breaking news
Cyberabad Special Operations Team
-
ఏకంగా దూరదర్శన్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు
ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా నాలుగోసారి పోలీసులకు చిక్కిన ఘనుడు సిటీబ్యూరో: మోసం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేయడం అతనికి అలవాటు. మూడుసార్లు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా అతని బుద్ధి మారలేదు. ఈసారి ఏకంగా దూరదర్శన్ డెరైక్టర్‌గా అవతారం ఎత్తి.. ఉద్యోగాలిప్పిస్తానని రూ.14 లక్షలు కాజేశాడు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు వలపన్ని గురువారం ఇతడిని అరెస్టు చేశారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి కథనం... ప్రకాశం జిల్లా సూర్యోదయకాలనీకి చెందిన బైల్లా వినోద్‌కుమార్ (34) ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో మోసాల బాట పట్టాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించడం తో 2010లో సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశా రు. ఆ తర్వాత జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వినోద్‌కుమార్ గిద్దలూరు మున్సిపాలిటీ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించడంతో 2012లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తిరిగి 2014లో ఇదే తీరులో పట్టుబడి జైలుకెళ్లాడు. బెయిల్‌పై తిరిగి వచ్చిన వినోద్‌కుమార్ తనకు తాను దూరదర్శన్ డెరైక్టర్‌గా నకిలీ ఐడీ కార్డు తయారు చేయించుకున్నాడు. doordarshan.newdelhi99@gmail.com నకిలీ మెయిల్ తయారు చేశాడు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఉన్న తన ఫొటోలను పలువురికి చూపించి తన పలుకుబడి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దూరదర్శన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొండల్‌రెడ్డి నుంచి రూ.8 లక్షలు, వెంకటేశ్వర్‌రెడ్డి నుంచి రూ.3 లక్షలు, బి.నిరోష నుంచి రూ.3 లక్షలు, వి.శశిరేఖ నుంచి రూ.60 వేలు... ఇలా రూ.14.60 లక్షలు వసూలు చేశా డు. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాడు. ఆ పత్రాలను తీసుకుని వారు రా మంతాపూర్లోని దూరదర్శన్ కేంద్రానికి వెళ్లగా అవి నకిలీవని, వినోద్‌కుమార్ అనే వ్యక్తి అ క్కడ లేడని తేలిసింది. దీంతో బాధితులు ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విషయాన్ని వివరించారు. కమిషన ర్ ఆదేశాల మేరకు ఓఎస్ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు వి.ఉమేందర్, బి.పుష్పన్‌కుమార్, ఎస్ఐలు పి.ఆంజనేయులు , ఎ.రాములు రంగంలోకి దిగి వినోద్‌కుమార్ ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ ఉ ద్యోగ నియామక పత్రాలు, విమాన టికెట్లు, దూరదర్శన్ డెరైక్టర్ నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిం దితుడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. -
రూ. 15 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గుట్టురట్టుచేసిన మూడు రాష్ట్రాల పోలీసులు రాజధాని శివార్లలో కేంద్రాలు పోలీసుల అదుపులో 15 మంది నిందితులు ఎపిడ్రిన్‌గా అనుమానం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలో నడుస్తున్న డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. బెంగళూరులో దొరికిన తీగెను లాగితే దాని డొంక రాజధాని శివార్లలోని హయత్‌నగర్‌లో కదిలింది. కేరళ, కర్నాటక, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు కలిసి ఈ రాకెట్ కేంద్రాలపై దాడులు జరిపారు. ఇందులో రూ.15 కోట్ల విలువైన ఏడు టన్నుల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి సరఫరాకు బాధ్యులైన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లోని గండిచెరువు, సూర్మైగూడ, లష్కర్గూడతో పాటు నల్లగొండలోని చౌటుప్పల్‌లో ఈ దాడులు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన దాడులు సోమవారం అర్ధరాత్రి వరకూ సాగాయి. సంబంధిత గోడవున్లలో అనధికారికంగా కొన్ని రకాల రసాయనాలు తయారు చేస్తున్నట్లు కూడా వెల్లడైంది. వాటిని, మత్తుపదార్థాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. పట్టుబడినవి ఎపిడ్రిన్ అని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై తొలుత కేరళ పోలీసులకు ఉప్పందింది. వారు వారం కిందట ముగ్గురు అనుమానితులను ప్రశ్నించగా హైదరాబాద్‌లో మూలాలు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేరళ, బెంగళూరుకు చెందిన యాంటి నార్కొటిక్ వింగ్ అధికారులు, పోలీసులు నిందితులను వెంట తీసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విషయాన్ని చెప్పారు. ఆ మేరకు ఎస్ఓటీ పోలీసుల సహకారంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు హయత్‌నగర్ మండలంలోని గండిచెరువులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేతకు చెందిన గోడవున్పై దాడి చేశారు. అక్కడి సిబ్బందిలో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి సమీపంలోని లష్కర్‌గూడలో డ్రగ్ మాఫియా తలదాచుకుంటున్న గదిని కూడా సీజ్‌చేశారు. కొద్ది దూరంలో ఉన్న సాయిప్రియ కెమికల్స్ కంపెనీపై కూడా దాడి చేశారు. ఆయా ప్రాంతాలకు మీడియాను అనుమతించ లేదు. దాడుల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.