ఎంపీ జేసీ పరామర్శ
అనంతపురం న్యూసిటీ : డెంగీతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం పరామర్శించారు. శనివారం వినాయకనగర్‌లోని పిల్లల తండ్రి ఖలందర్, వారి కుటుంబీకులతో జరిగిన తీరుపై చింతిస్తున్నామని జేసీ చెప్పారు. ఏవిధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 21న సీఎం చంద్రబాబును కలసి పరిస్థితిని వివరిస్తానన్నారు. అనంత నగరాభివృద్ధి వేదిక వ్యవస్థాపకుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు కృష్ణం రఘు, కార్పొరేటర్ దుర్గేష్ పాల్గొన్నారు.
నేనేమీ చేయలేనమ్మా.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. వినాయకనగర్ ప్రజలు కాలువలు శుభ్రం చేయడం లేదని ఎంపీకి చెప్పారు. అందుకు ఎంపీ ‘ నేనేమీ చేయలేనమ్మా. అంతా మున్సిపాలిటోళ్లు చూసుకోవాలి. మీరు అక్కడకు ధర్నా చేయండి’ అని హితవు పలికారు. ఆ సమాధానంతో వారు అవాక్కయ్యారు.