breaking news
beatiful
-
'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు'
లక్నో: బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ స్టేట్మెంట్కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు వాడితే మహిళలు చాలా అందంగా అవుతారని మేనకా గాంధీ అన్నారు. ఈజిప్టుకు చెందిన ప్రఖ్యాత రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలలోనే స్నానం చేసేదని పేర్కొన్నారు. దీంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 'గాడిద పాలతో తయారు చేసిన సబ్బు ధర ఢిల్లీలో రూ.500 ఉంది. మనం కూడా గాడిద పాలు, మేక పాలతో సబ్బులు తయారు చేయడం ఎందుకు ప్రారంభించకూడదు?. లద్దాక్‌కు చెంది ఓ కమ్యూనిటీ గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వెల్లడించింది. అందుకే గాడిద పాలను వారు సబ్బుల తయారీకి వాడుతున్నారు. గాడిద పాలతో చేసిన సబ్బును వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు.' అని మేనకా గాంధీ అన్నారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/AlvguCEgE5— Shahzad Khan (@Shahzadkhanjou) April 2, 2023 చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ రూ.7.50 కోట్లతో పనులకు శంకుస్థాపన ఖమ్మం :ఖమ్మం నగరంలో మెరుగైన వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దుతామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, నగర మేయర్ పాపాలాల్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్లలో రూ.7.50 కోట్ల నిధులతో చేపట్టినవివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ నూతన పాలక మండలి ఏర్పాటు తర్వాత అభివృద్ధి కోసం ప్రతి డివిజన్‌కు రూ.30 లక్షలు కేటాయించామన్నారు. వరదయ్యనగర్, తుమ్మలగడ్డ మసీద్, నిజాంపేట, బ్యాంక్‌కాలనీ, జర్నలిస్టు కాలనీ, సరితా క్లినిక్, జెండాల సెంటర్, రేవతి సెంటర్, చెరువు కట్టబజార్, మామిళ్లగూడెం, రమణగుట్ట, ధంసలాపురం, సెయింట్‌మేరీస్ స్కూల్రోడ్, శ్రీనివాసనగర్, బోస్‌సెంటర్, గాంధీనగర్, బురదరాఘవాపురం, జూబ్లీపుర, ఖానాపురం ప్రాంతాల్లోసీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ రోజు ఈ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేశామని చెప్పారు.మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ నగరంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేషన్ నిధులు కేటాయించామని వివరించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ నగరంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి డివిజన్లోని రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, బీజీ క్లెమెంట్, గాదె ధనలక్ష్మి, మీరాబేగం, శశికళ, శీలంశెట్టి రమ, బుర్రి కృష్ణవేణి, సుజాత, నిరీష, పాపారావు, జయమ్మ, నీరజ, రుద్రగాని శ్రీదేవి, రూడావత్ రమాదేవి, తోట ఉమారాణి, వాణి, హనుమాన్, నాగరాజు, చావా నారాయణరావు, కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ ఎంపీ ఆంజనేయప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.