breaking news
Arumugam
-
మానవ సహిత గగన్‌యాన్.. ఎల్వీఎం–3 ద్వారా రోదసిలోకి మనుషులు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ వెల్లడించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో గురువారం గణతంత్ర వేడుకల అనంతరం భాస్కర్ అతిథి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గగన్‌యాన్‌కు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా భూస్థిర పరీక్షలు నిర్వహించామని చెప్పారు. దీనికి సంబంధించి 2022లో తొమ్మిది రకాల సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్‌లు నిర్వహించామన్నారు. మరో 30 రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది ఆఖరు నాటికి క్రూ మాడ్యూల్తో ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముందు రెండుసార్లుగా మానవ రహిత ప్రయోగాలను నిర్వహించాక 2024 ఆఖరు నాటికి ఎల్వీఎం–3 భారీ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు ఇస్రోలో అన్ని సెంటర్లు దీనిపై దృష్టిసారించి పనిచేస్తున్నాయన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకుని దీనికోసం ఇస్రోలో ప్రతిఒక్కరు కృషిచేస్తున్నారని రాజరాజన్ చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో గగన్‌యాన్ ప్రయోగంలో మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 2023లో 11 ప్రయోగాలు లక్ష్యం ఇక ఈ ఏడాది 11 ప్రయోగాలు లక్ష్యంగా ఇప్పటినుంచే పనిచేస్తున్నామని రాజరాజన్ తెలిపారు. ఇందులో ఈ ఏడాది పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఐదు రాకెట్లు, ఎల్వీఎం–3లో రెండు, జీఎస్ఎల్వీ సిరీస్‌లో రెండు, ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో రెండు ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ఇందులో ఫిబ్రవరి మూడో వారంలో ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) డీ2 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం ఐదు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నామన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ల ద్వారా వన్‌వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను, చంద్రయాన్–3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజరాజన్ చెప్పారు. అలాగే, జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా నావిగేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని కూడా తెలిపారు. మరోవైపు.. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పీఐఎఫ్) భవనం నిర్మాణం పూర్తిచేసి విజయవంతంగా ట్రయల్ రన్‌ను నిర్వహించామని.. రెండో ప్రయోగ వేదికకు సంబంధించి సెకండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ55 ఇంటిగ్రేషన్‌తో సెకండ్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మొత్తం మీద షార్‌లోని అన్ని సదుపాయాలను ఉపయోగించి ఈ ఏడాది 11 ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తద్వారా ఈ ఏడాది కూడా స్పేస్ రీఫార్మ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చునని ఆయన తెలిపారు. చివరగా.. ప్రైవేట్ ప్రయోగాల విషయంలో ఎవరైనా స్టార్టప్ కంపెనీలతో వస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. -
