battery backup
-
గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
దేశరాజధాని ఢిల్లీలోని కిలోక్రీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగ్రిడ్, బీఎస్ఈఎస్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్టాండలోన్ యుటిలిటీ స్కేల్ సిస్టమ్ పవర్ గ్రిడ్‌ను స్థిరీకరించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణ ఢిల్లీలోని దాదాపు లక్ష మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.బీఈఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను 20 మెగావాట్లు/40 మెగావాట్‌హవర్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యాధునిక వ్యవస్థ కోసం రూపొందించారు. ఇది భారీ ఇన్వర్టర్ మాదిరిగా పని చేస్తుంది. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఆఫ్-పీక్ అవర్స్‌లో ఛార్జ్ అవుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు తిరిగి గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా అందిస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు వీలవుతుంది. ఇది విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రభావం, తద్వారా అంతరాయాలను తగ్గిస్తుంది.ప్రయోజనాలుబీఈఎస్ఎస్ విధానం స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి సహాయపడుతుంది. సప్లైలో హెచ్చుతగ్గులను నిర్వహిస్తుంది. పీక్ అవర్స్‌లో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని నియంత్రిస్తుంది. పునరుత్పాదక సౌర, పవన విద్యుత్ నిర్వహణకు వీలు కల్పించడం ద్వారా ఈ వ్యవస్థ క్లీన్ ఎనర్జీ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది. వేలాది మంది నివాసితులకు నిరంతర విద్యుత్‌ను అందిస్తుంది. విద్యుత్ సరఫరాలో బ్లాక్అవుట్లను నివారిస్తుంది.ఇదీ చదవండి: రైతన్నపై ప్రకృతి ప్రకోపందక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్పంపిణీ స్థాయిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఇదేనని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలు, స్థిరమైన విద్యుత్ పరిష్కారాలు అవసరం అవుతుండడంతో బీఈఎస్ఎస్ వంటి బ్యాటరీ స్టోరేజ్ విధానాలు ఆధునిక నగరాలకు కీలకమైన సాధనాలుగా మారుతున్నాయని చెప్పారు. -
భారత్‌లో హోండా మోటార్ బ్యాటరీ మార్పిడి సేవలు..
న్యూఢిల్లీ: భారత్‌లో విద్యుత్ వాహనాలకు బ్యాటరీ మార్పిడి సర్వీసులు అందించేందుకు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కంపెనీ ప్రత్యేకంగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 135 కోట్ల మూలధనంతో హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియాను నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ముందుగా బెంగళూరులోని ఎలక్ట్రిక్ ఆటోలకు బ్యాటరీ షేరింగ్ సర్వీసులను ప్రారంభిస్తామని, దశలవారీగా ఇతర నగరాలకు కూడా విస్తరిస్తామని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పరిమిత శ్రేణి, చార్జింగ్కు సుదీర్ఘ సమయం పట్టేయడం, బ్యాటరీ ఖరీదు భారీగా ఉండటం తదితర సమస్యలకు వీటితో పరిష్కారం లభించగలదని హోండా తెలిపింది. ç ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తామని కంపెనీ వివరించింది. -
Smartphone: స్మార్ట్ఫోన్లు పేలుతున్నాయ్.. జాగ్రత్తలు మన చేతుల్లో కూడా!
పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పనుల్ని చక్కబెట్టడంలో స్మార్ట్‌ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండడం చూస్తున్నాం.. వింటున్నాం. మొన్నీమధ్యే ఓ అడ్వొకేట్ గౌన్‌లో ఫోన్ పేలిందన్న వార్త, దీనికి ముందు విమానంలో ఫోన్ పేలిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ కావడం, అంతకు ముందు ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడిన యువతి దుర్మరణం.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఫోన్ వాడకంలో కొన్ని కనీస జాగ్రత్తలు పాటిస్తే.. ఇలాంటి ఘటనలు నివారించిన వాళ్లం అవుతామంటున్నారు నిపుణులు. చాలామంది స్క్రీన్ పగిలిన ఫోన్లను అలాగే వాడేస్తుంటారు. రిపేరింగ్‌కు బద్ధకిస్తుంటారు. ఇలా ఫోన్లను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. కారణం.. అలా పగిలిన చోటు నుంచి నీరు లేదంటే చెమట ఫోన్ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా బ్యాటరీ, లోపలి భాగాలు పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్‌పై ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగి.. పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ పాడైన వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. అంతేకాదు స్క్రీన్ గార్డ్‌కు క్రాక్స్ వచ్చినా వెంటనే మార్చేయడం ఉత్తమం. కరోనా వల్ల ఈమధ్య శానిటైజర్లను ఫోన్లకు సైతం వాడేస్తున్నారు కొందరు. అయితే ఛార్జింగ్ సాకెట్ల ద్వారా లిక్విడ్ లోపలికి వెళ్లి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టిష్యూస్‌తో అదీ జాగ్రత్తగా తుడవడం బెటర్ అని సూచిస్తున్నారు. డుప్లికేట్ ఛార్జర్లు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. ఫోన్లలో చాలా వరకూ వీటితోనే నడుస్తున్నాయి. బ్యాటరీలు, ఛార్జింగ్ వైర్లు, అడాప్టర్లను