breaking news
dalith students
-
ఓయూలో నిరుద్యోగ ఆవేదన సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ ఆవేదన సభను చేపట్టారు. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ.. ఓయూ లైబ్రరరీ నుంచి భారీ ర్యాలీ చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తన ఉనికిని కాపాడుకోవాడానికే కేసీఆర్ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారని విద్యార్థి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
దళిత విద్యార్ధుల్ని కొట్టిన టీడీపీ నాయకులు
-
ఆత్మహత్యకు దిగిన 60మంది దళిత విద్యార్థులు
మోతిహార: బిహార్‌కు చెందిన 60మంది దళిత విద్యార్ధులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకుంటే తాము చనిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో రాజధాని ఇంజనీరింగ్ కళాశాల(ఆర్ఈసీ)లో బీహార్‌కు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. అయితే, వారికి బిహార్ ప్రభుత్వం నుంచి స్టైపండ్ రూపంలో అందాల్సిన నిధులు అందకపోవడంతో జనవరి 8 న కళాశాల యాజమాన్యం వారిని వసతిగృహం నుంచి బలవంతంగా ఖాళీ చేయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్ధులు ఇక తమ చదువు ముందుకు సాగదని భావించి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఈ 60మంది దళిత విద్యార్ధుల్లో 18 మంది తూర్పు చంపారన్, 42 మంది పశ్చిమ చంపారన్‌కు చెందినవారు ఉన్నారు. ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు తిరిగి చెల్లించేట్లయితేనే కాలేజీకి రావాలని ఆదేశించారు.