breaking news
chadalawada krishnamurti
-
టీటీడీ చైర్మన్ ఇంటి ముట్టడి
తిరుపతి : టీటీడీ చైర్మన్ ఇంటిని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. పద్మావతి నగర్లోని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. నెల జీతం పెంచాలని, లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం రూ.18 వేల జీతం ఇవ్వాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్న సమయంలో టీటీడీ చైర్మన్, నాయుడుపేటలో జరుగుతున్న సీఎం సభలో ఉన్నారు. దీంతో అక్కడివారు ఫోన్లో టీటీడీ చైర్మన్తో మాట్లాడించడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు. -
మే 1న టీటీడీ పాలకమండలి ప్రమాణం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఏర్పడిన ధర్మకర్తల మండలి మే 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. తిరుమలలో బుధవారం ఉదయం ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం చైర్మన్ సహా పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. కాగా టీటీడీ పాలకమండలి చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైన విషయం తెలిసింది. చదలవాడతో పాటు సుమారు 18 మంది సభ్యులు టీటీడీ పాలకమండలిలో నియమితులైయ్యారు.