breaking news
adwaith
-
ఎంతవారలైనా శిక్షార్హులే
అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎంతవారలైనా’. గురు చిందేపల్లి దర్శకత్వంలో రామదూత ఆర్ట్స్ పతాకంపై జి.సీతారెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘మీరు చచ్చే వరకూ ఇలా భయపెట్టి చంపుతూనే ఉంటాను...’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులతో టీజర్ సాగుతుంది. జి. సీతారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సృష్టిలో మంచి, చెడు అనే రెండు మార్గాలుంటాయి. చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో ఈ సినిమాలో చూపించాం. ఇది న్యూ జనరేషన్ హారర్ మూవీ. చివరి 20 నిమిషాల సన్నివేశాలు సినిమాకే హైలెట్. నాకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో నాతో ఎస్పీ పాత్ర చేయించాడు దర్శకుడు. నిర్మాతగా రామానాయుడుగారు, నటుడిగా ఎస్.వి. రంగారావుగారు నాకు స్ఫూర్తి. ఏప్రిల్‌లో కన్నడ, తెలుగు భాషల్లో మా సినిమా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కచ్చితంగా శిక్షార్హులే.. అనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ సీతారెడ్డిగారే కారణం. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశారు’’ అన్నారు గురు చిందేపల్లి. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి. -
అద్వైత్కు టైటిల్
► స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ హైదరాబాద్: సెయింట్ పాల్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సబ్ జూనియర్ బాలుర విభాగంలో అద్వైత్ చాంపియన్‌గా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్వైత్ 4-1తో వరుణ్ శంకర్‌పై గెలుపొందాడు. యూత్ బాలుర విభాగంలో స్నేహిత్ 4-1తో సరోజ్ సిరిల్‌పై, బాలికల విభాగంలో వరుణి జైశ్వాల్ 4-3తో సస్యపై, జూనియర్ బాలుర విభాగంలో స్నేహిత్ 4-0తో అరవింద్‌పై, బాలికల విభాగంలో నైనా 4-3తో వరుణిపై, సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఆయుషి 4-1తో భవితపై, క్యాడెట్ బాలుర విభాగంలో జషన్ సాయి 3-1తో రిత్విక్‌పై, బాలికల విభాగంలో పలక్ 3-1తో ప్రీతిపై నెగ్గారు. ఇంటర్ స్కూల్ బాలుర విభాగంలో బీవీబీ 3-0తో సెయింట్ పాల్ స్కూల్‌పై, బాలికల విభాగంలో గీతాంజలి స్కూల్ 3-0తో గీతాంజలి దేవేశ్రయ్పై గెలుపొందాయి.