breaking news
chintapalle
-
చింతపల్లికి వందేళ్లుగా వస్తున్న ఆ అతిధుల జాడేది..!
చింతపల్లిలో ఈ ఏడాది కూడా సైబీరియా పక్షుల సందడి లేకుండాపోయింది...వందేళ్ల నుంచి వేసవి విడిదిగా వస్తున్న పక్షులు మూడేళ్ల నుంచి రావటంలేదు..ప్రతీ ఏటా వేసవి ప్రారంభంకన్న ముందు వచ్చి వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే సమయంలో తిరిగి వెళ్తుంటాయి. అయితే చింతపల్లి గ్రామానికి విదేశీ అతిథిలు రాకపోవడానికి కారణాలేంటి..గ్రామస్తులు చెప్పుతున్న కారణం ఏమిటి. ఖమ్మం జిల్లాలోని చింతపల్లి ప్రాంతం విదేశీ సైబీరియా పక్షులకు అడ్డగా మారిన విషయం తెలిసిందే..ప్రతి ఏటా జనవరి నెలలో ఇక్కడి వస్తాయి...చింతపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున చింతచెట్లు,వేపచెట్లు ఉంటాయి....ప్రతీ ఇంటికి ఒక చింత చెట్టు....రెండు ఇళ్లకు ఒక వేప చెట్టు ఉంటుంది. దీంతో వాటి అవాసంకు ఇది అనుకులమైన ప్రాంతమైంది. వేసవికాలం రాగానే ఈ చింతచెట్లపైన మొదట గూళ్లు కట్టుకుంటాయి.. ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాయి..ఇక్కడే పొదిగి పిల్లలను తీసుకోని జూలై నెల చివరి వారంలో తిరిగి ప్రయాణమవుతాయి. ప్రతీ ఏడాది జనవరి వచ్చిదంటే చాలు తమ అతిథిల కోసం చింతపల్లి గ్రామస్తులు ఎదురుచూస్తు ఉంటారు... అయితే ఈ ఏడాది కూడా విదేశీ అతిధి రాలేదు..ఈ ఒక్క ఏడాదే కాదు వరుసగా పక్షులు రాక ఇది మూడవ ఏడాది...అయితే పక్షులు రాకపోవడానికి కారణం కోతుల బెడద ప్రదాన కారణమంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. తమ గ్రామంలో ప్రతి ఏటా జనవరిలో పక్షలు ఇక్కడికి వచ్చి చక్కర్లు కొడుతు కనువిందు చేస్తు ఉంటాయని వరుసగా మూడేళ్ల నుంచి రాకపోవడంతో కొంత భాద కలిగిస్తుందని చెబుతున్నారు గ్రామస్తులు. వాటిని అలా చూస్తుండిపోతామని, అంతలా ఆ పక్షులకు మాకు తెలియని ఓ అవినాభవ సంబంధం ఏర్పడిందంటున్నారు. రంగు రంగుల ఆకారంలో ఉండే ఈ పక్షులంటే ఇక్కడి గ్రామస్తులకే కాదు పర్యాటకులను కూడ ఎంతగానో ఆకర్షిస్తాయని చెబుతున్నారు. సైబీరియా పక్షులు చింతపల్లి గ్రామానికి మా తాతల కాలం నుంచే వస్తున్నయని చెబుతున్నారు గ్రామస్తులు. ప్రతీ ఏటా సైబీరియా అతిథిలు వచ్చి ఇక్కడ ఉంటేనే పంటలు బాగా పండి తమకు లాభం జరుగుతుందనేది తమ నమ్మకం అని కూడా చెబుతున్నారు గ్రామస్తులు. అయితే ఈసారి కూడా అవి రాకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుతన్నామంటున్నారు గ్రామస్తులు. ఒక్కో సైబీరియా కొంగ దాదాపు మూడు కేజిల పైనే బరువు ఉంటుంది. దీంతో బయట నుంచి వచ్చినవారు ఎవ్వరైనా వాటిని వెంటాడి చంపే ప్రయత్నం చేస్తే అస్సలు ఊరుకోరు. జరిమాన విధిస్తారు. గతంలో వెటాడిన సందర్బాలు సైతం ఉండటంతో ఆరు నెలల పాటు పక్షులకు ఫుల్ సెక్యూరిటిగా ఉండి మరీ దగ్గరుండి చూసుకుంటామని చెబుతున్నారు గ్రామస్తులు. అందువల్లే వీటిని ఎవ్వరూ వేటాడే ప్రయత్నం చేయరని ధీమాగా చెబుతున్నారు. అలాగే నిరంతరం గ్రామస్తుల నిఘా ఉంటుంది. ఇంత ఇష్టంగా వీటిని గ్రామస్తులు చూసుకుంటున్నా.. కోతుల బెడదతో ఈసారి రాకపోవడంతో వారు భాదపడుతున్నారు. "ఆకాశ మార్గన వేల కీలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ సరిగ్గా వేసవి కాలం వచ్చే ముందు ఇక్కడకు చేరుకుంటాయి...ప్రతీ ఏటా అనుకున్న సమయం కల్లా కచ్చితంగా ఇక్కడికి చేరుకుంటాయి...అందుకే ఈ పక్షులకు అంతటి ప్రత్యేకత....