breaking news
CM Trivendra Singh Rawat
-
సినీ నిర్మాతలు,దర్శకులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త
-
ఉత్తరాఖండ్‌లో సినిమా షూటింగ్ ఉచితం
డెహ్రాడూన్: సినిమా నిర్మాతలు, దర్శకులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ఉత్తరాఖండ్‌లో ఉచితంగా సినిమా షూటింగ్‌లు జరుపుకోవచ్చని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. సినిమా షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌ను కేంద్రస్థానంగా మార్చడంలో భాగంగా చిత్రీకరణ ఫీజును రద్దుచేశామన్నారు. తెహ్రీ పట్టణంలో శుక్రవారం షాహీద్ కపూర్ నటిస్తున్న ‘బిజ్లీ గుల్ మీటర్ చాలూ’ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి రావత్ క్లాప్ కొట్టారు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఉత్తరాఖండ్ సినిమాల చిత్రీకరణకు అద్భుతమైన చోటని రావత్ వ్యాఖ్యానించారు. -
చార్ధామ్ యాత్రికులంతా క్షేమం: సీఎం
-
చార్ధామ్ యాత్రీకులంతా క్షేమం: సీఎం
చార్ధామ్ యాత్రీల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబర్లు: 0135-2559898 ,2552626, 2552627,2552628 గ్యాంగ్‌టక్: చార్ధామ్ యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ శనివారం ప్రకటించారు. విష్ణుప్రయాగ వద్ద శుక్రవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆయన చెప్పారు. మీడియాతో వార్తలు వచ్చినట్లు 15000 మంది భక్తులు చిక్కుకుపోలేదని, 1800 మంది మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడ్డారని వివరించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అయ్యేందుకు శనివారం గ్యాంగ్‌టక్(సిక్కిం) వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రిషికేష్ నుంచి బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలోని విష్ణుప్రయాగ వద్ద కొండచరియలు విరిగిపడటంతో కొంతమంది భక్తులు ఇబ్బంది పడ్డారు. అయితే పలు మాధ్యమాల్లో చెప్పినట్లు అక్కడ 15వేల మంది లేరు. ప్రస్తుతం విపత్తు నిర్వహణ బృందాలు అక్కడ పరిస్థితిని చక్కబెట్టేపనిలో ఉన్నాయి. శిధిలాల తొలగింపు కూడా పూర్తికావచ్చింది. మరి కొద్ది గంటల్లోనే రహదారి అందుబాటులోకి వస్తుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏ ఒక్కరికీ ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరగలేదు’ అని సీఎం రావత్ చెప్పారు. హిమాచల్‌లో స్వల్ప భూకంపం ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడిన సమయంలోనే పొరుగు రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో స్పల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం కూడా అక్కడి చంబా జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయింది. శుక్ర, శనివారాల్లో కనీసం ఐదు సార్లు భూమి కంపించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రకంపనల వల్ల ప్రాణ,ఆస్తినష్టాలు సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. (ఉత్తరాఖండ్‌లో మళ్లీ విలయం!)