breaking news
Bharat Earth Movers Limited
-
కొత్త మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో రైళ్లకు ఎల్అండ్టీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మెట్రోరైళ్ల తయారీ సంస్థ భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. బీఈఎంఎల్ సంస్థ ఇప్పటికే మెట్రోలను తయారు చేసి పలు నగరాలకు అందజేస్తున్న దృష్ట్యా ఆ సంస్థతోనే ఒప్పందం చేసుకొనే అవకాశం ఉంది. గతంలో మొదటి దశ రైళ్లను కొరియా నుంచి తెప్పించిన సంగతి తెలిసిందే. బెంగళూరు కేంద్రంగా నెలకొల్పిన బీఈఎంఎల్‌తో పాటు మరికొన్ని తయారీ సంస్థలు కూడా ఈ రంగంలో పని చేస్తున్నాయి.ఈ మేరకు వివిధ సంస్థల సాంకేతిక సామర్థ్యం, నైపుణ్యం, అనుభవం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎల్అండ్టీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ క్రమంలో బీఈఎంఎల్తోనే ఒప్పందానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 18 నెలల కాలవ్యవధిలో మెట్రోలను తయారు చేసి అందజేసేలా ఈ సంస్థతో ఒప్పందం ఏర్పాటు చేసుకోనున్నారు. ప్రస్తుతం 3 రూట్లలో 57 మెట్రోలు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు కొత్తగా మరో 10 రైళ్లను కొనుగోలు చేసేందుకు ఎల్అండ్టీ మెట్రో రైల్ దృష్టి సారించింది. చార్జీల పెంపుతో సదుపాయాలపై దృష్టి.. ప్రయాణికుల రద్దీ మేరకు నాగ్‌పూర్ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని మొదట్లో ప్రతిపాదించారు. కానీ సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత సొంతంగానే కొనుగోలు చేసేందుకు ఎల్అండ్టీ కార్యాచరణ చేట్టింది. 2023లోనే ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశారు. భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ సంస్థతో గతంలో సంప్రదింపులు కూడా జరిగాయి. భారీ నష్టాల కారణంగా వెనుకంజ వేశారు. నష్టాలను భర్తీ చేసుకొనేందుకు ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల మెట్రో చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా సదుపాయాలపై తాజాగా దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే కొత్త రైళ్ల కొనుగోళ్లు కోసం కసరత్తు చేపట్టారు. రూ.650 కోట్లకు పైగా వ్యయం.. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లలో ప్రతిరోజూ 57 రైళ్లు సుమారు 1,050 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు అదనపు ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయడం, డిజిటల్ సేవల విస్తరణ, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ పెంపు తదితర సేవలపై ఎల్అండ్టీ దృష్టి సారించింది.ఇందులో భాగంగానే కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.650 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. ఒక్కో ట్రైన్‌కు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తోంది. కోచ్‌ల సంఖ్యను పెంచడంతో స్టేషన్ల మధ్య రైళ్లు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే అదనపు కోచ్‌లకు బదులు కొత్త రైళ్లనే కొనుగోలు చేయాలని నిర్ణయించారు.తప్పనిసరి కావడంతో.. మరోవైపు రెండో దశ మెట్రో విస్తరణ దృష్ట్యా కూడా ప్రస్తుతం ఉన్న రూట్లలో రైళ్ల సంఖ్యను పెంచడం అనివార్యం. రెండో దశలో ప్రతిపాదించిన ఐదు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు చేరుకొనే అవకాశం ఉంది. నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో మొదటిదశ మార్గాల్లోనే ప్రయాణికులు రెండో దశ కారిడార్లలో రాకపోకలు సాగిస్తారు. ఆ రకంగా కూడా కొత్త రైళ్లు తప్పనిసరి. మొదటి,రెండో దశ మెట్రోల నిర్వహణపై, ప్రయాణికుల సంఖ్య, చార్జీల పంపకాలు, విద్యుత్ వినియోగ వ్యయం వంటి అంశాలపైనా ఎల్అండ్టీ, హైదరాబాద్ మెట్రో రైల్ మధ్య తప్పనిసరిగా ఒప్పందం ఉంటుందని అధికారులు తెలిపారు.చదవండి: హైడ్రా మరో కీలక నిర్ణయం -
బీఈఎల్‌తో హెచ్ఏఎల్ రూ. 2,400 కోట్ల ఒప్పందం
బెంగళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ నుంచి రూ. 2,400 కోట్ల కాంట్రాక్టును భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్సీఏ) తేజాస్ ఎంకే1ఏలకు అవసరమైన 20 రకాల ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్‌ను (ఎల్‌ఆర్‌యూ మొదలైనవి) బీఈఎల్ తయారీ చేసి, సరఫరా చేయాల్సి ఉంటుంది. 2023 నుంచి 2028 వరకూ అయిదేళ్ల వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంటుంది. మరోవైపు, 83 తేజాస్ ఎంకే1ఏలను భారత వైమానిక దశానికి 2023–24 నుంచి అందించడం మొదలవుతుందని హెచ్ఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. -
రేవతీ ఎక్విప్మెంట్- బీఈఎంఎల్ జోరెందుకు?
