హెచ్‌పీసీఎల్ సీఎండీకి ‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’
సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవను‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది. ఇంగ్లం డ్కు చెందిన ఎనర్జీ, పెట్రో కెమికల్స్, మెటల్ వ్యాపార దిగ్గజం ‘ప్లాట్స్’ ప్రతి ఏటా అందించే ఈ అవార్డు ఏషియా ఫసిఫిక్ రీజియన్‌లో ఓ భారతీయ మహిళకు దక్కడం ఇదే తొలిసారి. ఇండియా, చైనా, హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు ఫైనల్‌కు చేరగా వారిలో నిషిని అవార్డుకు ఎంపిక చేసినట్లు
250 మంది స్వతంత్ర న్యాయ నిర్ణేతల బృందం ప్రకటించిందని సంస్థ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ ఎఎస్‌వి రమణన్ బుధవారం వెల్లడించారు. హెచ్పీసీఎల్లో నిషి 1974 నుంచి నుంచి సేవలు అందిస్తున్నారు. గతేడాది సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అత్యధిక అమ్మకాల ద్వారా సంస్థను లాభాల బాట పట్టించారు.