breaking news
all set
-
ముగిసిన రెండో దశ ప్రచారం.. 13న ఎన్నిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగియగా ఇప్పుడు రెండో దశ ఎన్నికలకు వేళయింది. రెండో దశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈనెల 13వ తేదీన మొత్తం 2,786 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిసి చర్చించారు. ఈ మలి దశ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. రెండో విడతలో 13 జిల్లాలలోని 18 రెవెన్యూ డివిజన్లలోని మొత్తం 3,328 పంచాయతీలలో 33,570 వార్డుల ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది. వీటిలో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగనుండగా మొత్తం 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డులు 12,605 ఏకగ్రీవమవడంతో మిగిలిన 20,796 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులకు 44,879 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదృష్టం పరీక్షించుకోనున్న అభ్యర్థులు 13 జిల్లాల్లో ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండో విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఏజెన్సీలోని పంచాయతీలో ఎన్నికలు మధ్యాహ్నం 1.30 గంటల వరకే ఉంటాయి. ఇక్కడ పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక కూడా అదే రోజు కొనసాగుతుంది. రెండో విడతలో 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లోని 167 మండలాల్లో శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు తొలి విడతలో కౌంటింగ్ నిలిచిపోయిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో కలెక్టర్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా: టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలోని 10 మండలాలు విజయనగరం జిల్లా: పార్వతీపురం డివిజన్లో 15 మండలాలు విశాఖపట్నం జిల్లా: నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలు తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలోని 14 మండలాలు పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు డివిజన్లోని 13 మండలాలు కృష్ణా జిల్లా: గుడివాడ డివిజన్లోని 9 మండలాలు గుంటూరు జిల్లా: నరసరావుపేట డివిజన్ 11 మండలాలు ప్రకాశం జిల్లా: ఒంగోలు, కందుకూరు డివిజన్లలోని 14 మండలాలు నెల్లూరు జిల్లా: ఆత్మకూరు డివిజన్లోని 10 మండలాలు కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 13 మండలాలు అనంతపురం జిల్లా: ధర్మవరం, కల్యాణదుర్గం డివిజన్లోని 19 మండలాలు వైఎస్సార్ కడప జిల్లా: కడప రెవెన్యూ డివిజన్ 12 మండలాలు చిత్తూరు జిల్లా: మదనపల్లి రెవెన్యూ డివిజన్ 17 మండలాలు ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం? -
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
-
ఎంసెట్ సహ అన్ని సెట్లూ అన్లైన్లోనే
-
బైక్ టాక్సీలకు గ్రీన్ సిగ్నల్
ట్రాఫిక్ రద్దీతో... సమయం చూసి అధిక రేట్లతో బాది పారేస్తున్న క్యాబ్ సర్వీసులతో విసిగిపోయిన మెట్రోనగర వాసులకు ఇక ఊరట లభించనుంది. దేశంలో మోటార్ బైక్ సర్వీసులకు కేంద్రం ఒకే చెప్పనున్నట్టు తెలుస్తోంది. టూ వీలర్ టాక్సీ సర్వీసులకు చట్టబద్థత తీసుకొచ్చే దిశగా కేంద్రం అడుగులు వేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కేంద్ర మోటార్ వెహికల్ చట్టాన్ని సవరణ తీసుకొచ్చే యోచనలో ఉంది. వీటిని చట్టబద్ధం చేయడంతోపాటు..త్వరలోనే సమగ్రమైన మార్గనిర్దేశకాలను రూపొందించనుంది. కేంద్ర రవాణా శాఖ అధికారులు అన్ని రాష్ట్రాలకు ఉమ్మడి సమగ్ర విధానంకోసం చర్చిస్తున్నారని రవాణా అధికారి తెలిపారు. రాష్ట్ర రవాణామంత్రులతో కూడిన నిపుణుల బృందం దీనిపై చర్చించి విధివిధానాలు రూపొందించనున్నారు. ఈ విధానం ద్వారా ఉపాధి సృష్టించడంతో పాటు ప్రజా రవాణా విస్తరించే అవకాశమున్నందున భారత ప్రభుత్వం మోటర్ బైక్ టాక్సీ వ్యవస్థపై ఆశాజనకంగా ఉందన్నారు. అయితే కేవలం కమర్షియల్ గా నమోదు చేసుకున్న ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే కమర్షియల్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు మాత్రమే అవకాశమన్నారు. రిఫ్లెక్టర్ జాకెట్ తో పాటు హెల్మెట్ విధిగా ధరించాలనే నిబంధనను కూడా పొందుపర్చనున్నారు. ఇప్పటికి చాలా టాక్సీ ఎగ్రిగేటర్స్ ప్రయివేటు వాహనాలను టూ వీలర్ టాక్సీలుగా వాడుకుంటున్నట్టుగా తమ దృష్టికివచ్చిందని..దీన్ని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ లైసెన్సింగ్ విధానం దేశవ్యాప్తంగా ఒకే లా ఉండాలని ఎం టాక్సీ వ్యవస్థాపకుడు అర్నబ్ మాధుర్ పేర్కొన్నారు.తాము కూడా కేంద్ర రవాణా శాఖకు ఒక వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు. ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయన్నారు. -
’సామాన్యులకే అధిక ప్రాధాన్యం ’
-
వైకుంఠ ఏకాదశికి సిద్ధమైన తిరుమల
-
వైష్ణవ ఆలయాల్లో ఉత్సవంలా వైకుంఠ ఏకాదశి
-
ఉత్తర ద్వార దర్శనం చేస్తే..వైకుంఠ ప్రాప్తి..!
-
వరంగల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం