్గొన్నారు. -
సరైన ప్రణాళికలతోనే ఉత్పాదకతతో కూడిన ఉపాధి
Civils Prelims Paper - I ఆర్థికవృద్ధి, ఉపాధి మనదేశ అభివృద్ధి విధానంలో ఉపాధి ఒక ముఖ్యాంశంగా ఉంది. భారత్ అభివృద్ధి ప్రణాళికలలో ఉపాధి కల్పనకు అనేక విధానాలు, వ్యూహాలు అవలంభిస్తోంది. 1950వ దశకంలో పారిశ్రామిక ఆధారిత అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఉపాధికల్పనను ముఖ్యాంశంగా పరిగణించలేదు. పంచవర్ష ప్రణాళికలలో వృద్ధికి అనుగుణంగా ఉపాధి కల్పన ఉంటుందని ప్రణాళికా రచయితలు భావించారు. శాశ్వత, అవసరాలకు తగిన నైపుణ్యం ఉన్న శ్రామికులు లభ్యం కావడమనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అత్యవసరం. నాణ్యతతో కూడిన ఉపాధి పెంపునకు ప్రభుత్వ విధానాలు దోహదపడే విధంగా ఉండాలి. స్వాతంత్య్రానంతరం మొద టి నాలుగు దశకాల్లో ప్రభుత్వ రంగం నాణ్యతతో కూడిన ఉపాధి అందించడం ద్వారా ’కౌఛ్ఛీ ఉఝఞౌడ్ఛట’గా నిలిచింది. ప్రభుత్వ శాసనాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగం ఉపాధి నియమావళిని పాటిస్తుందని ఆశించారు. 1970వ దశకం మధ్య భాగంలో అభివృద్ధి ప్రణాళికలో ఉపాధి వృద్ధి ప్రధాన అంశంగా నిలిచింది. స్వల్పకాల వేతన ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు లాంటి ప్రత్యేక ఉపాధి కార్యక్రమాలను ఈ కాలంలో ప్రవేశపెట్టారు. 1990వ దశకం ప్రారంభంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా స్వదేశీ ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ తొలగింపు, విదేశీ వాణిజ్యం సరళీకరణ, పెట్టుబడి ప్రోత్సాహక విధానాలను ప్రవేశపెట్టారు. తద్వారా 1990వ దశకం మధ్య భాగం నుంచి ప్రభుత్వ రంగంలో ఉపాధి వృద్ధి తగ్గింది. సరళీకరణ విధానాల నేపథ్యంలో ఆర్థికవృద్ధి ఉపాధి పెరుగుదలకు దారితీయగలదని ఆశించారు. దీనికి విరుద్ధంగా ఆర్థిక వృద్ధి రేటులో పెరుగుదల ఏర్పడినా ఉపాధి వృద్ధి క్షీణించింది. అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలు, ఏ విధమైన సాంఘిక భద్రతలేని ఉపాధి సృష్టి జరిగింది. 2009-10లో నేషనల్ శాంపుల్ సర్వే వివరాల ప్రకారం 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో దేశంలో ఉపాధి స్తంభించింది. ఉపాధి - జీడీపీ వృద్ధి ఉపాధి వృద్ధిలో దీర్ఘకాల క్షీణతను నిర్లక్ష్యపర్చడం ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఆర్థిక వృద్ధిరేటు కొనసాగుతున్నా ఉపాధి వృద్ధిలో తగ్గుదలను గమనించవచ్చు. 1972 - 73 నుంచి 1983 మధ్య కాలంలో జీడీ పీ వృద్ధి సగటున 4.7 శాతంగా నమోదు కాగా, ఉపాధి వృద్ధి సగటు 2.4 శాతం మాత్రమే. 1983 నుంచి 1993-94 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 5 శాతంగా నమోదైంది. ఈ కాలం లో ఉపాధి వృద్ధి సగటు 2 శాతం మాత్రమే. 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 6.3 శాతం కాగా ఉపాధి వృద్ధి సగటు 1.8 శాతం మాత్రమే. 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో జీడీపీ వృద్ధి సగటు 9 శాతం కాగా, ఉపాధి వృద్ధి రేటు 0.22 శాతంగానే నమోదైంది. దీని ఆధారంగా జీడీపీ వృద్ధికి అనుపాతంగా దేశంలో ఉపాధి వృద్ధి జరగలేదని తెలుస్తోంది. ముఖ్య రంగాల్లో ఉపాధి వృద్ధి 1972-73 నుంచి 2009-10 మధ్య కాలం లో ద్వితీయరంగానికి సంబంధించిన మైనింగ్, తయారీ రంగం, విద్యుత్ శక్తి, వాటర్, గ్యాస్, నిర్మాణరంగంలో ఉపాధి వృద్ధి మిగిలిన ప్రాథమిక, తృతీయ రంగాలతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంది. 