-
గీత స్మరణం
పల్లవి : నా పరువం నీకోసం... (2) పానుపువేసి ఉన్నదీ వాకిలి తీసి ఉన్నదీ కోరిక పండగా నిండుగా... ॥పరువం॥ చరణం : 1 రాకరాక వచ్చానోయి మీ ఇంటికి ఈ పొదరింటికీ లేకలేక నచ్చావోయి నా కంటికి నా చిగురొంటికీ ఈ సమయం నా హృదయం... (2) నిన్ను చూసి నాగులాగ ఊగుతున్నదీ చెలరేగుతున్నదీ ॥పరువం॥ చరణం : 2 ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా ఈ రోజూ ఇక రాదూ... (2) ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగ కాచుకున్నది ॥పరువం॥ చిత్రం : యుగంధర్ (1979) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.జానకి నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఆమె: పూజకు వేళాయెరా... రంగపూజకు వేళాయెరా... ఆ... పూజకు వేళాయెరా... ఇన్నినాళ్లు నేనెటుల వేచితినో ఎన్ని రేలు ఎంతెంత వేగితినో ॥ పిలుపును విని విచ్చేసితివని నా పిలుపును విని విచ్చేసితివని వలపులన్నీ నీ కొరకె దాచితిని (2) ఎవరూ పొందని ఏకాంతసేవలో ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు ॥ చరణం : ఆ: ఈ నీలినీలి ముంగురులు... ఇంద్రనీలాల మంజరులు ఈ వికసిత సిత నయనాలు... శతదళ కోమల కమలాలు అరుణారుణమీ అధరము... తరుణమందార పల్లవము ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు పాలకడలిలో ఉదయించు సుధాకలశాలు... ఎంత సుందర ము శిల్ప బంధురము ఈ... జఘన మండలము సృష్టినంతటిని దాచుకున్న ఆ పృథివీ మండలము అతడు: ఓ... అభినవ సౌందర్యరాశీ ఓ... అపూర్వ చాతుర్యమూర్తీ నీ కటాక్షముల లాలనమ్ములో... నీ మధురాధర చుంబనమ్ములో... ॥కటాక్షముల॥ మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో హాయిగా నిదురించ గలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయె తల్లీ తల్లీ తల్లీ... ఆ: స్వామీ అ: అవునమ్మా నీవు ప్రదర్శించిన సౌందర్యం అనిత్యం నీవు నమ్ముకున్న యవ్వనం అశాశ్వతం దువ్వుకున్న ఆ నీలిముంగురులె దూదిపింజలై పోవునులే నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వక్కలై పోవునులే పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే నడుము వంగగా నీ ఒడలు కుంగగా నడుము వంగగా ఒడలు కుంగగా నడువలేని నీ బడుగు జీవితం... వడవడ వణకునులే ఆశలు రేపే సుందర దేహము అస్థిపంజరంబౌనులే చిత్రం : భక్త తుకారాం (1973) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : పి.ఆదినారాయణరావు, గానం : ఘంటసాల, పి.సుశీల
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement