breaking news
detonates
-
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జవానులు దుర్మరణం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవానులు మృతి చెందగా, ఆర్మీకి చెందిన ఆరుగురితోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.నాగ్‌పూర్‌లోని కన్హాన్ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఆటో, బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఇద్దరు జవానులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు సైనికులతో పాటు ఆటో డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా తొమ్మది మంది ఉన్నారు. ఈ ఆర్మీ సిబ్బంది కమతిలోని గార్డ్ రెజిమెంట్ సెంటర్‌కు చెందినవారు. ఈ ప్రమాదంపై న్యూ కమతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..
టర్కీ పేలుళ్ళ సూత్రధారులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డవారుగా భావిస్తున్నవారి ఫోటోలను స్థానిక మీడియా వెల్లడించింది. రైఫిళ్ళు చేత పట్టుకొని ముగ్గురు దుండగులు దాడులకు తెగబడినట్లుగా ఫోటోలనుబట్టి తెలుస్తోంది. పర్యాటక నగరం ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి, 41 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఉన్మాదుల దాడిలో 230 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ పనేనని టర్కీ ప్రధాని బినాలీ ఇల్ డ్రిం అంటున్నారు. మృతుల్లో ఐదుగురు సౌదీకి చెందినవారు, ఇద్దరు ఇరాక్ దేశస్థులు, ఇంకా జోర్దాన్, టునీషియా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఉక్రెయిన్ లకు చెందిన 13 మంది విదేశీయులున్నారు. ప్రస్తుతం విడుదలైన వీడియోలను బట్టి చూస్తే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గురు, కాల్పులు జరిపిన అనంతరం తమను తాము రైఫిళ్ళతో పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. గత మార్చిలో బ్రసెల్స్ లో కూడా ఇదే తరహాలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. అయితే ప్రస్తుత దాడుల్లో ఉగ్రవాదులెవరూ ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం నుంచీ ప్రవేశించలేదు. ముందుగా ఓ వ్యక్తి టర్మినల్ కు బయటే తనను తాను పేల్చేసుకోగా.. సందట్లో సడేమియాగా మిగిలిన ఇద్దరూ ఎయిర్ పోర్టు భవనంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. బిల్డింగ్ దగ్గరకు నడుచుకుంటూ వెడుతున్నటెర్రరిస్టు, మరో ఫోటోలో నల్లని డ్రస్ ధరించి రైఫిల్ చేత పట్టుకొని కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటపడటంతో పోలీసులు ఆ ఫుటేజీని విడుదల చేశారు.