స్పెషల్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి కంపెనీలు. కాబట్టి, తక్కువ ధరలో దొరికే డుప్లికేట్ ఛార్జర్లు, బ్యాటరీలు ఉపయోగించకపోవడం ఉత్తమం. ఇక ఇతరుల ఫోన్ల ఛార్జర్లను(వేరే కంపెనీలవి) సైతం అత్యవసర సమయంలోనే ఉపయోగించాలని నిపుణులు చెప్తున్నారు. డుప్లికేట్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ఫోన్లో బ్యాటరీ ఛేంజ్ చేసేప్పుడు కంపెనీ సూచించిన బ్యాటరీనే ఉపయోగించడం మేలు. ఇలా చేయకపోవడం బెటర్ ► సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్ వేడెక్కడం సహజం. అలా సూర్యరశ్మి పడే చోట ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదు. ► ఫోన్‌పై అదనంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఛార్జ్ చేసేప్పుడు ఫోన్‌పై ఎలాంటి వస్తువులు ఉంచకపోవడం ఉత్తమం. ► ఛార్జింగ్ టైంలో ఫోన్ వేడెక్కుతున్నట్లు గమనిస్తే వెంటనే అన్‌ఫ్లగ్ చేయాలి. ► వర్షాలు పడుతున్న టైంలో ఛార్జింగ్ పెట్టి ఫోన్లు ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. ► ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే.. సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి చెక్ చేయించాలి. ► వంద శాతం ఛార్జింగ్.. చాలామందికి ఇదొక ఆనందం. కొన్నిసార్లు రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తారు. అలాంటప్పుడు వేడెక్కి పేలిపోవచ్చు. వెహికిల్స్‌లో ఛార్జింగ్ పెట్టేందుకు ఉపయోగించే పవర్ కేబుల్స్, పవర్ బ్యాంక్‌లను.. ఇంట్లో పవర్ ప్లగ్ నుంచి ఫోన్‌ని ఛార్జ్ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ, పవర్ సప్లైలో తేడా ఉంటుందనే విషయం, ఆ కేబుల్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. వాటితో ఫోన్లు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. వీటితో పాటు కాస్ట్లీ ఫోన్లలో సమస్య తలెత్తినప్పుడు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో రిపేర్ చేయించడం బెటర్. పైగా ఫోన్లో కంపెనీ యాక్ససరీలు కాకుండా థర్డ్ పార్టీ యాక్ససరీలు ఉపయోగించడం వల్ల ఫోన్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. టెక్నికల్ లోటుపాట్లను పక్కనపెడితే.. మన చేతుల్లో ఉన్న జాగ్రత్తల్ని పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చనే చెప్తున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. - సాక్షి, వెబ్‌స్పెషల్ చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
ఈ ఏడాది రూ.2,000 కోట్ల వ్యాపారం: లివ్‌ఫాస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ కంపెనీ లివ్‌ఫాస్ట్ ఈ ఏడాది రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2018లో రూ.949 కోట్ల వ్యాపారం నమోదు చేసినట్టు కంపెనీ సీఈవో గుర్ప్రీత్ సింగ్ భాటియా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా మార్చికల్లా 25,000 ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పారు. ‘కొత్తగా ప్రవేశపెట్టిన మోడళ్లు 25 శాతం వేగంగా చార్జింగ్ అవడమేగాక 25 శాతం అదనపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. 18 రకాల మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మోడల్‌నుబట్టి 15 నుంచి 60 నెలల దాకా వారంటీ ఉంది’ అని వివరించారు. -
వారానికోసారి ఛార్జింగ్ చేస్తే చాలు
అదరగొట్టే స్మార్ట్ ఫోన్లలో అనేకానేక ఆప్షన్లు. ఇంటర్నెట్ నుంచి గేమ్‌ల వరకు అన్నీ అత్యాధునికమే. మరి అన్ని వాడేస్తుంటే బ్యాటరీ ఎంతసేపు వస్తుంది? రోజుకు కనీసం రెండు, మూడు సార్లు చార్జింగ్ పెట్టాల్సి రావడం దాదాపు అందరికీ అనుభవమే. ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నడుం కట్టారు. పదేపదే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ వాచీలలో ఉపయోగించే స్క్రీన్ గ్లాస్ మెటీరియల్‌ను వాళ్లు మార్చారు. ఈ కొత్త మెటీరియల్ అసలు బ్యాటరీ పవర్‌ను వాడుకోదు. సాధారణంగా స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పవర్లో 90 శాతం వరకు స్క్రీన్కు వెలుతురు ఇవ్వడానికే ఉపయోగపడుతుంది. ఇన్నాళ్లూ అందరూ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంపైనే దృష్టిపెట్టారు. కానీ బ్రిటిష్ శాస్త్రవేత్తలు మాత్రం.. స్క్రీన్ ఉపయోగించుకునే బ్యాటరీ పవర్‌ను తగ్గించాలని ప్రయత్నించి.. విజయం సాధించారు. తాము కనిపెట్టిన స్మార్ట్ గ్లాస్ ఉపయోగిస్తే.. ఫోన్లు, టాబ్లు, స్మార్ట్ వాచీలను కేవలం వారానికి ఒకసారి చార్జింగ్ చేస్తే సరిపోతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్ డాక్టర్ పీమన్ హొస్సేనీ తెలిపారు. ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ కొన్నిరకాల ఎలక్ట్రికల్ పల్స్‌లను సృష్టిస్తుంది. దీనివల్ల మంచి ఎండలోనైనా ఫోను బ్రైట్నెస్ ఏమాత్రం పెంచక్కర్లేకుండా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటివరకు అది సాధ్యమయ్యేది కాదు. ఎండలో ఉంటే తప్పనిసరిగా స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుకోవాల్సి వచ్చేది. ఈ కొత్త తరహా స్మార్ట్ గ్లాస్ నమూనాను ఓ ఏడాదిలోపే అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఇలాంటివి వస్తే.. ఇక పవర్ బ్యాంకులకు కూడా కాలం చెల్లిపోతుందేమో!!