breaking news
Department Endowments
-
దేవుడి భూములకే దిక్కులేదు
♦ కబ్జా కోరల్లో ఆలయ భూములు ♦ వేలాది ఎకరాలు అన్యాక్రాంతం ♦ ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముకుంటున్న వైనం ♦ స్వాధీనానికి చర్యలు చేపట్టని దేవాదాయశాఖ అధికారులు ♦ అమలుకు నోచుకోని మంత్రి ఆదేశాలు ♦ ఆన్లైన్లో కనిపించని భూముల వివరాలు కనిగిరి: జిల్లాలో వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యూరుు. పైసా కౌలు చెల్లించకుండా ఆక్రమణదారులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయూల విలువైన భూములను కొందరు దర్జాగా ప్లాట్లు వేసి విక్రరుుంచుకుంటున్నా అడిగే నాధుడే లేరు. కబ్జాకు గురైన మాన్యం భూములను స్వాధీనం చే సుకుని, వేలం ద్వారా కౌలుకిచ్చి ఆదాయం పెంచాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. భూముల వివరాలు ఆన్లైన్ చేయూలన్న అమాత్యుల ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్నారు. వందల ఎకరాల భూములు రికార్డుల్లో తప్ప ఎక్కడున్నాయో తెలియడం లేదు. గుర్తించినవి వందల ఎకరాలే.. జిల్లాలో 1651 దేవాలయాలుండగా, వాటి పరిధిలో 32,755 ఎకరాలు భూములున్నాయి. మీ ఇంటికి-మీ భూమి గ్రామసభల్లో రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు రెండు వేల ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైనట్టు గుర్తించారు. వాటిలో కనిగిరి నియోజకవర్గంలో వందెకరాలు మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో మరో 3,500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు సమాచారం. కనిగిరి నియోజకవర్గంలో 15 ఆలయాలకు సుమారు మూడు వేల ఎకరాల భూములున్నాయి. వాటిలో కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, పీసీపల్లి మండలాల్లోని సుమారు 700 ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నాయి. ఆన్లైన్లో వెలుగు చూడనవి ఎన్నో.. భూముల వివరాలన్నీ ఆన్లైన్ చేయూలన్న దేవాదాయశాఖ మంత్రి ఆదే శాలు అమలుకు నోచుకోలేదు. అన్యాక్రాంత భూములు ఆన్లైన్లో కన్పించడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ఆక్రమణదారులు, అధికారుల లాలూచిలతో చాలా వరకు భూములు రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. కబ్జా చేసి.. ప్లాట్లుగా మార్చి.. పామూరులో వేణుగోపాలస్వామి, శ్రీవల్లి భుజంగేశ్వరస్వామి ఆలయ భూములు సుమారు 35 ఎకరాల వరకు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. సీఎస్‌పురంలోని తిరుమలనాధుని ఆలయ భూములు 100 ఎకరాలు కబ్జాకు గురికాగా, కనిగిరిలోని శంఖవరం. పీసీపల్లిలోని శివాలయ, భద్రాచలం రామాలయ భూములు ఆక్రమణలో ఉన్నాయి. జిల్లాలోని మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి, రాచర్ల ఉమామహేశ్వర, పొన్నలూరు దుర్గ మల్లేశ్వర, కందుకూరు జనార్దన, గిద్దలూరు ఆంజనేయస్వామి దేవస్థానాల భూములు కూడా కొంత అక్రమణలో ఉన్నట్లు సమాచారం. మార్తాండుని భూములు హాంఫట్.. కనిగిరిలోని విజయమార్తాండేశ్వర స్వామి భూములు వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కోట్ల విలువ చేసే ఆస్తులన్నా.. సరైన ఆదరణ లేదు. నెల్లూరు, జలదంకి, కావలి, ఉదయగిరి, అల్లూరు, సోమేశ్వరం ప్రాంతాల్లో వీటి భూములున్నాయి. విచిత్రమేమంటే వీటికి సంబంధించిన సుమారు 100 ఎకరాల భూములు ఎక్కడున్నాయో.. అధికారులకే తెలియదు. కనిగిరి మండలంలో అయ్యన్నపాలెంలో సర్వే