breaking news
anantha udaya bhaskar
-
ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య వెనుక మహిళా ప్రజాప్రతినిధి: పీతల సుజాత
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనక ఉన్న అదృశ్య శక్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నారని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పీతల సుజాత ఆరోపించారు. ఆమె ఎవరో, ఆమెకు అనంతబాబుకి ఉన్న సంబంధమేమిటో, ఎందుకు హత్య జరిగిందనే వివరాలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు, అతన్ని కాపాడటానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
గిరిజనులకు అండగా ఉండండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఏజెన్సీలో గిరిజనులు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిరని, వారికి ఏ కష్టమొచ్చినా నాయకులు ముందుండి పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్టు పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ తెలిపారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో మంగళవారం అధినేతను కలిసిన ఆయన రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. ఈ వివరాలను ఆయన ‘సాక్షి’కి తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అన్యాయంగా పెడుతున్న కేసుల వివరాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లామన్నారు. పలు మండలాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్న పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు రెండు మూడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పామన్నారు. దీనిపై స్పందించిన జగన్మోహన్రెడ్డి.. ఈ విషయమై త్వరలో రంపచోడవరంలో జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, అక్కడి నేతలకు మనోధైర్యం కల్పించాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఏజెన్సీలోని ఏడు మండలాలతోపాటు నాలుగు విలీన మండలాల్లోని నేతలను కూడా సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టపరచాలని తనకు సూచించారన్నారు. అక్కడి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి, నెలకు కనీసం రెండుసార్లయినా స్థానిక నేతలతో సమావేశం కావాల్సిందిగా చెప్పారని వివరించారు. జిల్లాలో యువతను పార్టీలోకి ఆహ్వానించి, వారు క్రియాశీలకంగా వ్యవహరించేలా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాల్సిందిగా జగన్మోహన్రెడ్డి ఆదేశించారని ఉదయ భాస్కర్ తెలిపారు. అధినేతను కలిసినవారిలో పార్టీ అడ్డతీగల మండల కన్వీనర్ కిశోర్ కూడా ఉన్నారు.