breaking news
avakaya process
-
'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా..
ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్మెంట్ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోతీనగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్డ్ అపార్ట్మెంట్ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్ గ్రూపులో పంచుకుంది. దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్‌ను బుక్ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్ ఒక వేడుకగా మారింది. శంషాబాద్ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు. తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి మిగిల్చింది. – దీప్తి ధరణిప్రగడమధురానుభూతి.. కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్మెంట్లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. – స్వాతి జ్యోతుల (చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..) -
నోరూరించే ఆవకాయలు.. ఆకాశానికి ధరలు!
సాక్షి, నల్గొండ : వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడికాయ పచ్చడి వైపే ఉంటుంది. ఇటీవల ఎక్కువగా తయారు చేసిన పచ్చళ్లు కొనుక్కునే వాళ్లంతా ప్రస్తుతం లాక్డౌన్ కలిసి రావడంతో సొంతంగా తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంటి పట్టున ఉన్న మహిళలంతా మామిడికాయ పచ్చడి తయారు గురించే ముచ్చటించుకుంటున్నారు. ఇంట్లో పెద్ద వారి సూచనలతో ఇంటిళ్లి పాది ఆవకాయ తయారీలో ఓ చేయి వేస్తున్నారు. చెక్క పచ్చడి, తరుగుడు పచ్చడి, అల్లం వెల్లిపాయ ఆవ, ఉప్పు ఆవ, బెల్లం ఆవ, నువ్వుల పచ్చడి తదితర ఎన్ని పేర్లున్నా అనిర్వనీయమైన రుచి ఆవకాయ సొంతం. అయితే ఇటీవల ఈదురు గాలులకు మామిడి కాయలు దెబ్బతిని కొంత కొరత ఏర్పడటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పచ్చడి మామిడి కాయ ఒక్కటి రూ.10 నుంచి రూ.15 వరకు పలుకుతుంది. పెరిగిన సామగ్రి ధరలు.. పచ్చడి తయారీలో ప్రధానమైన వంట సామగ్రి అయిన నూనె, అల్లం, వెల్లుల్లి, కారం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. పచ్చడి తయారీకి వినియోగించే నువ్వుల నూనె బ్రాండ్‌ను బట్టి కేజీ రూ.400 వరకు విక్రయిస్తున్నారు. పల్లీ నూనె అయితే కేజీకి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అల్లం కిలో రూ.50, వెల్లుల్లి రూ.80లకు విక్రయించగా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం అల్లం రూ.90, వెల్లుల్లి రూ.120 వరకు పెరిగింది. మామిడికాయ పచ్చళ్లలో ఉపయోగించే మిరప బ్రాండ్‌ను బట్టి కేజీకి రూ.400 నుంచి రూ.500 వరకు ఉన్నవి. కిలో పచ్చడికి సుమారు రూ.500 వ్యయం.. కిలో పచ్చడి తయారీకి సాధారణంగా పావుకిలో నూనె, పావుకిలో ఉప్పు, 125 గ్రాముల కారం పొడి, అర కిలో అల్లం వెల్లుల్లితో పాటు మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి వినియోగిస్తారు. ఆయా సరుకులతో పాటు మామిడి కాయలు.. అన్నింటి వ్యయం కలిపి కిలోకు రూ.500 ఖర్చవుతోంది. గతంలో ఒక్కో కుటుంబం 100 నుంచి 150 కాయల వరకు పెట్టే వారు. ప్రస్తుతం ఎక్కువగా బీపీ, షుగర్ జబ్బులు వస్తుండడంతో ఉప్పు ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి లేదు. దీంతో 20 నుంచి 50 కాయల వరకే పెడుతున్నామని మహిళలు చెబుతున్నారు. ధరలు బాగా పెరిగాయి గతంలో మామిడికాయలకు అల్లం వెల్లుల్లి, కారం, ఇతర వస్తువులకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు అధికంగా పెరగడంతో ఆర్థిక భారం అవుతోంది. అయినా ప్రతి వేసవిలో మారిగానే.. ఈ సారి కూడా పచ్చడి పెడుతున్నాం. – జి.హేమలత, గృహిణి, తిరుమలగిరి -
ఓ కేంద్ర మంత్రి.. ఆవకాయ!
కేంద్రంలో మంత్రి అయినా.. విదేశాలకు వెళ్లి వాణిజ్య సంబంధాలు పెంపొందించినా.. ఆమె కూడా ఓ తెలుగింటి కోడలే. అందుకే ఆవకాయ, తొక్కుడు పచ్చడి వదులుకోలేకపోయారు. అత్తవారింటికి వెళ్లి.. అక్కడ అత్తగారు, ఆడపడుచులతో కలిసి ఆవకాయ పెట్టే పనిలో పడ్డారు. ఆమె ఎవరో కాదు.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. స్వతహాగా తమిళనాడుకు చెందినా, పరకాల ప్రభాకర్ ను పెళ్లి చేసుకుని పశ్చిమగోదావరి జిల్లా కోడలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి అయిన నిర్మల.. ప్రస్తుతం ఆవకాయ సీజన్ కావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని 'ఈశావాస్యం'లో అందరూ కలిసి ఆవకాయ, తొక్కుడు పచ్చడి, బెల్లం ఆవకాయ పెట్టుకున్నారు. ఈ విశేషాలను పరకాల ప్రభాకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పదిమందితో పంచుకున్నారు. ఈశావాస్యమ్ లో పునరపి ఆవకాయం! The Grand Aavakaya annual ritual at #Isavaasyam Nirmala does. Akka n Amma guide. pic.twitter.com/eyD9MqjVvB — Parakala Prabhakar (@parakala) May 2, 2015