breaking news
cesses
-
సెస్సులు, సర్‌చార్జీలతో రాష్ట్రాలకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, సర్‌చార్జీలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 1980–81లో కేంద్ర ప్రభుత్వ మొత్తం ఆదాయంలో సెస్సులు, సర్‌చార్జీలు కేవలం 2.3 శాతంగా ఉంటే.. 2022–23 నాటికి 20 శాతానికి చేరాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు సరికాదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు విపరీతంగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని, తద్వారా దేశ పురోగతి కూడా కుంటుపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశంలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు తరఫున ప్రసంగాన్ని ఆ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ చదివి వినిపించారు. పన్నుల వాటా తగ్గింది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిపోయిందని.. 15వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్నది 29.7 శాతమేనని హరీశ్‌రావు తన ప్రసంగ పాఠంలో స్పష్టం చేశారు. కేంద్ర సెస్సులు, సర్‌చార్జీలను ప్రస్తుతమున్న 20శాతం నుంచి పది శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆయా రాష్ట్రాల అవసరాలకు తగినట్టుగా అమలుచేసుకునే స్వేచ్ఛ కల్పించాలని కోరారు. న్యూట్రిషన్, సెక్టార్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వకపోవడం అన్యాయమని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ అంచనాల్లో మూలధన పెట్టుబడిని పెంచి చూపినా.. వ్యయం సరిగా చేయడం లేదని, ఈ విషయంలో వేగం పెంచాలని సూచించారు. ‘‘మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలు ముందున్నాయి. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక సహాయాన్ని మరో ఐదేళ్లు కొనసాగించాలి. ఇందుకోసం ఏటా రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలను రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా పరిగణించాలి. లేదా ఈ నిర్ణయాన్ని గత సంవత్సరాలకు వర్తింప చేయవద్దు’’ అని హరీశ్‌రావు కోరారు. రాష్ట్రానికి సంబంధించి కోరిన అంశాలివీ.. ►రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లను 2019–20 నుంచి నిలిపివేశారు. ఏటా రూ.450 కోట్ల లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంతో కలిపి మొత్తం రూ.1350 కోట్లు ఇవ్వాలి. వీటి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇదివరకే సమర్పించాం. తెలంగాణ 10 జిల్లాల నుంచి 33 జిల్లాలుగా మారినందున మౌలిక సదుపాయాల కల్పన పెంచడానికి నిధులు ఇవ్వాలి. ►ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు పన్ను ప్రోత్సాహకాలను కల్పించాలి. కేంద్రం తెలంగాణకు ప్రధాన పన్నుల రాయితీని ప్రకటించాలి. ►వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్–ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల దూరం రోడ్ల నిర్మాణానికి కలిపి రూ.8,453 కోట్లు ఇవ్వాలి. ►మిషన్ భగీరథ నిర్వహణకు రూ.2,350 కోట్ల సాయానికి కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో మరో రూపంలోనైనా నిధులు ఇవ్వాలి. ►కల్లాలు, ట్రీగార్డ్స్‌ను గ్రామీణ ఉపాధి హమీ పథకంలో చేపట్టినందుకు అయిన రూ.151.19 కోట్లను పదిహేను రోజుల్లో చెల్లించాలని కేంద్రం లేఖ రాసింది. చెల్లించకపోతే రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్లలో కత్తిరించుకుంటామని పేర్కొంది. కేంద్రం ఉత్పాదకత కోసం చేసిన పనులపై పరిమితులు పెట్టడం, ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామనడం సరికాదు. ►రాష్ట్రానికి ఐటీఐఆర్‌ను వెంటనే ఇవ్వాలి. విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలి. -
'28 శాతం జీఎస్టీని తొలగించండి'
న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారుగా గత కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేసిన అరవింద్ సుబ్రమణియన్ ఓ పెద్ద డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) రూపాన్ని సులభతరం చేసేందుకు అత్యధిక శ్లాబు అయిన 28 శాతాన్ని తొలగించాలని అరవింద్ సుబ్రమణియన్ డిమాండ్ చేశారు. అంతేకాక అన్ని ఉత్పత్తులు, సర్వీసులపై ఒకే విధమైన సెస్ రేటును కొనసాగించాలని కూడా కోరారు. ‘28 శాతం రేటును తొలగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. సెస్‌లు ఉండాలి. కానీ సెస్‌ల రేట్లన్నీ ఒకే విధంగా ఉంటే మంచిది. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు జీరోగా, 3 శాతంగా(బంగారంపై), 5 శాతంగా, 12 శాతంగా, 18 శాతంగా, 28 శాతంగా ఉన్నాయి. వీటిని హేతుబద్ధం చేయాల్సినవసరం ఉంది. తొలుత 28 శాతం రేటును తొలగించాలి’ అని సుబ్రమణియన్ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. గత వారం క్రితమే సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌లో తనకు మనవడు/మనవరాలు పుట్టబోతున్నారని, ఈ క్రమంలోనే తాను కుటుంబంతా సమయం కేటాయించడానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారు వైదొలగడం ఇది రెండో సారి. -
సెస్‌లు రద్దు: రూ.65 వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేయబోతున్న జీఎస్టీ ప్రక్రియ తుది దశకు వచ్చేస్తోంది. 16 రకాల సెస్‌లను, సర్ఛార్జీలను కేంద్ర కేబినెట్ రద్దు చేసింది. జీఎస్టీ అమలుచేయబోతున్న తరుణంలో ఈ సెస్‌లు భాగమయ్యే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ చట్ట సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణతో ఎక్సైజ్ సర్వీసు టాక్స్ లపై సేకరించే మొత్తం 16 రకాల సెస్‌లను, సర్ఛార్జీలను ప్రభుత్వం కోల్పోతుంది. దీంతో ప్రభుత్వానికి 65వేల కోట్ల రూపాయలను నష్టం వాటిల్లనుంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుచేయాలని ఎంతో కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఈ మేరకు వడివడిగా అడుగులు వేస్తోంది. రద్దైన సెస్లలో క్రిషి కల్యాణ్, స్వచ్ఛ్ భారత్ కూడా ఉన్నాయి. దీంతో రూ.65 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తుందని కేబినెట్ తెలిపింది. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్లో పలు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. బహుళ పన్నులను జీఎస్టీ తొలగిస్తుందని, ఈ చట్టం అమల్లోకి వచ్చే లోపల పలు రకాల చట్టాలకు సవరణలను లేదా చట్టాలను ఉపసంహరించాల్సి వస్తుందని అధికారిక ప్రకటన వెలువరించింది. కస్టమర్స్ యాక్ట్ 1962కు, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975కు, సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944ల సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ 1985 ఉపసంహరణను ఆమోదించింది.