అన్నాడీఎంకే నేత దారుణ హత్య
పళ్లిపట్టు: అధికార అన్నాడీఎంకే నేత దారుణహత్యకు గురైన సంఘటన తిరుత్తణిలో కలకలం రేపింది. తమ పార్టీ నేత దారుణహత్యకు నిరసనగా అన్నాడీఎంకే శ్రేణులు దుకాణాలు మూయించే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణికి చెందిన ఆరుముగం(42) అలియాస్ ఆపిల్ ఆరుముగం అన్నాడీఎంకే పార్టీ జిల్లా యువజన విభాగ ఉప కార్యదర్శిగాను, తిరుత్తణి నగర పాలక సంస్థ సభ్యుడిగా ఉన్నారు.పోలీసు స్టేషన్లో ఇతనిపై దాదాపు 12 కేసులున్నాయి. ఇదిలా ఉండగా వారం రోజుల క్రి తం స్థానిక బస్టాండు ప్రాం తంలో ఇతను వాకింగ్ వెళుతున్న సమయంలో హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుత్తణి ఇంద్రానగర్‌లో ఉన్న వాటర్‌ప్లాంట్‌కు ఆరుముగం బయలుదేరారు. ఆ సమయంలో ఆటోలో వెంబడించిన దుండగు లు ఇతనిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయి తే వారి నుంచి తప్పించుకుని పారిపోతున్న సమయం లో వెనకాలే వచ్చిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆరుముగంను అటువైపుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించిన కొంతసేపటికే ఆరుముగం మృతి చె ందాడు. రాస్తారోకో రణరంగం తమ నేత హత్య గురయ్యాడన్న విషయంతో ఆగ్రహం చెందిన అన్నాడీఎంకే శ్రేణులు నిరసనగా దుకాణాలను మూసి వేయించేందుకు ప్రయత్నించారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ ఈశవరన్ నేతృత్వంలోని పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎంపీ హరి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది చెన్నై బైపాస్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. దీనికి కూడా పోలీసులు అడ్డు చెప్పడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఎదురు తిరిగారు. జిల్లా ఎస్పీ శ్యాంసన్ సంఘటన ప్రాంతం చేరుకుని ఎంపీ, అన్నాడీఎంకే కార్యకర్తలకు సర్దిచెప్పారు. అయితే రాస్తారోకో విరమించి వెళుతున్న సమయంలో మళ్లీ డీఎస్పీ ఈశ్వరన్ వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో రాస్తారోకో రణరంగంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. విలేకర్లకు తీవ్ర గాయాలు పోలీసులు లాఠీ చార్జి సమయంలో అక్కడే ఉన్న మాలై తమిళగం తమిళ పత్రిక విలేకరి కృష్ణనన్కు తీవ్ర గా యాలయ్యాయి. ఆంధ్రజ్యోతి, మాలైమురసు విలేకర్లు హరికుమార్శర్మ, వినోత్ తదితరులు గాయపడ్డారు. వీరిని వెంటనే తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. ఇదిలా ఉండగా 500 మంది పోలీసులు తిరుత్తణిలో మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. హంతకుల కోసం గాలిస్తున్నాం: ఎస్పీ శ్యాంసన్ అన్నాడీఎంకే నేత దారుణహత్యకు సంబంధించి ఎస్పీ శ్యాంసన్ మాట్లాడుతూ హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని బరిలోకి దింపామని దుండగులను తొందర్లోనే తెలిపారు. -
రొమాంటిక్ నెరజాణ