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో దేశంలో ఉపాధి వృద్ధి స్తంభించినప్పటికీ ద్వితీయ రంగంలో ఉపాధి వృద్ధి 3.5 శాతంగా నమోదైంది. సేవల (తృతీయ) రంగంలో ఉపాధివృద్ధి మెరుగైనప్పటికీ 1972-73 తర్వాత ప్రతి పదేళ్ల కాలాన్ని పరిశీలించినప్పుడు తగ్గుదల ధోరణిని గమనించవచ్చు. ప్రాథమిక రంగంలో ఆశించిన విధంగా ఉపాధివృద్ధి లేదు. వ్యవసాయ జీడీపీ వృద్ధిరేటులో తగ్గుదల, ఉపాధి వ్యాకోచత్వంలో తగ్గుదల, ప్రాథమిక రంగంలో ఉపాధి వృద్ధిరేటులో తగ్గుదలకు కారణాలుగా పేర్కొనవచ్చు. ద్వితీయ రంగంలో ఉపాధి వ్యాకోచత్వంలో పెరుగుదల కారణంగా పారిశ్రామిక జీడీపీ వృద్ధిరేటులో ఒడుదుడుకులు ఉన్నప్పటికీ అధిక ఉపాధి వృద్ధి జరిగింది. తృతీయ రంగంలో ఉపాధి వ్యాకోచత్వంలో తగ్గుదల కారణంగా అధిక సేవారంగ జీడీపీ వృద్ధి నమోదైనప్పటికీ ఉపాధి వృద్ధిరేటులో పెరుగుదల లేదు. వివిధ కార్యకలాపాల్లో ఉపాధివృద్ధిని పరిశీలించినప్పుడు ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగంలో భాగంగా నిర్మాణ రంగంలో ఉపాధివృద్ధి రేటు అధికంగా నమోదైంది. 1994 నుంచి 2005 మధ్య కాలంలో జీడీపీ వృద్ధిరేటుకు సమానంగా ఈ రంగంలో ఉపాధి వృద్ధి జరిగింది. తయారీ రంగంలోనూ 1983 నుంచి 2005 మధ్య కాలంలో ఉపాధి వృద్ధిరేటు అధికంగా ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో తగ్గింది. మొత్తం ఉపాధిలో మైనింగ్ వాటా 0.56 శాతం, విద్యుత్ శక్తి, వాటర్, గ్యాస్‌ల వాటా 0.26 శాతంగా ఉంది. 1994 నుంచి 2005 మధ్య కాలంలో మొత్తం ఉపాధిలో వీటి వాటా తగ్గింది. సేవా రంగంలో 1994-2005 మధ్య కాలం లో ఉపాధి వృద్ధిరేటు 5 శాతం కాగా, ఆ తర్వాతి కాలంలో తగ్గింది. ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉపాధివృద్ధి 1983-2005 మధ్య కాలంలో అధికంగా ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో 6 శాతం వృద్ధినే నమోదు చేసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాలతో పోల్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి రేటు అధికంగా ఉన్నప్పటికీ, వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధిలో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ముఖ్య వృత్తిగా ఉండటం వల్ల అధిక ఉపాధి కల్పిస్తున్నా ఉపాధివృద్ధి రేటులో తగ్గుదల కారణంగా మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధివృద్ధితక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. 1972-73 నుంచి 1983 మధ్య కాలంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 4.58 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 4.08 శాతం మాత్రమే. 1994 నుంచి 2005 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధి 3.2 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 3.5 శాతంగా నమోదైంది. తర్వాతి కాలంలో ఈ అంశానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి వృద్ధి ఎక్కువ. ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించి రెండు ప్రాంతాల్లోనూ అధిక ఉపాధి వృద్ధి నమోదైంది. 1993-94 నుంచి 2004-05 మధ్య నిర్మాణ రంగంలో ఉపాధి వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 8.3 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 5.6 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధికి సంబంధించి రవాణా రంగం రెండో స్థానాన్ని, వాణిజ్యం మూడో స్థానాన్ని పొందాయి. పట్టణ ప్రాంతా ల్లో రవాణా రంగంతో పోల్చినప్పుడు వాణిజ్యంలో ఉపాధి వృద్ధి ఎక్కువ. ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉపాధివృద్ధి గ్రామీణ ప్రాంతా ల్లో 6.30 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 7.54 శాతం. మొత్తం మీద 1972-73 నుంచి 2009-10 మధ్య కాలంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి వృద్ధిరేటు పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. సంఘటిత రంగంలో ఉపాధి సంఘటిత (ప్రభుత్వ, ప్రైవేటు) రంగం నాణ్యతతో కూడిన ఉపాధిని అందిస్తోంది. మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 10 శాతం. 1990వ దశకం మధ్య భాగం నుంచి మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా క్రమంగా తగుతోంది. దీంట్లో ఉపాధి తగ్గుదల ప్రభుత్వ రంగంలోనే ఎక్కువగా ఉంది. 2001-04 మధ్య కాలంలో ప్రైవేట్ రంగానికి సంబంధించి సంఘటిత రంగంలో ఉపాధి తగ్గినా తర్వాతి కాలంలో పెరిగింది. 2004 తర్వాత ప్రైవేట్ రంగం సంఘటిత రంగంలో ఉపాధి వృద్ధి 3.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ప్రభుత్వ రంగ ఉపాధిలో తగ్గుదల ఏర్పడింది. సంఘటిత రంగంలో వివిధ రంగాల్లో ఉపాధివృద్ధిని పరిశీలించినప్పుడు ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఎక్కువగా ఉంది. మొత్తం సంఘటిత రంగ ఉపాధిలో ఫైనాన్షియల్ సర్వీసులే 9 శాతం వాటా కలిగి ఉన్నాయి. వాణిజ్యం వాటా మొత్తం ఉపాధిలో 3 శాతంగా ఉంది. ఇది 1.8 శాతం ఉపాధివృద్ధి పొందింది. మొత్తం సంఘటిత రంగం ఉపాధిలో 22 శాతం వాటాను కలిగి ఉన్న తయారీ రంగానికి ప్రైవేట్ రంగం లో 50 శాతం వాటా ఉంది. 2004-08 మధ్య కాలంలో తయారీ రంగంలో వృద్ధి ప్రైవేట్ రంగంలో 3.8 శాతంగా నమోదైంది. అసంఘటిత రంగంలో ఉత్పాదకత సంఘటిత రంగంలో ఉపాధి వృద్ధి పెంపు ఆవశ్యకత ఉంది. వ్యవసాయ రంగం లాంటి అసంఘటిత రంగాల్లో ఉత్పాదకతలో పెరుగుదల లేనప్పుడు సంఘటిత రంగంలో నాణ్యతతో కూడిన ఉపాధి కల్పన సాధ్యం కాదు. ఉత్పాదకతను పెంచడంతోపాటు చిన్న, సన్నకారు కమతాలలో ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించడంలో గ్రామీణ వ్యవసాయేతర రంగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆయా కార్యకలాపాలను పటిష్టపరిచే చర్యలు అవసరం. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా నిరుద్యోగులతోపాటు అదనంగా శ్రామికశక్తికి తోడ య్యే వారికి ఉపాధి అందించే విధంగా చర్యలు చేపట్టాలి. ఎగుమతులు ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఎగుమతులు ఆర్థికవృద్ధికి యంత్రంగా ఉపయోగపడగలవని అనుభవ పూర్వక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఎగుమతుల వృద్ధి నాణ్యతతో కూడిన ఉపాధి వృద్ధికి దారితీస్తుంది. భారత్ ఎగుమతుల విలువ 1991లో జీడీపీలో 5.8 శాతం కాగా 2009-10లో 15 శాతానికి చేరుకుంది. భారత్ ఎగుమతులు ఎక్కువగా శ్రమ సాంద్రత ఉత్పత్తుల రకానికి చెందినవి. తద్వారా ఉపాధి పరిమాణం పెంపు, నాణ్యతతో కూడిన ఉపాధికి అవకాశాలు భారత్‌లో ఎక్కువ. ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో భారత్‌లో జీడీపీ వృద్ధి కంటే ఉపాధి వృద్ధిలో క్షీణత ఎక్కువగా సంభవించింది. మరోవైపు భారత్ ఎగుమతుల్లో శ్రమసాంద్రత ఉత్పత్తుల వాటా తగ్గడం ఆందోళన కలిగించే పరిణామం. శ్రమ సాంద్రత ఉత్పత్తుల వాటా భారత్ మొత్తం ఎగుమతుల్లో 1995-96లో 65 శాతం కాగా, 2004-05 నాటికి 50 శాతానికి, 2009-10 నాటికి 1/3 వంతుకు తగ్గాయి. భారత్ శ్రామిక ఉత్పాదకత అమెరికా, జపాన్, ఫ్రాన్స, ఇంగ్లండ్ కంటే తక్కువ. ఉత్పాదకత పెంపులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఉపాధి వృద్ధి తగ్గుదలకు దారితీస్తుంది. గత కొంత కాలంగా భారత్ ఎగుమతుల్లో సేవల ఎగుమతుల వాటా క్రమంగా పెరుగుతోంది. మొత్తం ఎగుమతుల విలువలో వీటి వాటా 36 శాతం వరకు ఉంది. ఇటీవల రవాణా, ట్రావెల్ లాంటి ఇతర సర్వీసుల ఎగుమతుల విలువలోనూ పెరుగుదల ఏర్పడింది. సాఫ్ట్వేర్ సర్వీసులు, వ్యాపారం, ఫైనాన్షియల్ సర్వీసుల ఎగుమతుల విలువలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. భారత్‌లో శ్రామిక చట్టాల్లో మార్పుల ద్వారా ఉపాధి పెంపునకు చర్యలు అవసరం. అధిక జీడీపీ వృద్ధితోపాటు తక్కువ ఉపాధి వ్యాకోచత్వం ఉపాధి వృద్ధికి తోడ్పడటం ద్వారా ఉత్పాదకత పెంపునకు దారితీస్తుంది. నాణ్యతతో కూడిన ఉపాధిని అందించే విధానంలో వేగవంతమైన వృద్ధిరేటు సాధించే వ్యూహం అంతర్భాగంగా ఉండాలి. -
