breaking news
changing tyres
-
అలాంటి ఇలాంటి రికార్డు కాదు....కారు వెళ్తుండగానే టైరు మార్చడం
ఇంతవరకు ఎన్నో గిన్నిస్ రికార్డులు చూశాం. మీసాలతో కారుని లాగడం, ఒక్కవేలుతో పెద్దపెద్ద బరువులను ఎత్తడం వంటి ఎన్నో భయంకరమైన ఫీట్లతో చేసిన రికార్డులను చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా ఏకంగా కారు వెళ్తుండగానే కారులో ఉండే టైరు మార్చడం అంటే ఊహకందని విషయం. ఇలాంటి ఫీట్ చేయాలనే ఆలోచన రావడమే గ్రేట్ అనుకుంటే అసాధ్య కాదంటూ చేసి చూపించి మరీ గిన్నిస్ రికార్డు సృష్టించారు ఇద్దరు ఇటాలియన్లు. వివారాల్లోకెళ్తే....ఇటలీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు. అదీ కూడా చాలా వేగంగా ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు. ఈ మేరకు మాన్యయోల్ జోల్డాన్ అనే వ్యక్తి కారుని డ్రైవ్ చేస్తుండగా... జియాన్లుకా ఫోల్కో కారు వేగంగా కదులుతుంటే కారు కిటికిలోంచి వేలాడుతూ... టైరు మార్చేశాడు. మునపటి రికార్డును బ్రేక్ చేసి మరీ అత్యంత వేగవంతంగా కారు టైరుని మార్చేశాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ...ఏకంగా 500 మందికి భోజనాలు) -
'నిమిషంలోపే 4 టైర్లనూ మార్చేశారు'
కారు టైరును మార్చాలంటే ఎంత సమయం పడుతుంది? ఐదు నిమిషాలా? లేక పది నిమిషాలా? ఇక నాలుగు టైర్లను మార్చాల్సి వస్తే ఎంత సమయం తీసుకుంటారు? జర్మన్ టీమ్ మాత్రం చిటికెలో కాదు కాని నిమిషంలోపే నాలుగు టైర్లు మార్చి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. జర్మనీకి చెందిన నలుగురు మెకానిక్‌లు కలసి హ్యాండ్ టూల్స్‌తో 59.62 సెకన్లలో నాలుగు టైర్లనూ అమర్చారు. ప్రపంచంలో వేగంగా కారు టైర్లను మార్చిన రికార్డును సృష్టించారు. గతంలో ఉన్న (1:23:85) రికార్డును బద్దలు కొట్టారు. అంటే ఈ రికార్డు కంటే 24 సెకన్ల వేగంగా కారు టైర్లను మార్చారు. కారు విడిభాగాలను సప్లై చేసే ఓ సంస్ధ ఈ టీమ్‌ను స్పాన్సర్ చేసింది.