ఆడ, మగ కొంగలు గూళ్ళు ఏర్పాటు చేసుకుని పిల్లలను కంటాయి..ఈ సమయంలో ఆడ కొంగ పిల్లలకు తోడుగా ఉంటే మగ కొంగ ఆహరం తీసుకు వస్తుంది..అయితే ప్రతి ఏటా కోతుల బెడద అతిథి విహాంగాలకు ముప్పుగా మారింది. దీంతో పక్షులు వచ్చిన సమయంలో గ్రామస్తులు వాటికి ఇబ్బందులు కలగకుండా కోతులను బెదర కొడుతుంటారు. ప్రతీ ఏటా వేసవికాలం ప్రారంభంకన్నా ముందు అతిథిలుగా వచ్చి వర్షకాలం ప్రారంభమవుతున్న సమయంలో తిరిగి వెళ్తాయి. గత మూడేళ్ల నుంచి కోతుల భయంతో మొత్తానికి రావడం మానేశాయి సైబీరియా పక్షులు. ఆరు నెలల పాటు చింతపల్లి గ్రామంలో సందడి చేసే ఈ సైబీరియా కొంగలను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తువుంటారు...తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి వస్తారు.. అయితే వరుసగా మూడేళ్ల నుంచి పక్షులు రాకపోవడంతో అటు పర్యాటకులు ఇటు గ్రామస్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు". (చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!) -
చింతపల్లి ఠాణాకు వాస్తు దోషం!
చింతపల్లి: నల్లగొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేందుకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు పోటీ పడుతుంటారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై ఉన్న చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు అంత క్రేజి ఏర్పడింది. అంతా శుభం అనుకొని డ్యూటీలో జాయిన్ అ యిన ఎస్ఐలు కొన్ని నెలలకే అనూహ్యంగా వివా దాలతో బదిలీ అవుతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పది నెలల వ్యవధిలో పదకొండు మంది ఎస్ఐలు వేర్వేరు కారణాలతో బదిలీ అయ్యారు. దీంతో చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషం పట్టుకుందని భావించిన అధికారులు.. తాజాగా స్టేషన్ ముందు భాగాన్ని కూల్చివేశారు. క్లిన్చిట్తో వచ్చి.. వివాదాలతో.. చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా పని చేసేందుకు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో క్లీన్ చిట్‌తో స్టేషన్ ఎస్ఐగా వచ్చిన పలువురు అనుకోకుండా పలు కేసుల్లో జోక్యం చేసుకోవడం, భూ తాగాదాల్లో తలదూర్చడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేసిన పలువురు ఎస్ఐలు వివాదాలతో బదిలీ అవుతున్నారు. వాస్తు దోషం ఎఫెక్ట్ చింతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసిన పలువురు ఎస్ఐలు వివాదాలతో బదిలీ అవుతుండడంతో ఇక్కడి స్టేషన్‌కు వాస్తు దోషం భయం పట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం చింతపల్లి పోలీస్ స్టేషన్‌లోని ముందు భాగాన్ని కూల్చిన అధికారులు వాస్తు దోషాన్ని సరిచేసే పనిలో ఉండడం గమనార్హం. ఏదేమైనా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలనుకునే ఎస్ఐలకు వరుసపెట్టి చోటు చేసుకుంటున్న ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. -
వ్యాను బోల్తా.. ఇద్దరు మృతి
చింతపల్లి(విశాఖపట్నం): వేగంగా వెళ్తున్న వ్యాను అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను గణేశ్(12), నరసింగరావు(14)గా గుర్తించారు. క్షతగాత్రులను చింతపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యానులో కోరుకొండ సంతకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.