breaking news
all india brahmin federation
-
ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్
-
ఆగని గరికపాటి వ్యాఖ్యల దుమారం..‘ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా... ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించారు. నాగబాబు ట్వీట్‌పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆధ్యాత్మిక వేత్తను.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’ అని ఘాటుగా స్పందించారు. చదవండి: 'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు' ఆగని ట్రోల్స్ మరోవైపు చిరంజీవి అభిమానులు, నటులు గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గరికపాటికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. చిరంజీవి గురించి అలా అనాల్సింది కాదంటూ గరికపాటిపై సినీనటుడు ఉత్తేజ్ మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపరం కొనసాగింది. చివరకు నాగబాబు మళ్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘గరికపాటి వారు ఏదో మూడ్‌లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయ నని అర్థం చేసుకోవాలే గానీ, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్’అని పేర్కొన్నారు. -
ఐవైఆర్ తొలగింపు దారుణం
బ్రాహ్మణ కార్పొరేషన్ టీడీపీ అనుబంధ సంస్థకాదు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ధ్వజం సింహాచలం (పెందుర్తి): బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఐవైఆర్ కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం నీచాతినీచమైన చర్య అని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.ఎల్.ఎన్. శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో మంగళవారం సాయంత్రం ఆయన పలువురు బ్రాహ్మణ ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కృష్ణారావు నిష్పక్షపాతంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, అవినీతికి, సిఫార్సులకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తులు పెట్టి ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని కుంటిసాకులు చెప్పి తొలగించడం బాధాకరమన్నారు. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు చాలా దారుణమన్నారు. ఫేస్బుక్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షేర్ చేశారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారని, విశాఖలో జరిగిన మహానాడుకు ఆయన రాలేదని, కోన రఘుపతి ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజరయ్యారని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు యావత్ బ్రాహ్మణ సమాజానికి బాధ కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ఐవీఆర్ సేవలను గుర్తించి ఆయనను చైర్మన్‌గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకమై తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో విశాఖ జిల్లా బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు చరణ్ తదితరులు పాల్గొన్నారు.