19కి పెరిగిన బస్సు ప్రమాద మృతులు
లిమా : దక్షిణ పెరూలోని అయాచుచో ప్రాంతంలో సోమవారం బస్సు లోయలో పడిన దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 19 కి చేరిందని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరణించిన 19 మృతదేహలను ఘటన స్థలం నుంచి పూక్యో నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. అయితే వారిని గుర్తించ వలసి ఉందని పేర్కొంది. బంధువులు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారని... వారు మృతులను గుర్తించగానే... వారి బంధువులకు మృతదేహలను అందజేస్తామని తెలిపింది.
కాగా ప్రమాదం జరిగిన వెంటనే 13 మంది ఘటన స్థలంలో మరణించగా.... మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మరణించారని వెల్లడించింది. అయాచుచో ప్రాంతంలో సోమవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 37 మంది గాయపడిన సంగతి తెలిసిందే. కాగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని మీడియా తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంత వరకు కనుగొన లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.