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాల నేపథ్యంలో రూపొందిన తమిళ చిత్రం‘పూక్కడై సరోజ’. ఆర్ముగం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నెరజాణ’ పేరుతో సురేందర్ విడుదల చేయనున్నారు. శ్రీదేవి కథానాయిక. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతోంది’’ అని నిర్మాత తెలిపారు. -
చిట్టిసభ
పిల్లలకో మంచి అలవాటు. ఏది కావాలన్నా అడిగేస్తారు.. కావాలంటే కడిగేస్తారు.. పిల్లల్లోని ప్రశ్నించే ఈ గుణాన్ని బలపరిస్తే సమాజం బాగుపడుతుంది. లోగమ్మాళ్ ఆర్ముగం అలాగే అనుకుంది. అందుకే పిల్లల్లో ఉండే ఈ మంచిగుణాన్ని పదునుపెట్టింది. తమిళనాడులోని అరణ్‌వయళ్ అనే ఊళ్లో పిల్లలు ‘చిట్టిసభలు’ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉండే సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. వీథిలైటు దగ్గర నుంచి స్కూల్లలకు టాయిలెట్ల దాకా సమకూర్చుకోగలుగుతున్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథ చదివాక... మన ఊళ్లలో పిల్లలు కూడా చట్టసభల్లాంటి చిట్టిసభలను ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది! ఇలా సమస్యలకు పరిష్కారం కనుగొంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇది చూసి పెద్దలూ గట్టిగా ప్రశ్నించడాన్ని అలవాటు చేసుకుంటే దేశం బాగుపడుతుంది. తమిళనాడు.. తిరువళ్లూర్ జిల్లాలోని అరణ్‌వయళ్ గ్రామం. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఆ ఊళ్లోని గుడి ఆవరణలో రకరాల వయసున్న పిల్లలు కొంతమంది సమావేశమయ్యారు. అందులోని ఒక పిల్లాడు ఆ ఊళ్లోని ఓ వీథిలో పాడైపోయి.. వైర్లు వేలాడుతున్న ఓ వీథిలైటు స్విచ్‌బోర్డ్ అంశాన్ని చర్చలో పెట్టాడు. స్పీకర్‌స్థానంలో ఉన్న మరో అబ్బాయి ఆ చర్చకు అనుమతిచ్చాడు. ఈ అంశాన్ని చర్చకు పెట్టిన అబ్బాయే మాట్లాడుతూ.. స్విచ్బోర్డ్లోంచి బయటకు వచ్చిన ఆ వైర్లు ఆ వీథిలోని పాదచారులకు, ఆ బోర్డ్పక్కనే ఉన్న ఇళ్లవాళ్లకు ఎంత ప్రమాదరకంగా మారాయో వివరిస్తున్నాడు. ‘అక్కడ పరిస్థితి చాలా డేంజర్‌గా ఉంది. పొరపాటుగా ఏ తీగ తగిలినా షాక్ కొడ్తుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి సభ్యులందరూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వచ్చు’ అన్నాడు సమావేశంలోని మిగిలిన వారిని ఉద్దేశిస్తూ. ‘మన పీడబ్ల్యూడీ మినిస్టర్ ఉన్నాడు కదా.. కొత్త స్విచ్‌బోర్డ్ ఏర్పాటు చేయమని పంచాయతీ వార్డ్ మెంబర్‌కి ఓ పిటిషన్ రాస్తే సరి’ అంటూ ఒక సభ్యుడు సలహా ఇచ్చాడు. ఈ సలహా సభ్యులందరికీ నచ్చింది. దాంతో ఆ చర్చ కొత్త స్విచ్‌బోర్డ్ కోసం పంచాయితీ వార్డ్మెంబర్కి పిటిషన్‌ను ఎప్పుడు సమర్పించాలి అనేదాని మీదకి మళ్లింది. ‘వచ్చే ఆదివారమైతే బాగుంటుంది’ అని సూచించింది ఒక సభ్యురాలు. ‘వచ్చే ఆదివారం గుళ్లో జాతర ఉంది. అందరూ అదే హడావిడిలో ఉంటారు. దీని గురించి పట్టించుకోరు’ అన్నాడు ఇంకో సభ్యుడు. ‘నిజమే’ అంటూ మిగిలిన సభ్యులూ గొంతు కలిపారు. అలా వాళ్లంతా పిటిషన్‌ను సమర్పించాల్సిన తేదీ గురించి తర్జనభర్జన పడుతున్నారు. అప్పటిదాకా ఈ సమావేశాన్ని దూరం నుంచే చూస్తున్న 39 ఏళ్లున్న ఒకావిడ దగ్గరగా వచ్చి ‘గుడి జాతర కంటే ముందే కొత్త స్విచ్‌బోర్డ్ ఏర్పాటుకు పిటిషన్ వేస్తే మంచిది కదా’ అంటూ సూచించింది. ఆ సూచన సభ్యులందరికీ సమంజసంగా తోచింది. ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ వెంటనే మరో సమస్య మీద చర్చ ప్రారంభించారు. ఇది పిల్లలు పిల్లలు కలిసి ఆడుకుంటున్న ఆట కాదు. ఊసుపోక తలపోసుకుంటున్న ఊహా కాదు. నిజం! దేశంలోని సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు వెదికి.. చట్టంగా చేసే అచ్చు పార్లమెంట్ లాంటి ‘చిట్టిసభ’! పిల్లల పార్లమెంట్. అరణ్‌వయళ్ ఊరి పార్లమెంట్. అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్! ఆడిపాడే పసివాళ్లు సమాజం పట్ల స్పృహను పెంచుకోవడానికి చేస్తున్న అధ్యయనం. సమస్యల పరిష్కారంలో తమ వంతు బాధ్యతలను తెలుసుకుంటున్న వైనం. వీళ్లకు ఈ విషయాన్ని నేర్పుతున్నదెవరో కాదు.. ఆ సమావేశంలో మధ్యలో కల్పించుకొని ఓ చిన్న సూచన చేసిన నడివయసు స్త్రీ.. లోగమ్మాళ్ ఆర్ముగం. వయసుకు మించిన పరిణతి అర్ముగం గురించి పరిచయం కంటే ముందు ఆమె పరిచయం చేసిన ఈ పార్లమెంట్ సాధించిన విజయాలను తెలుసుకుందాం. అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్‌లోని పిల్ల సభ్యులు వయసుకు మించిన పరిణతి ప్రదర్శిస్తున్నారు. వాళ్లు పెంపొందించుకున్న అవగాహన అలాంటిది మరి! 2006 వరకు ఆ ఊరి నడిబొడ్డున.. బస్టాండ్ పక్కనే ప్రభుత్వం సారా దుకాణం నడిపేది. దీనివల్ల అక్కడి ఆడవాళ్లు, పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు ఈ పిల్లల పార్లమెంట్ ‘ప్రభుత్వం బస్టాండ్ పక్కనుంచి సారా దుకాణాన్ని ఎత్తేయాలి’ అంటూ ఊళ్లో వాళ్లందర్నీ కలుపుకొని ర్యాలీ నిర్వహించింది. దెబ్బకు ప్రభుత్వమే దిగొచ్చింది. ఆ దుకాణాన్ని ఊరి బయటకు మార్చింది. ఈ చైతన్యం ఆ ఊరికే పరిమితం కాలేదు. పక్క ఊరైన ఒండికుప్పంకీ పాకింది. ఆ ఊరి నడిబొడ్డున ఉన్న ప్రైవేట్ లిక్కర్ షాప్ స్వచ్ఛందంగానే షట్టర్లు మూసేసుకొని ఊరి బయట కొత్త పాక వేసుకుంది. కమ్యునిటీ టాయ్లెట్లు కొన్నాళ్ల కిందటి వరకు అరణ్వయళ్లోని కమ్యూనిటీ టాయ్లెట్లు అపరిశుభ్రంగా.. శిథిలావస్థలో ఉండేవి. ఇది అక్కడి మహిళలు, పిల్లలకు సమస్యగా పరణమించింది. అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్‌కి అప్పటి ప్రధాని అయిన శశికళ ఆ ఇక్కట్లను పంచాయతీ దృష్టికి తీసుకెళ్లింది. కమ్యూనిటీ టాయ్లెట్ల పునరుద్ధరణకు పెద్ద యుద్ధమే చేసింది. ఫలితంగా... వాటి పునర్నిర్మాణం జరిగింది. అంతేకాదు మెయింటెనెన్స్ కూడా మెరుగైంది. ‘ఈ పిల్లల పార్లమెంట్ పుణ్యమా అని ఇప్పుడా టాయ్లెట్లు అద్దంలా ఉంటున్నాయి. మా ఆడాళ్లు, పిల్లల కష్టాలూ తీరాయి’ అంటారు ఊళ్లోని స్త్రీలు. ఆ మాజీ ప్రధాని శశికళ ఇప్పుడు బీకాం ఫైనలియర్ చదువుతోంది. బాధ్యతల పరిధినీ పెంచుకుంటోంది. నీటి ప్రవాహం.. ప్రపంచ కిటికీ కొన్నేళ్ల కిందటి దాకా.. ఆ ఊళ్లో పబ్లిక్ వాటర్ ట్యాంక్ పాడైపోయి, నీళ్లున్నా గొంతు తడిసేది కాదు ఆ ఊరి జనాలకు. పెద్దవాళ్లు సమస్యను భరిస్తూ వచ్చారే కానీ బాధ్యతను గుర్తెరగలేదు. ఈ పిల్లలు