breaking news
Aditya Constructions
-
గృహ ప్రవేశానికి 1,760 ఫ్లాట్లు రెడీ!
ఈ నెలాఖరులో 400.. సెప్టెంబర్‌లో 450 ఫ్లాట్ల అప్పగింత ♦ ఎంప్రస్, ఇంపీరియల్‌లోని మిగిలిన ఫ్లాట్లు ఈ ఏడాది ముగింపు నాటికి.. ♦ సెప్టెంబర్‌లో వైజాగ్, గుంటూరు, కాకినాడల్లో ప్రాజెక్ట్‌ల ప్రారంభం ♦ ‘సాక్షి రియల్టీ’తో ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ ఈడీ సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్ : గత పదేళ్లుగా 60.5 లక్షల చ.అ.ల్లో 27 ప్రాజెక్ట్‌లు దిగ్విజయంగా పూర్తి చేసి.. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు జరిపి.. కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించిన ఆదిత్యా కన్స్ట్రక్షన్స్.. ఈ ఏడాది ముగింపులోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్లా భారీ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెలాఖరున షేక్‌పేటలోని ఎంప్రస్ టవర్స్‌లో 400 ఫ్లాట్లు, సెప్టెంబర్‌లో హఫీజ్‌పేట్‌లోని ఇంపీరియల్ హైట్స్ లో 450 ఫ్లాట్లు కస్టమర్లకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ♦ షేక్‌పేట్‌లో ఎంప్రస్ టవర్స్‌లో 5 టవర్‌లో మొత్తం 780 ఫ్లాట్లు. ఇందులో మూడు బ్లాకుల్లోని 400 ఫ్లాట్లు ఈ నెలాఖరున అందించనున్నాం. మిగిలిన రెండు బ్లాకులను అక్టోబర్‌లో అందిస్తాం. అలాగే హఫీజ్‌పేట్‌లో ఇంపీరియల్ హైట్స్‌లో మొత్తం 980 ఫ్లాట్లు. ఇందులో ఆగస్టు 21 నుంచి రిజిస్ట్రేషన్లు, సెప్టెంబర్ 1 నుంచి 4 బ్లాకుల్లో కలిపి మొత్తం 450 ఫ్లాట్లు అందిస్తాం. మిగిలినవి నవంబర్‌లో అందిస్తాం. మొత్తం మీద ఈ ఏడాది ముగింపు నాటికి 40.5 లక్షల చ.అ.ల్లో సుమారు 1,760 ఫ్లాట్లు అందించాలనేది లక్ష్యం. ♦ ఆగస్టు ప్రారంభంలో షేక్పేట్లోనే బ్యూ మౌంట్‌ను ప్రారంభించాం. 25 అంతస్తుల టవర్లోమొత్తం 176 ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.6 వేలు. 1,700 నుంచి 2,100 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ♦ ఇటీవలే హైటెక్‌సిటీలో క్యాపిటల్ హైట్స్నూ ప్రారంభించాం. 19 అంతస్తుల్లో మొత్తం 192 ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.4,500గా నిర్ణయించాం. 1,650-2,100 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. మూడంతస్తుల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, ప్లే ఏరియా వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. బ్యూమౌంట్, క్యాపిటల్ హైట్స్ రెండింటినీ నాలుగేళ్లలో పూర్తి చేస్తాం. ♦ సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మూడు లగ్జరీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నాం. విశాఖపట్నంలోని మధురవాడలో 8 ఎకరాల్లో ఐకానికా టవర్స్ రానుంది. ఇందులో 10 అంతస్తుల్లో 9 టవర్లుంటాయి. మొత్తం 700 ఫ్లాట్లు. 1,500-2,000 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.3,400. ♦ గుంటూరు కలెక్టర్ ఆఫీసు పక్కనే 7 ఎకరాల్లో క్యాపిటల్ టవర్స్‌ను ప్రారంభించనున్నాం. 16 అంతస్తుల్లో 5 టవర్లుంటాయి. మొత్తం 600 ఫ్లాట్లు.. ప్రీలాంచింగ్ ఆఫర్ ధర చ.