breaking news
Chennai Building victims
-
బిల్డర్ నుంచి నష్ట పరిహారం రాబడతాం: జగన్
-
బిల్డర్ నుంచి నష్ట పరిహారం రాబడతాం: జగన్
చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు బిల్డర్ నుంచి నష్టపరిహారం రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫష్టం చేశారు. అందుకోసం తమ పార్టీ నుంచి ఓ బృందాన్ని చెన్నై పంపిస్తామని వెల్లడించారు. మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని బిల్డర్ను కోరతామని ఆయన తెలిపారు. అందుకు బిల్డర్ ఒప్పుకోకుంటే కోర్టులో కేసు వేసి నష్టపరిహారం రాబతామన్నారు. చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురంలో మృతుల కుటుంబసభ్యులు పతివాడ బంగారునాయుడు, కర్రి తౌడమ్మ, సిరిపురపు రాము, పేకేటి అప్పలరామ్, లక్ష్మీ, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రి మీనమ్మను కూడా జగన్ పరామర్శించి... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.