ఊరుకోలేదు.. పార్లమెంట్లో చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. వారం రోజుల్లో వాటర్ ట్యాంక్ మరమ్మతు అయింది.. కొత్త కొళాయీ అమరింది. నీటి ప్రవాహం బిందెల్లో ఒదిగింది. దాహం తీరింది. అలాగే గ్రంథాలయం కూడా ఓ గొప్ప ప్రయత్నం తర్వాత మంచి పుస్తకాలతో కొలువుతీరింది. ఇప్పుడు ఆ ఊరి పిల్లలకు ప్రపంచాన్ని చూపిస్తున్న కిటికీ ఇదే! ఇవి మచ్చుకు మాత్రమే. ఆ ఊళ్లో ఏ సమస్య ఉన్నా స్పందించి పరిష్కారం కోసం పోరాడేది ఈ పిల్లల పార్లమెంటే. అదీ ఆ పిల్లల చిత్తశుద్ధి. బాధ్యతల పట్ల వాళ్లు పెంచుకున్న గౌరవం! ఇప్పటికే ఈ పార్లమెంట్ స్ఫూర్తి అరణ్‌వయళ్ చుట్టుపక్కల గ్రామాలకూ పాకి... అక్కడా పిల్లల పార్లమెంట్లు ఏర్పాటయ్యాయి. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి కోచ్.. మోటివేటర్.. మెంటర్.. ‘పార్లమెంట్’ కాన్సెప్ట్‌తో పిల్లల్లో సమస్యల పట్ల అవగాహనను కుదిర్చి సామాజిక బాధ్యత తెలుసుకునేలా చేసిన లోగమ్మాళ్ ఆర్ముగం పెద్దగా చదువుకున్నది కాదు. ఆమెది డబ్బున్న కుటుంబమూ కాదు. అరణ్‌వయళ్ ఊళ్లోనే ఆమె తండ్రి రోజు కూలీ. అతి కష్టమ్మీద కూతురిని టెన్త్ వరకు చదివించగలిగాడు. లోగమ్మాళ్కి ఉన్నత చదువులు చదువాలనే ఆశ. పేదరికం వల్ల ఆ ఆశ నెరవేరలేదు. దాంతో అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించే ఇంకామ్వెల్ అనే ఎన్జీవోలో వాలంటీర్‌గా చేరింది. ఆ తర్వాత ‘పసుమై ట్రస్ట్’ అనే ఎన్జీవోలో హెల్త్ వర్కర్‌గా చేరింది. ఇటుకల బట్టీల్లోని బాలకార్మికులకు చదువు చెప్పే సంస్థ అది. హెల్త్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తూనే పిల్లలకు పాఠాలూ చెప్పేది. తానూ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అందులో ఒకటే పిల్లల పార్లమెంట్. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న ఆమె దాన్ని తన ఊళ్లోనే ఎందుకు మొదలు పెట్టకూడదనుకుంది. వెంటనే అరణ్వయళ్లో మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లల పార్లమెంట్ గురించి వివరించింది. సహజంగానే పెద్దల కన్నా పిల్లల్లోనే ఉత్సాహం కనిపించింది. అలా 2006లో ‘అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్’ ప్రారంభమైంది. 2010లో తాను పనిచేస్తున్న ఎన్జీవో నుంచి బయటకు వచ్చేసిన లోగమ్మాళ్, పూర్తిగా దీనికే అకింతమైపోయింది. అయితే, అందులో చేసిన పనులను మాత్రం వదిలిపెట్టలేదు. అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్ ద్వారా వాటినీ చేస్తోంది. ఇటుకల బట్టీలు ఎక్కడుంటే అక్కడికి ఈ పిల్లలు వెళ్లి తోటి పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. ఇదంతా చేయిస్తూనే పెద్ద చదువులు చదవాలన్న తన కలనూ నెరవేర్చుకుంటోంది లోగమ్మాళ్. కరెస్పాండెన్స్ ద్వారా బీఏ చదువుకుంది. తనకు ఇష్టమైన సోషల్‌వర్క్‌లో ఏడాది డిప్లొమా కోర్సునూ పూర్తి చేసింది. ‘సమాజ సంక్షేమం పట్ల పిల్లల్లో అవగాహన పెంపొందించడం, భవిష్యత్తులో వాళ్లు సమస్యల పరిష్కర్తలుగా నిలవడమే ఈ అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్ లక్ష్యం’ అంటుంది లోగమ్మాళ్ ఆర్ముగం.