breaking news
Bricks stall
-
కూలి డబ్బులు అడిగినందుకు.. కార్మికులపై దాడి
సాక్షి, వరంగల్ : తమ కూలీ డబ్బులు చెల్లించాలని అడిగినందుకు అనుచరులతో కలిసి యజమాని కార్మికులపై దాడి చేయించిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లి గ్రామంలో ఒడిశాకు చెందిన కొంతమంది కూలీలు ఇటుక బట్టిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తమ కూలీ డబ్బులు చెల్లించాలని యాజమాని శ్రీనివాస్‌ను కోరారు. దీంతో కోపోద్రుక్తుడైన యజమాని, తన అనుచరులతో కలిసి కార్మికులపై దాడికి తెగబడ్డాడు. కాగా వెంటనే కార్మికులందరు మామూనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని యజమాని శ్రీనివాస్ నాయుడుపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు మండల తహశీల్దార్ కిరణ్ కుమార్, సీఐ సార్ల రాజు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన కార్మికుల వివరాలను సేకరించారు, అనంతరం యజమానిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గొడ్డలితో కూలీని చంపిన సూపర్వైజర్
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): సూపర్వైజర్కు, కూలీకి మధ్య జరిగిన ఘర్షణలో కార్మికుడు మృతిచెందగా.. సూపర్వైజర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తున్న సుధాకర్ (35)కు సూపర్వైజర్ బ్రహ్మయ్యకు మధ్య ఈ రోజు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బ్రహ్మయ్య పక్కనే ఉన్న గొడ్డలితో సుధాకర్ తలపై కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో బ్రహ్మయ్యకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.