breaking news
badepalli market
-
బాదేపల్లి మార్కెట్లో నిలువు దోపిడీ
♦ అమ్మిన సరుకుకు కమీషన్3కు బదులు 6శాతం వసూలు ♦ నిలదీసిన రైతు.. ♦ మంత్రి హరీశ్‌రావుకు ఫ్యాక్స్‌లో ఫిర్యాదు ఇదో కమీషన్ ఏజెంట్ దందా..మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా..అమ్మిన సరుకుకు మూడు శాతం కమీషన్‌కు బదులు ఆరుశాతం వసూలు చేశాడు. తక్ పట్టీకి అదనంగా మరో తెల్లచీటీపై నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు కట్‌చేసి లెక్కపత్రం అందజేస్తుండడంతో గమనించిన రైతు నిలదీశాడు. ఈ విషయంపై మార్కెట్ కార్యాలయంలో, మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేశాడు. జడ్చర్ల : తాను అమ్మిన సరకుకు డబ్బులు చెల్లించాల్సిన కమీషన్ ఏజెంట్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఓ రైతు సంబ ంధిత అధికారులు, మంత్రికి ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో చో టుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. రాజాపూర్ మండలం కల్లెపల్లికి చెందిన రైతు బ్రహ్మచారి గత నెల 30 న 25 క్వింటాళ్ల మొక్కజొన్నను బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్ జగన్నాథం ద్వారా క్వింటాల్‌కు రూ.1,426 చొప్పున విక్రయించి.. తక్‌పట్టీ తీసుకున్నారు. అయితే తక్పట్టిలో పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా సదరు కమీషన్ ఏజెంట్ తన దగ్గర ను ంచి అదనంగా కమీషన్‌ను వసూలు చేశారని రైతు యార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అదనంగా కమీషన్ వసూలు ఎందుకు చేస్తున్నారని కమీషన్ ఏజెంట్‌ను ప్రశ్ని ంచగా సరైన సమాధానం కూడా ఇవ్వకుండా యార్డులో అందరు ఇలాగే వసూలు చేస్తారని నిర్లక్షంగా వ్యవహరించారని విలేకరులు, వైస్‌చైర్మన్ శ్రీశైలంయాదవ్‌కు వివరించారు. తనకు మొత్తంగా రూ.36 వేలు రాగా కమీషన్ కింద రూ.1,274 పట్టుకుని మిగతా డబ్బులకు చెక్ ఇచ్చారని తెలిపారు. నిబంధనల ప్రకారం 3 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా 6.50 శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్లో 3 నుంచి 4 శాతం మాత్రమే కమీషన్ వసూలు చేస్తుండగా బాదేపల్లి మార్కెట్లో అంతకు మించి వసూలు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా తక్ పట్టీకి అదనంగా మరో తెల్లచీటీపై నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు కట్‌చేసి లెక్కపత్రం అందజేస్తున్నారని, వాస్తవంగా సరకు అమ్మిన తర్వాత రైతులకు ఎన్నిరోజులకు డబ్బులు ముట్టజెప్పాలన్న దానిపై స్పష్టత లేదని వాపోయారు. అధికారులు స్పందించాలి.. స్థానిక మార్కెట్ యార్డులో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని బాధిత రైతు ఆరోపించారు. ఇది తన ఒక్కడికి జరిగిన అన్యాయం కాదని.. వందలాది మంది అమాయక రైతులను ఇలాగే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావుకు సైతం ఫ్యాక్స్‌లో ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతాంగానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా యార్డులో హమాలీలు, చాట కూలీ రేట్లు అధికంగా ఉన్నాయని వారికి చెల్లించే కూలీ తక్కువగా ఉండడంతో అదనంగా చెల్లించేందుకు రైతుల నుంచి వసూలు చేస్తున్నార ని వ్యాపార సంఘం అధ్యక్షుడు బాలస్వామి, కార్యదర్శి పరుశవేది పేర్కొన్నారు. దీనిపై అధికారులు, పాలకమండలి సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్ తెలిపారు. -
మెరిసిన తెల్లబంగారం
జడ్చర్ల, న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ మసకబారిన తెల్లబంగారానికి వన్నె వస్తోం ది. పత్తిధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండటంతో రైతన్న ముఖా ల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బుధవారం బాదేపల్లి మార్కెట్లో పత్తి క్వింటాలు కు రూ.5072 పలికింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి పత్తి మార్కెట్‌కు ఐ దువేల క్వింటాళ్ల పత్తి విక్రయానికి రావడం తో ఆవరణమంతా బస్తాలతో నిండిపోయిం ది. క్వింటాలుకు గరిష్టంగా రూ.5072 ధర పలకగా, కనిష్టంగా రూ.4209 ధర లభిం చింది. గత శనివారం మార్కెట్లో పత్తికి గరి ష్టంగా రూ.4869 ధర లభించింది. కాగా పత్తి కి గరిష్టంగా ఇంతధర రావడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. గతేడాది కూడా ఇంత ధర లు మార్కెట్లో లభించలేదు. ప్రభుత్వం ప త్తికి గరిష్టంగా రూ.4000, కనిష్టంగా రూ. 3800 మద్దతుధరలను కేటాయించింది. అయితే ఇక్కడి మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధరలను మించి రికార్డుస్థాయిలో పత్తికి ధర లభిస్తుండటంతో రై తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇది వరకే అమ్ముకున్న రైతులు మాత్రం ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ ఏడాది పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిన నేపథ్యం లో రైతుల దగ్గర ఇక పత్తి నిల్వలు లేవని భావించిన వ్యాపారులు పోటీపడి ధరలను పెంచినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్క రోజే మార్కెట్లో రూ.2.25కోట్ల పత్తి వ్యాపారం జరిగింది. దీంతో యార్డుకు రూ.2.25లక్షల ఆదాయం ఒక్కరోజే లభించిందని యార్డు అధికారులు పేర్కొన్నారు. మున్ముందు కూడా ఇవే ధరలు ఉంటాయో లేదో వేచిచూడాలి.