breaking news
Department of Power employees
-
నవ్విపోదురు గాక..!
విజయనగరం ఫోర్ట్: విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను విజయనగరంలో ఉన్న తన సొంత ఇంటికి అక్రమంగా వినియోగించుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను తన సొంత ఇంటికి మూడేళ్లుగా వాడుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సొంత ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. ఈ ముగ్గురు ఉద్యోగులే కాదు. అనేక మంది ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ లబ్ధిని అక్రమ మార్గాన పొందుతూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో అధికశాతం మంది విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోలేని పరిస్థితి. అటువంటి వారికి చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే కంచే చేను మేసినట్లు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పొందుతుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 1,00,987మంది జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ పథకం కింద లబ్ధిదారులు 1,00,987 మంది. వారికి ఏడాదికి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తున్న నిధులు రూ.10.95 కోట్లు. గుర్తించిన అనర్హులు 19,996 మంది జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని అక్రమంగా పొందుతున్న వారు 19, 996 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి జాబితాను విద్యుత్ శాఖ అధికారులకు పంపించింది. 2019 నుంచి ఉచిత విద్యుత్ పొందుతున్న వీరికి ప్రభుత్వం వెచ్చించింది రూ.6 కోట్లు. అనర్హులపై జాబితాపై సర్వే ప్రభుత్వం అందించిన అనర్హుల జాబితా ప్రకారం విద్యుత్‌శాఖ అధికారులు ఇప్పటివరకు 2,880 మందిని సర్వే చేశారు. ఇంకా 17,116 మందిని సర్వే చేయాల్సి ఉంది. సర్వేలో విస్తుగొల్పే విషయాల్లో వెల్లడవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు కాని బీసీ, ఓసీ వర్గాల వారు కూడా ఉచిత విద్యుత్ పొందుతుండడం గమనార్హం. నెలాఖరు లోగా సర్వే పూర్తి అనర్హుల జాబితా ప్రకారం ఇప్పటి వరకు 2,880 మందిని సర్వే చేశాం. ఈ నెలాఖరు లోగా పూర్తి చేస్తాం. అనర్హుల్లో ఉద్యోగులు ఉంటే వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటాం. – పి.నాగేశ్వరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ (చదవండి: సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...) -
విశాఖకు ‘పశ్చిమ’ సేనలు
ఏలూరు అర్బన్/ఏలూరు టూటౌన్ :హుదూద్ తుపాను విసిరిన జల ఖడ్గం ధాటికి కకావికలమైన విశాఖపట్నంలో పరిస్థితులను చక్కదిద్దేం దుకు జిల్లా నుంచి మునిసిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆదివారం రాత్రి పెద్దఎత్తున తరలి వెళ్లారు. అక్కడ చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో వీరంతా పాలు పంచుకుంటారు. ఏలూరు నగరపాలక సంస్థ, ఐదు మునిసిపాలిటీల నుంచి 550 మంది పారిశుధ్య సిబ్బంది, 17 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు విశాఖపట్నానికి తరలి వెళ్లారు. వీరిలో ఏలూరు నుంచి 200 మంది పారిశుధ్య కార్మికులు, 9మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, భీమవరం మునిసిపాలిటీ నుంచి 100 మంది పారిశుధ్య సిబ్బంది, ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, నరసాపురం నుం చి 50 మంది పారిశుధ్య కార్మికులు ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, పాలకొల్లు నుంచి 50 మంది పారిశుధ్య కార్మికులు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, తాడేపల్లిగూడెం నుంచి 50 మంది పారిశుధ్య సిబ్బంది, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, తణుకు నుంచి 100 మంది పారిశుధ్య కార్మికులు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వీరంతా సోమవారం విశాఖ చేరుకుని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ జీవీఎస్ఎన్ మూర్తికి రిపోర్ట్ చేస్తారని మునిసిపల్ వర్గాలు తెలిపారుు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నలుగురు తహసిల్దార్లు, 30మంది వీఆర్వోలను తుపాను బాధిత ప్రాంతాలకు పంపిస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. వీరందరికీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. తుపాను తీరం దాటిన అనంతరం కలెక్టర్ భాస్కర్ శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. తుపాను సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు అవసరమైతే ఆధునిక యంత్రాలనుకూడా పంపిస్తామని అక్కడి కలెక్టర్లకు చెప్పారు. తరలివెళ్లిన విద్యుత్ ఉద్యోగులు విశాఖపట్నంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యల్లో పాలు పంచుకునేందుకు జిల్లా నుంచి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని అక్కడికి పంపించినట్టు ఎస్ఈ సీహెచ్.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏడుగురు డీఈలు, 20 మంది ఏడీఈలు, 37 మంది ఏఈలు, నైపుణ్యం గల 360 మంది సిబ్బందిని విశాఖపట్నం తరలించామని ఆయన వివరించారు. 100 కిలోమీటర్ల నిడివి గల కండక్టర్ వైర్, 90 ట్రాన్స్ఫార్మర్లను కూడా పంపించామన్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ మిరియూల శేషగిరిరావు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 40 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయ్ హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు జిల్లాలో 33 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 6, 12 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 34 దెబ్బతిన్నాయని ఎస్ఈ చెప్పారు. వాటికి వెంటనే మరమ్మతులు చేరుుంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. యలమంచిలి మండలం కత్తవపాలెం, దొడ్డిపట్ల, నిడదవోలు మండలం ప్రక్కిలంక, రామన్నగూడెం, వీరవాసరం మండలం శృంగవృక్షం, భీమవరం, తాడువాయి, ఎ.పోలవరం తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు ఎస్ఈ వివరించారు. పెరవలిలో చెట్టుకూలి విద్యుత్ లైను పాడైందని, వెంటనే మరమ్మతులు చేయించామని చెప్పారు. ఆకివీడు, కోళ్లపర్రు గ్రామాల్లో 5 కేవీ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వాటికి కూడా తక్షణమే మరమ్మతులు చేయించామని చెప్పారు.