బీజేపీతోనే అభివృద్ధి : వెంకయ్యనాయుడు
మదనపల్లె, న్యూస్‌లైన్: దేశంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని బీజేపీ జాతీయనాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం రాత్రి స్థానిక మిషన్ కాంపౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రపంచదేశాలు ఆదర్శంగా తీసుకుంటున్న తరుణంలో భారతదేశంలో ఆయన నాయకత్వానికి మద్దతునివ్వాల్సిన ఆవసరం ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా 24గంటలు కొనసాగుతుందన్నారు. ‘గుజరాత్లో కరెంటు పోదు.. ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు రాదు’ అన్న చందాన ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. పల్లెపల్లెకూ పక్కారోడ్లు, ప్రతి ఇంటికి, పాఠశాలలకు మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు ప్రతి చేనుకూ నీరు, ప్రతి చేతికీ పని- అన్న సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేస్తామని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సీమకు 200 టీఎంసీల నీరు వచ్చేలా కృషి చేస్తామన్నారు. గత ముఖ్యమంత్రులు అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేశారని విమర్శించారు. రాయలసీమలో కేంద్రీయ విశ్వ విద్యాలయాల ఏర్పాటుతోపాటు మదనపల్లె బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని ప్రకటించారు. సినీనటులు శివాజీ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ముఖ్య మంత్రులు ఈ జిల్లాలోని మదనపల్లెకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ, మదనపల్లెను మరో గుజరాత్‌గా తీర్చిదిద్దాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రచార కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి, సినీ నటుడు కృష్ణంరాజు, సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు ప్రసంగించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, జిల్లా నాయకులు భాను ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ ఏవీ.సుబ్బారెడ్డి, బండి ఆనంద్, సామంచి శ్రీనివాస్, ప్రశాంత్, భగవాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అధికసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. బీజేపీలోకి వాసుదేవరెడ్డి మదనపల్లె, న్యూస్‌లైన్: ప్రముఖ వ్యాపారవేత్త, సినీనిర్మాత, ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత చిన్నా వాసుదేవరెడ్డి బీజేపీలో చేరారు. గురువారం స్థానిక మిషన్‌కాంపౌండ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కిసాన్ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయన జాతీయ నాయకులు వెంకయ్యనాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు వెంకయ్యనాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈయన 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున మదనపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. అనంతరం రాజకీ యాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనంతో చిరంజీవికి సైతం దూరంగా ఉంటూ ఇప్పుడు పార్టీ మారారు.