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 260 పాయింట్లు జంప్‌చేసి 48,129కు చేరింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా నిఫ్టీ సైతం 96 పాయింట్లు ఎగసి 14,114 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా రేవతీ ఎక్విప్మెంట్ 52 వారాల గరిష్టాన్ని తాకగా.. ప్రభుత్వ వాటా విక్రయ వార్తలతో పీఎస్‌యూ బీఈఎంఎల్ లిమిటెడ్ కౌంటర్‌కూ డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) రేవతీ ఎక్విప్మెంట్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీ షేర్లను స్వచ్చందగా డీలిస్టింగ్ చేయనున్నట్లు రేవతీ ఎక్విప్మెంట్ యాజమాన్యం తాజాగా వెల్లడించింది. సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీనీ డీలిస్ట్ చేసేందుకు ప్రతిపాదించినట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈకి రేవతీ తెలియజేసింది. డీలిస్టింగ్ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 7న సమావేశమవుతున్నట్లు పేర్కొంది. పూర్తి వాటాను ప్రమోటర్లు సొంతం చేసుకోవడం ద్వారా కార్యకలాపాల వృద్ధికీ, ఆర్థికావసరాలు తీర్చేందుకు వీలుంటుందని డీలిస్టింగ్ ప్రతిపాదనపై స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేవతీ ఎక్విప్మెంట్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం జంప్‌చేసింది. రూ. 93 పెరిగి రూ. 556 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఏడాది గరిష్టాన్ని తాకింది. జనవరి 2కల్లా కంపెనీలో ప్రమోటర్ సంస్థలకు 72.58 శాతం వాటా నమోదైంది. పబ్లిక్ వాటా 27.42 శాతంగా ఉంది. బీఈఎంఎల్ లిమిటెడ్ కంపెనీలో 26 శాతం వాటాతోపాటు.. యాజమాన్య నియంత్రణ హక్కులనూ విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రక్షణ, ఇంజినీరింగ్ రంగ కంపెనీ బీఈఎంఎల్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 1,051ను తాకింది. ప్రస్తుతం 3.5 శాతం లాభంతో రూ. 1,009 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 54 శాతం వాటా ఉంది. వ్యూహాత్మక వాటా విక్రయంలో భాగంగా ప్రభుత్వం బీఈఎంఎల్లో 26 శాతం వాటా విక్రయానికి నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను నిర్వహించేందుకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌ను ఎంపిక చేసుకుంది. శుక్రవారం ముగింపు ధరలో చూస్తే ప్రభుత్వానికి వాటా విక్రయం ద్వారా రూ. 1,055 కోట్లు సమకూరే అవకాశముంది. -
బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ‘బెమెల్’ డెరైక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సిస్టమ్‌లో ఎం.టెక్ చేసిన ఆయన ప్రణాళిక, ఉత్పత్తి విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ నియామకానికి ముందు హెచ్ఏఎల్ కోరాపుట్ డివిజన్‌కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.