breaking news
Bangladesh Open International Challenge
-
లక్ష్య సేన్ ఖాతాలో ఐదో టైటిల్
ఢాకా: భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాడు. ఆదివారం ముగిసిన బంగ్లాదేశ్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోరీ్నలో 18 ఏళ్ల లక్ష్య సేన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య సేన్ 22–20, 21–18తో లియోంగ్ జున్ హావో (మలేసియా)పై విజయం సాధించాడు. తాను పాల్గొన్న గత ఏడు టోర్నీలలో లక్ష్య సేన్ ఐదు టోరీ్నలలో చాంపియన్‌గా నిలువడం విశేషం. బెల్జియం ఓపెన్, డచ్ ఓపెన్, సార్లార్లక్స్ ఓపెన్, స్కాటిష్ ఓపెన్ టోరీ్నల్లో లక్ష్య సేన్ టైటిల్స్ సాధించాడు. మహిళల డబుల్స్‌లో కె.మనీషా–రితూపర్ణ (భారత్) ద్వయం... పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జంట రన్నరప్‌గా నిలిచాయి. ఫైనల్స్‌లో మనీషా–రితూపర్ణ జోడీ 20–22, 19–21తో తాన్ పియర్లీ కూంగ్ లీ–థినా మురళీథరన్ (మలేసియా) ద్వయం చేతిలో... అర్జున్–ధ్రువ్ జంట 19–21, 16–21తో యీ జున్ చాంగ్–కై వున్ తీ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
బంగ్లాదేశ్ ఓపెన్ విజేత రుత్విక
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ జూనియర్ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని స్వదేశం బయట తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. ఢాకాలో శనివారం ముగిసిన బంగ్లాదేశ్ ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నమెంట్లో అన్‌సీడెడ్ రుత్విక సంచలన విజయం సాధించి విజేతగా అవతరించింది. 70 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 137వ ర్యాంకర్ రుత్విక 23-21, 19-21, 21-18తో టాప్ సీడ్, ప్రపంచ 36వ ర్యాంకర్ ఐరిస్ వాంగ్ (అమెరికా)పై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల రుత్విక కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గతేడాది ముంబైలో జరిగిన టాటా ఓపెన్ టోర్నీలో రుత్విక విజేతగా నిలిచి తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా ఉన్న రుత్వికకు తాజా విజయంతో 1,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 75 వేలు)తోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.