Cabinet Committee on Security
-
పాక్ నడ్డి విరిగేలా..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం కారణంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత సమావేశంలో భద్రతా క్యాబినెట్ కమిటీ(CCS) పాకిస్తాన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం వ్యవధిలోనే సీసీఎస్ భేటీ జరుగుతుండడం గమనార్హం.సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా బలగల సన్నద్ధత, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్, పాకిస్తాన్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కేబినెట్ చర్చించనుంది. ఆ వెంటనే ఆర్థిక భద్రతా కమిటీ జరుగుతుండడంతో పాక్ నడ్డి విరిగేలా ఈ నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇదిలాఉంటే.. పహల్గాం దాడి జరిగిన మరుసటిరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంతదాస్‌లు పాల్గొన్నారు. ఈ కమిటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నప్పటికీ.. అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరుకాలేకపోయారు. -
రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) బుధవారం ఆమోదం తెలియజేసింది. రానున్న ఆరేళ్లలో ఈ విమానాలు ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్ఏఎల్ సంస్థ ప్రైవేట్ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. -
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వనున్న ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ పదవి ఏర్పాటుకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఓకే చెప్పింది. కార్గిల్ రివ్యూ కమిటీ 1999లో ఇచ్చిన సూచన మేరకు సీడీఎస్ నియామకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సీడీఎస్‌గా నియమితులయ్యే వారు నాలుగు నక్షత్రాలతో కూడిన జనరల్ స్థాయి అధికారి అయి ఉంటారని, త్రివిధ దళాధిపతులతో సమానమైన వేతనాన్ని పొందుతారని మంత్రి తెలిపారు. సీడీఎస్ వ్యవస్థ మౌలిక సూత్రాలు, బాధ్యతలపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికనూ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదించిందని అధికారులు తెలిపారు. తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్? దేశ రక్షణ రంగానికి తలమానికంగా చెప్పుకునే సీడీఎస్ పదవికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 31న రావత్ ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌కానున్నారు. సీడీఎస్ హోదా త్రివిధ దళాల అధిపతులకు సమానంగా ఉంటుందని, ప్రోటోకాల్ ప్రకారం ఆయన త్రివిధ దళాల కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారని అధికారులు వివరించారు. ఆర్మీ, వాయు, నావికాదళాలు కలిసికట్టుగా పనిచేసేలా చేయడం అందుకు తగిన ఏర్పాట్లు చేయడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. రూ. 6 వేల కోట్లతో అటల్ భూజల్ యోజన ఐదేళ్లపాటు ఏడు రాష్ట్రాల్లో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం అటల్ భూజల్ (అటల్ జల్) పథకాన్ని రూ. 6 వేల కోట్లతో అమలు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టులకు నిధులు: స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు గాను అదనంగా రూ. 1854.67 కోట్లను మంజూరు చేసేందుకు అంగీకరించింది. దేశాన్ని అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు వీలుగా పర్యాటక మౌలిక వసతుల స్థాపన ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌లో మొత్తం 15 సర్క్యూట్లు ఉన్నాయి. రైల్వేలో సంస్థాగత మార్పులు సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే సంస్థాగత పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే విభాగానికి సంబంధించి ఎనిమిది గ్రూప్–ఏ సర్వీసులను ఏకీకృతం చేసి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్(ఐఆర్ఎంఎస్)గా పరిగణించాలని నిర్ణయించారు. రైల్వే బోర్డును పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఇకపై రైల్వే బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీసెస్‌ను ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీసెస్(ఐఆర్‌హెచ్‌ఎస్)గా మార్చనున్నారు. -
మోదీ నేతృత్వంలో భద్రత వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ
-
49 శాతం మించిన ఎఫ్‌డీఐకి సీసీఎస్ అనుమతి
న్యూఢిల్లీ: రైల్వేలోని కీలక రంగాల్లో 49 శాతానికి మించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ (సీసీఎస్) అనుమతించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది. తద్వారా ఈ రంగాల్లో ఎఫ్డీఐపై ఆంక్షలు విధించినట్లైంది. నిధుల కొరతతో సతమతమవుతున్న రైల్వేలకు ఊతమిచ్చేందుకు ఎఫ్‌డీఐ విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఇటీవల సడలించింది. అయితే దేశ సరిహద్దు ప్రాంతాల్లో రైల్వే మౌలిక సౌకర్యాలకు సంబంధించిన కొన్ని అంశాలపై హోంశాఖ ఆందోళన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దులు, గిరిజన కాలనీల వంటి సున్నిత ప్రాంతాల్లో రక్షణ సంబంధ సమస్యలు అధిగమించేందుకు 49 శాతానికి మించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సీసీఎస్సే అనుమతిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, రవాణా ప్రాజెక్టుల వంటి ఇతర రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐకి ఆటోమేటిక్ రూట్లో క్లియరెన్స్ ఇస్తారని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. రైళ్ల నిర్వహణ, భద్రత రంగాల్లో ఎఫ్‌డీఐకి అనుమతి లేదని చెప్పాయి. దేశీయ రైల్వేలు దాదాపు రూ.29 వేల కోట్ల నిధుల కొరతను ఎదుర్కొంటున్నట్లు అంచనా.