breaking news
Baio metrik
-
అంగన్వాడీ అక్రమాలకు చెక్
మెదక్ అర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. దీనికోసం పోషణ అభియాన్ పథకం ద్వారా అంగన్వాడీ సూపర్వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు దశల వారీగా స్మార్ట్ ఫోన్లలోని బయోమెట్రిక్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫొటోలు, వివరాలు నమోదు చేసి వేలి ముద్రలు తీసుకొని పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. ఫలితంగా గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం, చిన్నారులకు బాలామృతం, మురుకులు అర్హులకు మాత్రమే అందనున్నాయి. రిజిస్టర్లలో పేర్లు నమోదు చేయడం, కుళ్లిన గుడ్లు, నాసిరకం భోజనాన్ని వడ్డించడం, సరుకులు పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు ఈ విధానంతో కాలం చెల్లనుంది. పౌష్టికాహారం పంపిణీ పరంగా ఉన్న అవకతవకలను తొలగించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెక్ పెట్టనుంది. పైలెట్ ప్రాజెక్టు పూర్తి.. జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులుఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిల్లో మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 885 ప్రధాన కేంద్రాలు, 191 మినీ కేంద్రాలున్నాయి. వాటిలో మెదక్ ప్రాజెక్టు పరిధిలో 248 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 30 మినీ అంగన్వాడీ కేంద్రాలు, అల్లాదుర్గం ప్రాజెక్టు పరిధిలో 188 ప్రధాన అంగన్వాడీ, 42 మినీ అంగన్వాడీలు, రామాయంపేట ప్రాజెక్టు పరిధిలో 241 ప్రధాన అంగన్వాడీ, 39 మినీ అంగన్వాడీలు, నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలో 208 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 80 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రభుత్వం పోషకాహారం అందిస్తోంది. చాలా చోట్ల పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తుంటే... మరికొన్ని చోట్ల అసలు కేంద్రాలు తెరుచుకోవడంలేదు. రికార్డుల్లో మాత్రం పక్కాగా నడుస్తున్నట్లు చూపుతున్నారు. కాగా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ పరంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ అక్రమాలకు తావులేకుండా చూడటానికి ఇప్పటికే పలుచోట్ల పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు బయోమెట్రిక్ యాప్‌తో కూడిన స్మార్ట్ఫోన్లు అందించి పరిశీలించింది. ఇవి సత్ఫలితాలనివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో విడతల వారీగా అంగన్వాడీ సూపర్వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు బయోమెట్రిక్ యాప్‌తో కూడిన స్మార్ట్ఫోన్లు అందించి పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా నిర్ణయించింది. ఈ యాప్‌ను ప్రారంభించి పాలు, గుడ్లు తదితర పౌష్టికాహారం అందిస్తున్న కొన్ని చోట్ల సాంకేతికపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా అధికారులు తెలిపారు. పారదర్శకత పెరుగుతుంది.. అంగన్వాడీ కేంద్రాల్లో పప్పులు, పాలు, నూనె, గుడ్లు ఆయా అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లతో బయోమెట్రిక్ విధానం ద్వారా కేంద్రాలకు సరఫరా చేస్తున్నాం. బియ్యం రేషన్ దుకాణాల ద్వారా అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయడానికి బయోమెట్రిక్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఆన్లైన్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో గుడ్లు, పాలు అందించడానికి ఆలస్యం జరిగింది. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందకూడదు. కొద్ది రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తాం. – జ్యోతిపద్మ, మహిళా, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారిణి -
బయోమెట్రిక్‌తోనే సిమ్ యాక్టివేషన్
ఇక నకిలీ సిమ్ కార్డులు చెల్లవు పాలకుర్తిలో నూతన విధానం అమలు పాలకుర్తి టౌన్ : వినియోగదారులు ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు ఉపయోగించకుండా కార్డుల జారీకి బయో మెట్రిక్ విధానం అమలులోకి వచ్చిందని ఎయిర్టెల్ ప్రతినిధి శంకర్ లిక్కి తెలిపారు. గురువారం పాలకుర్తిలో బయో మెట్రిక్ విధానంతో సిమ్ కార్డుల జారీ కార్యక్రమాన్ని పాలకుర్తి ఎస్సై ఎన్. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ లిక్కి మాట్లాడుతూ.. గతంలో ఐడీకార్డు, ఫొటో ఉంటే సిమ్‌కార్డు పొందటం తేలికయ్యేదని. దీంతో ఇతరుల పేరిట సిమ్ కార్డులు విచ్చలవిడిగా వినియోగిస్తుండడంతో అసాంఘికక శక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అందుకే బమోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు వివరించారు. వినియోగదారుడు వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ అందజేయాలని, బయోమెట్రిక్ మిషన్ ద్వారా వేలిముద్ర స్వీకరించిన ఐదు నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ పగడాల శ్రీ««దlర్, తమ్మి రాంబాబు, బొగ్గరాపు నాగరాజు, వంగ మహేందర్ పాల్గొన్నారు.