breaking news
Degree annual exams
-
పరీక్షకు వెళుతూ.. మృత్యు ఒడికి
సాక్షి, రాయచోటి టౌన్ : చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలోని మల్లూరమ్మ తిరునాలకోసం బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం నాగిరెడ్డి గారిపల్లెకు చెందిన ఎం. ఓబుల్‌రెడ్డి (48) గురువారం రాత్రి జరిగే తిరునాలకోసం బుధవారం మల్లూరుకు వచ్చారు. అదేరోజున తన తోడల్లుడి కుమార్తె భార్గవి, అల్లుడు మహేశ్వరరెడ్డి కూడా గుర్రంకొండ నుంచి వచ్చారు. భార్గవి డిగ్రీఫైనల్ ఇయర్ చదువుతోంది. గురువారం రాయచోటిలో పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో భార్గవి భర్త ద్విచక్రవాహనం కావాలని, తన భార్యను పరీక్షకు తీసుకెళ్లాలని మామ ఓబుల్‌రెడ్డిని అడిగారు. అయితే తనకు కూడా రాయచోటిలో పని ఉందని, పరీక్ష కేంద్రానికి నేను తీసుకెళతానని చెప్పి కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాయచోటి సమీపంలోని ఏజీ గార్డెన్ మలుపువద్దకు రాగానే కడప నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్గవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
25 నుంచి ఓయూ డిగ్రీ వార్షిక పరీక్షలు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరానికి మార్చి 25 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 19న ప్రాక్టికల్ పరీక్షలు ముగియనున్నాయి. రెగ్యులర్ డిగ్రీ కోర్సులతో పాటు ఓయూ దూరవిద్యకు సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొ.భిక్షమయ్య తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం జోన్ల వారీగా పరీక్షా కేంద్రాలను సమీప కళాశాలల్లో వేయాలని, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యజమానుల సంఘం అధ్యక్షులు ఇ.నర్సింహ యాదవ్ డిమాండ్ చేశారు.