breaking news
call rate
-
ట్రాయ్ కొత్త నిబంధనలతో రూ.400కోట్ల భారం
న్యూఢిల్లీ: అనుచిత వాణిజ్య కాల్స్ (పెస్కీ కాల్స్), మెసేజ్‌లకు సంబంధించి ట్రాయ్ నూతన నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థల ఏర్పాటు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగానికి రూ.200–400 కోట్ల మేర వ్యయం చేయాల్సి వస్తుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) పెదవి విరిచింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. సీవోఏఐలో ప్రధాన ప్రైవేటు టెలికం కంపెనీలన్నీ భాగస్వాములుగా ఉన్నాయి. పెస్కీ కాల్స్‌ను, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు టెలికం కంపెనీలు ట్రాయ్ కొత్త నిబంధనలను డిసెంబర్ నాటికి అమలు చేయాల్సి ఉంటుంది. ‘‘ఈ విధానం ప్రపంచంలో మరెక్కడా అమలు చేయలేదు. కచ్చితమైన పెట్టుబడులు, సమయాన్ని అంచనా వేయడం కష్టం. కానీ, సుమారు రూ.200–400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది’’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ గడువు కూడా అచరణ సాధ్యం కానిదిగా పేర్కొన్నారు. పూర్తి వ్యవస్థ ఏర్పాటుకు కనీసం ఏడాది, ఏడాదిన్నర సమయం అవసరం అవుతుందన్నారు. నిబంధనల అమలుకు అయ్యే అదనపు వ్యయాల భారాన్ని కస్టమర్లపై అధిక చార్జీల రూపంలో మోపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎన్డీ వద్ద నమోదు చేసుకున్న కస్టమర్లకు సైతం అదే పనిగా అనుచిత వాణిజ్య కాల్స్, సందేశాలు వస్తుండటంతో ట్రాయ్ గత నెలలో నూతన నిబంధనలను ప్రకటించింది. వీటి ప్రకారం ఏ వాణిజ్య సర్వీస్‌కు అయినా తానిచ్చిన అనుమతిని ఉపసంహరించుకునే వెసులుబాటు కస్టమర్‌కు ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య కాల్స్‌ను ఏఏ రోజుల్లో, ఏ సమయాల్లో స్వీకరించే ప్రాధాన్యాన్ని కూడా నిర్దేశించుకోవచ్చు. -
జియో ఎఫెక్ట్: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్స్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో తక్కువ టారిఫ్ వోచర్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ వినియోగదారులకోసం కాల్ చార్జీలను భారీగా తగ్గించినట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రీ పెయిడ్ వినియోగదారుల కాల్ చార్జీలను తగ్గించామని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన సరికొత్త రూ. 8 ఎస్.టి.వి (స్పెషల్ టారిఫ్ వోచర్) వోచర్‌పై బిజిఎన్ఎల్-టు-బిఎస్ఎన్ఎల్ కాల్ రేటును నిమిషానికి 15 పైసలకు తగ్గించామనీ , ఈ తక్కువ కాలింగ్ రేట్ ను ఆస్వాదించండంటూ బిఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది. 30 రోజుల పాటు చెల్లుబాటయ్యే రూ. 8 స్పెషల్ వోచర్ పై బీఎస్ఎన్ఎల్ సొంత నెట్‌వర్క్‌లో నిమిషానికి 15పైసలు చార్జ్ చేస్తుంది. ఇతర నెట్ వర్క్‌లపై ని. 35పైసలు వసూలు చేయనుంది. అలాగే ఇవే కాల్ చార్జీలతో రూ.19 రీచార్జిపై 90రోజుల వాలిడిటీతో కూడా వోచర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు కస్టమర్ కేర్ నంబర్ 1800-345-1500ను సంప్రదించాలని బీఎస్ఎన్ఎల్ కోరింది. Enjoy #BSNL low calling rate on on-net and off-net STV. pic.twitter.com/jbB5lPOUP3 — BSNL India (@BSNLCorporate) September 6, 2017