breaking news
Cow Cess
-
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
ఆవుల కోసం ఓ పన్ను వడ్డింపు!
ఛండీగడ్: పంజాబ్ ప్రభుత్వం ఆవుల సంరక్షణకు త్వరలోనే ఓ పన్ను (కౌ లెవీ సెస్) విధించనుంది. వాహనాల కొనుగోలు, విద్యుత్, ఇతర సేవలపై ఈ పన్ను విధించాలని నిర్ణయించినట్లు స్థానిక సంస్థల శాఖ మంత్రి అనిల్ జోషి తెలిపారు. నాలుగు చక్రాల వాహనాలపై వెయ్యి రూపాయలు, ద్విచక్ర వాహనాలపై రూ. 500 చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. ఆయిల్ ట్యాంకర్లపై రూ.100, విద్యుత్ వినియోగదారులపై ఒక యూనిట్‌కు అదనంగా 2 పైసలు, విదేశీ మద్యంపైన రూ.10, స్థానిక మద్యంపై రూ.5 పన్నుగా విధించాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా తీర్మానాలు ఆమోదించారు. ఈపన్ను ఈనెల 25 నుంచి అమలులోకి రానుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కౌ లెవీ సెస్ కోసం 2014 లోనే ఎన్ఫోర్స్మెంట్ శాఖకు ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు ఆమోదం లభించింది. పంజాబ్ లోని భటిండా మున్సిపల్ కార్పొరేషన్ 2009లోనే ప్రయోగాత్మకంగా ఈ పన్నును విధించింది. స్థానిక సంస్థల నిర్ణయం వల్ల ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుందని, రాష్ట్రంలో 2.69 లక్షల ఆవులు 472 షెల్టర్లలలో ఉన్నట్టు గోసేవా కమిషన్ చైర్మన్ కీమ్తి భగత్ తెలిపారు. పంజాబ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం పశుసంపదను కాపాడటం స్థానిక సంస్థల బాధ్యత.