నం: 8, 9, 10, 15, 20, 23, 28 లలోని సుమారు 100 ఎకరాలు మాన్యం భూమి రికార్డుల్లో కన్పించడం లేదు. నెల్లూరు జిల్లా జలదంకి లో సుమారు 100 ఎకరాలు భూమిని దర్జాగా అక్రమార్కులు సాగు చేసుకుంటున్నారు. చాకిరాల శివాలయానికి చెందిన167 ఎరకాలు భూమి చాకిరాల, తుమ్మగుంట, హజీస్‌పురం, పద్మాపురం గ్రామాల్లో ఉంది. ఏళ్ల కాలం నుంచి కొంత భూమి కౌలు చెల్లించకుండా అక్రమ సాగుచేస్తున్నారు. ఇదంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలియకుండా జరుగుతుందనుకుంటే పొరబాటే. -
దేవుడి మాన్యం.. కబ్జాల మయం
- ఆక్రమణల బారిన 206 ఎకరాలు - తీర్పులు అనుకూలంగా వచ్చినా స్వాధీనం చేసుకోలేకపోతున్న దేవాదాయ శాఖ - ప్రత్యర్థులకు ప్రజాప్రతినిధుల అండ ఏలూరు(ఆర్ఆర్ పేట) : జిల్లాలో 41 ఆలయాలకు సంబంధించిన 206 ఎకరాలు భూమి ఆక్రమణలకు గురైనట్టు దేవా దాయ శాఖ గుర్తించింది. జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెం రామాలయానికి చెందిన 42 ఎకరాలు, ఏలూరు భగవత్ ప్రార్థనా సమాజానికి చెందిన 13 ఎకరాలు, తాడేపల్లిగూడెం తాళ్లముదునూరుపాడు బాలవెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 13 ఎకరాలు, చివటంలో ఏకాంబరేశ్వరస్వామి ఆలయానికి చెంది న 6ఎకరాలు, ఏలూరు మార్కండేయస్వామి ఆలయానికి చెందిన 1.10 ఎకరాలు పెద్ద విస్తీర్ణం కలిగినవి. చిన్నా చితకా కలిపి మొత్తంగా 206 ఎకరాల భూమి ఆక్రమణలోనే ఉంది. కోర్టు ఉత్తర్వులిచ్చినా .. ఆక్రమణలో ఉన్న దేవుడి మాన్యాలను స్వాధీనం చేసుకోవటానికిదేవాదాయ శాఖ కోర్టుల్లో కేసు లు దాఖలు చేసింది. తీర్పు దేవాదాయ శాఖకు అనుకూలంగా వచ్చిన సందర్భాల్లోనూ ఆయా భూములను స్వాధీనం చేసుకోవడంలో ఆ శాఖ అధికారులు విఫలమౌతున్నారు. కోర్డు ఉత్తర్వు లు వచ్చిన ఆలయాల భూములను స్వాధీనం చేసుకోవటానికి వెళ్లే అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులో, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులో జోక్యం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోకుండా అటంకం కలిగిస్తున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 10 ఆలయాలు, సంస్థలకు చెందిన సుమారు 30 ఎకరాల భూమికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా వాటిని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోలేక పోయారు. సాధారణంగా కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులకు సైతం పోలీసులు రక్షణ కల్పించి భూములను స్వాధీనం చేసుకోవడంలో సహకరి స్తారు. కానీ దేవాదాయ శాఖ భూముల విషయంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతిని ధుల ప్రమేయంతో పోలీసులు కూడా వాటిని స్వాధీనం చేసుకోవడంలో సహకరించడం లేదు. గత ఏడాది ఏలూరులోని కంది అయ్యన్న సత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులను స్థానికులు అడ్డగించడంతో పోలీసుల సహాయం కోరారు. అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో సహకరించలేదు. మంత్రి ఈ జిల్లా వారైనా.. జిల్లాకు చెందిన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాలో ఆక్రమణలో ఉన్న దేవాదాయ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుందనుకున్నారంతా. ఆయన బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటిునా ఇప్పటికీ ఒక్క భూమిని కూడా స్వాధీనం చేసుకోలేకపోవడంపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు.