breaking news
Australia cricket captain
-
రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్ కెప్టెన్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మా బేబీకి సంబంధించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది!మా జీవితాలను మరింత క్రేజీగా మార్చేందుకు వస్తున్న చిన్నారి కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని బెకీతో పాటు కమిన్స్ ఇన్‌స్టాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య బెకీ, కుమారుడు ఆల్బీ ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో బెకీ బేబీ బంప్‌తో కనిపించగా.. ఆల్బీ తల్లిని ముద్దాడుతున్నాడు.కుమారుడి సమక్షంలో వివాహంకాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 2020లో బెకీ బోస్టన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లికి ముందే వీరికి అల్బీ(2021) జన్మించాడు. తాజాగా మరోసారి కమిన్స్- బెకీ తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా కమిన్స్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మూడేళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో డీలా పడ్డ రైజర్స్‌ను ఏకంగా ఫైనల్‌కు చేర్చి ఆరెంజ్ ఆర్మీ హృదయాలు గెలుచుకున్నాడు కమిన్స్. ఐపీఎల్ సమయంలో కమిన్స్‌తో పాటు బెకీ, ఆల్బీ.. ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌కు విచ్చేశారు.ఎనిమిది వారాల విరామంటీ20 ప్రపంచకప్-2024లో ఆసీస్ సెమీస్‌లోనే నిష్క్రమించగా.. కమిన్స్ అప్పటి నుంచి ఎనిమిది వారాల పాటు విరామం తీసుకున్నాడు. టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఈ బ్రేక్ తీసుకున్న కమిన్స్.. ఏ ఆటగాడికైనా విరామం కచ్చితంగా అవసరమని పేర్కొన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ సైకిల్లో భాగంగా వరుస టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో తాను ఈ మేరకు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించాడు. View this post on Instagram A post shared by Rebecca Jane Cummins (@becky_cummins) -
మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్
లండన్: ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నోరు జారి అంతలోనే నాలుక్కరుచుకున్నాడు. 'సక్సెస్' అనే మాట బదులు 'సెక్స్' పదాన్ని ఉచ్చరించిన క్లార్క్ వెంటనే తప్పును సరిదిద్దుకుని బిగ్గరగా నవ్వేశాడు. విషయం ఏంటంటే.. ఇంగ్లండ్‌తో జరగనున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టు ముందు క్లార్క్ మీడియాతో మాట్లాడాడు. లార్డ్స్‌లో జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా పుంజుకోవాలన్నది క్లార్క్ అభిప్రాయం. అయితే 'నైపుణ్యం ప్రదర్శిస్తేనే.. సెక్స్' అంటూ క్లార్క్ నోరు జారాడు. వెంటనే సక్సెక్స్ సాధించగలమని సరిచేశాడు. క్లార్క్ మాటలకు అక్కడనున్నవారందరూ కాసేపు షాక్ అయినా ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ విషయం గమనించిన క్లార్క్ తనతో మరోసారి ఇబ్బంది పడ్డారంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల ప్రపంచ కప్ సందర్భంగా కూడా క్లార్క్ ఇలాగే మాట్లాడి ఆనక సరిచేసుకున్నాడు.