breaking news
Chithram
-
‘ పూలే ’ చిత్ర బృందానికి అభినందన
గుంటూరు ఎడ్యుకేషన్: కళాకారుడు సుందర్ రావు దర్శకత్వంలో నిర్మించిన ‘‘మహాత్మా జ్యోతిరావ్ పూలే’’ సందేశాత్మక చిత్ర ప్రదర్శనను ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వై. కోటేశ్వరరావు (వైకే) పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నగరానికి వచ్చిన చిత్ర బృందాన్నిS అరండల్‌పేటలోని తన కార్యాలయంలో వైకే అభినందించారు. ఈసందర్భంగా ఆయనS మాట్లాడుతూ పూలే చిత్ర ప్రదర్శనను ప్రజా ఉద్యమంగా నిర్వహించే విషయమై ఈనెల 21న విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు, కళాకారులు, ప్రముఖులతో చర్చిస్తామని వివరించా రు. చిత్ర దర్శకుడు సుందర్రావు మాట్లాడుతూ మహాత్మాపూలే జీవితం, ఉద్య మం, తాత్వికత, సైద్ధాంతిక సందేశాలను తెలుగు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో చిత్ర నిర్మాణాన్ని సంకల్పించినట్లు చె ప్పారు. నవంబర్ 28న చిత్రం విడుదల చేస్తామని తెలి పారు. కార్యక్రమంలో పూలే కళా మండలి నాయకుడు కొల్లూరి నాగేశ్వరరావు, బీసీ మహాజన సమితి నాయకులు ఉగ్గం సాంబశివరావు, నక్కా శంకర్, బీసీ ఐక్య సం ఘర్షణ సమితి నాయకులు బి.నాగమణి, సీహెచ్ వాసు, బొంతా సురేష్, బీసీ సంఘ నాయకుడు కన్న మాస్టారు, సైకం రాజశేఖర్, కె. మాణిక్యాలరావు పాల్గొన్నారు. -
యాంగ్రీ హీరోతో క్రేజీ డైరెక్టర్
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన యాంగ్రీ హీరో రాజశేఖర్ కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్నాడు. స్ట్రయిట్ సినిమాలతో పాటు రీమేక్‌లు కూడా సక్సెస్ ఇవ్వకపోవటంతో ఆలోచనలో పడ్డ రాజశేఖర్ ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌కు రెడీ అవుతున్నాడు. చిత్రం, జయం, నువ్వునేను లాంటి సినిమాలతో స్టార్ హీరోలకు పోటీగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్న తేజ ఇటీవల కాలంలో మినిమమ్ కలెక్షన్లు సాదించే సినిమాలు కూడా అందించలేకపోతున్నాడు. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ' కూడా ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయింది. దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ తేజ, రాజశేఖర్ లీడ్రోల్లో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను 'నిజం' తరహాలో సోషల్ ఎలిమెంట్‌తో కూడిన చిత్రంగా తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వీలైనంత త్వరగా రిలీజ్ కు రెడీ చేయాలని భావిస్తున్నారు.