breaking news
avalanche warning
-
విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి
క్రీడలో విషాదం నెలకొంది. అమెరికాకు చెందిన స్కీయింగ్ స్టార్(Skieing Game), మాజీ వరల్డ్ ఛాంపియన్ కైల్ స్మెయిన్.. హిమపాతంలో కూరుకుపోయి సజీవ సమాది అవడం అందరిని కలచి వేసింది. ఆదివారం(జనవరి 29న) జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లోని 2,469 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ హకుబా నోరికురా వద్ద జరిగిన దుర్ఘటనలో స్మెయిన్ (31) సహా వేరే గ్రూపుకు చెందిన ఆస్ట్రియన్ స్కీయర్ కూడా మరణించినట్లు ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. కాగా మార్కెటింగ్ ఫిల్మ్ షూటింగ్ కోసం మౌంట్ హకుబా నోరికురాకు వెళ్లినట్లు మౌంటెన్గెజిట్ ఫోటోగ్రాఫర్ గ్రాంట్ గండర్సన్ తెలిపాడు. షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో హిమపాతం స్మెయిన్ సహా ఆస్ట్రియా స్కీయర్ను భూమిలోకి కూరుకుపోయేలా చేసింది. వారి కోసం గాలింపు చేపట్టినప్పటికి లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా గ్రాంట్ గండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్మెయిన్ ఫోటో షేర్ చేస్తూ.. ''ఇది నిజంగా పీడకల అయ్యుంటే బాగుండేది'' అని విచారం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Kyle Smaine (@kylesmaine) అయితే స్మెయిన్ చనిపోవడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ''పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికి స్కీయింగ్‌పై తనకున్న అభిమానం ఎంత కష్టమున్నా లెక్కచేయనివ్వదు. కష్టంలోనే మన సక్సెస్ ఏంటో తెలుస్తుంది'' అని చెప్పుకొచ్చాడు. కాగా 1991, జూన్ 27న అమెరికాలో జన్మించిన కైల్ స్మెయిన్ చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలపై క్లైంబింగ్ చేయడం హాబీగా మార్చుకున్నాడు. అలా స్కీయర్‌గా మారిన స్మెయిన్ 2015లో ఎఫ్ఐఎస్ ఆల్పైన్ వరల్డ్ స్కై చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018 ఒలింపిక్స్‌లో స్కీయింగ్‌లో పాల్గొన్న తొలి అమెరికన్ అథ్లెట్‌గా కైల్ స్మెయిన్ నిలిచాడు. -
సియాచిన్‌లో మంచుతుపాను, జవాన్ అదృశ్యం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఓ జవాను అదృశ్యమయ్యారు. టర్టుక్ సెక్టార్‌లోని మంచు కొండలు విరగడంతో అక్కడ గస్తీలో ఉన్న ఆర్మీ పెట్రోల్ పార్టీ జవాను శుక్రవారం ఉదయం గల్లంతయ్యాడు. ఈ ఘటనలో అదృశ్యమైన జవాను కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా మరో సైనికుడు గాయపడినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి ఓ అధికారి సహా పది ది సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా మంచు చరియలు విరిగిపడటంతో మరోవైపు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఏటవాలు ప్రాంతాలకు రాకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరేదాకా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. జమ్మూ కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బందీపూర్, కార్గిల్, గందర్బల్ జిల్లాల్లో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.