breaking news
bielections
-
ప్రశాంతంగా ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలు
జిల్లాలోని పలు ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. వార్డు సభ్యుల స్థానాలకు పోలైన ఓట్లను వెంటనే లెక్కించి సాయంత్రంలోగా ఫలితాలు వెల్లడించారు. ఇక ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు పోలైన ఓట్లను శనివారం లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మరిగడిలో 81.86 శాతం పోలింగ్ జనగామ : జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నిక గురువారం జరి గింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణ, అసిస్టెంట్ అధికారి హసీ మ్ ఆధ్వర్యం లో పర్యవేక్షించగా సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల బరిలో ఉన్న దూడల సిద్ధయ్య(కాంగ్రెస్), మేకల కలింగరాజు (టీఆర్ఎస్), బాల్నె వెంకటరాజు(సీపీఎం), తల్లూరి అశోక్(టీడీపీ) బరిలో ఉండగా, మరిగడిలోని రెండు బూత్‌ల్లో 1,852 ఓట్లకు 1,487(84 శాతం), చౌడారంలో 1,054 ఓట్లకు 892 (80 శాతం) ఓట్లు పోలయ్యాయి. గతంలో మరిగడి ఎన్నికల్లో 90 శా తం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 81.86 శాతం మాత్రమే నమోదైంది. మండల పరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహిస్తారు. నారాయణపురంలో 75.68 శాతం.. బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురం ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా రిటర్నింగ్ అధికారి సదానందం, ఎన్నికల అధికారి, ఎంపీడీఓ రమేష్ ప్రయవేక్షించారు. నక్కవాని గూడెం, నారాయణపురం గ్రామాల్లో బూత్‌లు ఏర్పాటుచేయగా 1557 మంది ఓటర్లకు 1178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసిల్థార్ విజయభాస్కర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయగా జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ చంద్రశేఖర్ బందోబస్తు నిర్వహించారు. జాకారం సర్పంచ్‌గా సాగర్ ములుగు : జాకారం సర్పంచ్ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గండ్రత్ సాగర్ గెలుపొందారు. సర్పంచ్ గండ్రత్ రాజక్క అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించగా టీఆర్ఎస్ నుంచి సాగర్‌తో పాటు టీడీపీ నుంచి గొర్రె రఘుపతి, కాంగ్రెస్ నుంచి రాసమల్ల రజినీకాంత్ నిలిచారు. ఈ మేరకు 970 ఓట్లకు 632 ఓట్లు(65శాతం) పోలయ్యాయి. ఈ సందర్భంగా సాగర్‌కు 594 ఓట్లు రాగా, ఆయన తర్వాత రఘుపతికి 17 ఓట్లు వచ్చాయి. దీంతో సాగర్ 577 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు.సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేయగా ఎంపీడీఓ విజయ్‌స్వరూప్, ఈఓపీఆర్డీ రమేష్ పరిశీలించారు. కాగా, ప్రస్తుతం సర్పంచ్‌గా గెలుపొందిన సాగర్ వయస్సు 22 ఏళ్లే. గత ఏడాది ఆయన డిగ్రీ పూర్తి చేయగా, తన తల్లి, సర్పంచ్‌గా ఉన్న రాజక్క మృతి చెందడంతో ఆమె స్థానంలో నిలిచి గెలుపొందారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గట్టు మహేందర్ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌రెడ్డి, రామస్వామి, బ్రహ్మచారి, చేరాలు, గండ్రత్ దామోదర్ సంబరాలు చేసుకున్నారు. రెండు పంచాయతీల్లో చెరొకటి... కొడకండ్ల : మండలంలోని రెండు గ్రామపంచాయతీల్లో రెండు వార్డు సభ్యులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఏడునూతుల 12వ వార్డు ఎన్నికలో టీఆర్ఎస్ బలపర్చిన మాలోత్ రమ్మి కాంగ్రెస్ బలపర్చిన గుగులోత్ అమ్మిపై 70 ఓట్లతో, రంగాపురం ఐదో వార్డు ఎన్నికలో కాంగ్రెస్ బలపర్చిన జక్కుల సంజీవ టీఆర్ఎస్ బలపర్చిన సుందరమ్మపై 7 ఓట్ల తేడాతో విజయం సాధించగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకొన్నారు. పాలకుర్తిలో మూడు.. ఒకటి పాలకుర్తి : నియోజకవర్గంలో నాలుగు గ్రామపంచాయతీల్లో నాలుగు వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నిక జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడింటిని కాంగ్రెస్, ఒక స్థానాన్ని టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకున్నారు. పాలకుర్తి మండలం బమ్మెర 6వ వార్డులో కాంగ్రెస్ బలపర్చిన దొంతరబోయిన ఉప్పలయ్య, దేవరుప్పుల మండలం కోలుకొండ 2వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ బలపర్చిన కౌడగాని కృష్ణమూర్తి, కొడకండ్ల మండలం రంగాపురం గ్రామపంచాయతీ 5వ వార్డు సభ్యుడిగా జక్కుల సంజీవ, ఏడునూతుల గ్రామపంచాయతీ 12వ వార్డు సభ్యులుగా టీఆర్ఎస్ బలపర్చిన మాలోతు రమ్య గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. -
ఆర్కే నగర్ నుంచే జయ పోటీ
చెన్నై: వచ్చే నెల 27న తమిళనాడులో జరిగే ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి జయలలిత స్థానిక రాధాకృష్ణన్(ఆర్కే) నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జయ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి జయకు విముక్తి లభించగానే ఆర్కే నగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా దీన్ని ఆమె నిర్ధారించారు. ఇంతకుముందు ఆమె శ్రీరంగం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చే యాల్సి వచ్చింది. అయితే ఈ నెల 11న కర్ణాటక హైకోర్టు ఆమెపై కేసును కొట్టివేసిన నేపథ్యంలో ఆమె మళ్లీ సీఎం పీఠమెక్కి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే, పీఎంకే ప్రకటించాయి. ఈసారి ధన ప్రవాహమే కీలకపాత్ర పోషిస్తోందని, ఓటర్లకు అధికార పార్టీ భారీగా డబ్బులు పంచుతోందని పీఎంకే ఆరోపించింది. ఇక ఆర్కే నగర్లో పోటీ చేసే అంశంపై విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో బీజేపీ తాజాగా చర్చలు జరిపింది. -
'నాయకులను తయారు చేసుకునే సత్తా మాకుంది'
టీఆర్ఎస్ పార్టీపై టీడీపీ నేత పెద్దరెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీలో పాలు తాగిన వారుంటే.. టీఆర్ఎస్లో గుడుంబా తాగే వాళ్లున్నారా అని ఆయన మంగళవారం ఇక్కడ ప్రశ్నించారు. టీడీపీ ఊట బావిలాంటిదని ఎంతమంది వెళితే అంతమంది నాయకులను తిరిగి తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని కోతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టీడీపీ నుంచి గెలిచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం కాకుండా వారితో రాజీనామాలు చేయించి నేరుగా ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. కేసీఆర్ మోసాలను ఎండగడుతూ ప్రభుత్వానికి మార్గదర్శకం చేసేందుకే తెలంగాణలో చంద్రబాబు పర్యటన అని చెప్పారు.