breaking news
Atul B Tapkir
-
యువ సినీ నిర్మాత ఆత్మహత్య...
పూణె: యువ సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. మహరాష్ట్రకు చెందిన అతుల్ బి టప్కిర్(35) అనే యువ నిర్మాత పూణేలోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిత్ర నిర్మాణాలతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసుకున్నాడు. పోలీసులు హోటల్ గది బద్దలు కొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. శనివారం ఫేస్బుక్ అకౌంట్లో తాను నిర్మంచిన దోల్ థాసే చిత్రంతో ఆర్థికంగా నష్టపోయినట్లు పోస్టు చేశాడు. తనకు తనకుటుంబంలో తన తండ్రి, సోదరి తనను ప్రొత్సహించినా, భార్య మాత్రం హింసించేదని తన వాల్‌పై రాసుకున్నాడు. భార్య పిల్లలను తననుంచి దూరం చేసిందని, తనపై పలుమార్లు ఆరోపణలు చేసిందని ఆవేదన అతుల్ వ్యక్త చేశాడు. తనను ఇరుగుపొరుగుల మధ్య అవమాన పరిచిందని చెప్పాడు. భార్య అన్నలు తనని కొట్టారని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టిందని వాపోయాడు. పోలీసుస్టేషన్లో మహిళ ఫిర్యాదు చేసినప్పడు ఎదుటివారి వాదనలు కూడా వినేలా పోలీసులకు చెప్పమని ముఖ్యమంత్రిని కోరాడు. తన మరణం తర్వాత పిల్లలను పట్టించుకోదని తన తండ్రి వారి ఆలన పాలన చూడాలని కోరాడు. తనను ఏవిధంగా బాధపెట్టారో అన్ని వివారాలు తన పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసినట్లు అతుల్ తన ఫేస్బుక్ వాల్‌పై రాసుకున్నాడు. -
భార్య వేధింపులు, నిర్మాత ఆత్మహత్య
పుణె: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో మరాఠీ సినీ నిర్మాత అతుల్ బి టప్కీర్ (35) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని ఓ హోటల్ గదిలో ఆయన ఆదివారం మృతి చెందారు. కాగా అతుల్ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ.. మరాఠీ భాషలో ఓ లేఖను శనివారం తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఆర్థిక నష్టాలు, కుటుంబ గొడవల కారణంగానే ప్రాణం తీసుకుంటున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. 2015లో విడుదలై విజయం సాధించిన ‘ధోల్ తాషే’ చిత్రం అతుల్ నిర్మించిందే. తన తండ్రి, సోదరి తనకు మద్దతుగా నిలిచారని, అయితే భార్య ప్రియాంక మాత్రం వేధింపులకు గురి చేసినట్లు ఆయన తన లేఖలో వివరించారు. భార్య ఇంటి నుంచి వెళ్లగొట్టిందని, దాంతో తాను గత ఆరు నెలలుగా బయటే ఉంటున్నానని, అంతేకాకుండా పిల్లలను తననుంచి దూరం చేసిందని, తనపై ఆరోపణలు చేసి, అందరి ఎదుట చులకన చేసి మాట్లాడేదని అతుల్ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే ప్రియంక సోదరులు కూడా తనపై చేయి చేసుకునేవారని తెలిపాడు. అలాగే కొద్దిరోజుల క్రితం తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు. అలాగే ఓ మహిళ ఫిర్యాదు చేసినప్పుడు...పోలీసులు ఎదుటవారి వెర్షన్ కూడా వినాలని... మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అతుల్ టప్కీర్ కోరారు. తన పిల్లలను భార్య షోపించలేదని, అందువల్ల వారిని తన తండ్రే వారిని చూసుకోవాలని తెలిపాడు. అలాగే తన భార్య వేధింపులకు సంబంధించిన ఆధారాలన్నీ పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసి పెట్టినట్లు అతుల్ తన లేఖలో తెలిపాడు. కాగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.