అ.కు రూ.4,500. కాకినాడలో 6 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో 5 అంతస్తుల్లో మొత్తం 261 ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.3,500. ♦ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో గత ఐదేళ్లుగా కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిలిపివేశాం. ఈ ఏడాది ముగింపు నాటికి గుంటూరు, హైటెక్‌సిటీలో రెండు కమర్షియల్ ప్రాజెక్ట్‌లను చేయాలని నిర్ణయించాం. గుంటూరులోని సంస్థకున్న 10 ఎకరాల స్థలంలో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. ఆ తర్వాత హైటెక్‌సిటీలోనూ నిర్మిస్తాం. ♦ నిర్మాణంలో నాణ్యత, మెరుగైన నిర్వహణకు ఆదిత్యా ప్రాజెక్ట్‌లు పెట్టింది పేరు. అందుకే ప్రతి ఏటా ఎకనామిక్ టైమ్స్ అందించే ‘బెస్ట్ రియాలిటీ బ్రాండ్’ అవార్డు ఈ ఏడాది మాకు దక్కింది. నేటికీ మా ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో రెడ్బ్రిక్స్నే వినియోగిస్తున్నాం. దీంతో నిర్మాణం ఎక్కువ కాలం పటిష్టంగా ఉండటంతో పాటూ ఇంట్లోకి వేడి రాదు. ప్రత్యేకించి ఎలివేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ను అందం, ఆకర్షణ తెచ్చేదే ఎలివేషన్. అందుకే ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైనా కస్టమర్లకు జీవితకాలం గుర్తుండిపోయే గృహాలను అందిస్తాం. ♦ అందుకే కస్టమర్లు పెట్టిన పెట్టుబడికి వంద శాతం లాభం పొందుతారు. ఎంప్రస్ టవర్స్ ప్రారంభంలో చ.అ.కు రూ.3,600కు విక్రయించాం. ఇప్పుడక్కడ ధర రూ.6,600ల వరకుంది. అలాగే ఇంపీరియల్ హైట్స్‌లో చ.అ.కు రూ.2,600లకు విక్రయిస్తే.. ఇప్పుడక్కడ రూ.4,500లకు పైగానే ఉంది. రుణం మీది.. వడ్డీ మాది! కొత్త నిర్మాణాల్లో ఫ్లాట్ తీసుకుంటే గృహప్రవేశానికి కనీసం నాలుగేళ్లయినా వేచి చూడాలి. మరి అప్పటి వరకు అటు బ్యాంకు వాయిదా.. ఇటు నెలసరి అద్దె రెండూ కట్టాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందులు ఆదిత్యా కస్టమర్లకు కలిగించొద్దనే ఉద్దేశంతో ప్రీ ఈఎంఐ ఆఫర్‌ను తీసుకొచ్చాం. షేక్‌పేట్‌లోని బ్యూమౌంట్ ప్రాజెక్ట్‌కు ప్రీ ఈఎంఐ ఆఫర్‌ను ప్రకటించాం. ఇదేంటంటే.. 10 శాతం సొమ్ము చాలు.. ఫ్లాట్ బుకింగ్ రోజున మార్జిన్ మనీగా 10 శాతం సొమ్మును, గృహ ప్రవేశం రోజు మరో 10 శాతం సొమ్మును చెల్లిస్తే చాలు. మిగిలిన 80 శాతాన్ని బ్యాంకు రుణం ద్వారా నిర్మాణ దశను బట్టి బ్యాంకు విడుదల చేస్తుంటుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యే నాలుగేళ్ల వరకూ ఈ బ్యాంకు వడ్డీ సంస్థే కడుతుంది. ఈ స్కీంతో నిర్మాణం ఆలస్యమయ్యే చాన్సే ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆలస్యమైతే ప్రీ ఈఎంఐ భారం పడేది బిల్డర్ మీదే కదా. నెలసరి వడ్డీ చెల్లించేది అతనే కాబట్టి, ఈ భారాన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి నిర్ణీత గడువులోపే నిర్మాణాలు పూర్తి చేసే అవకాశమూ ఉంటుంది. -
ఆదిత్య కన్స్ట్రక్షన్స్కు ఈటీ అవార్డ్
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్కు ఎకనామిక్ టైమ్స్ అవార్డ్ వరించింది.హైదరాబాద్, విశాఖపట్నంలో నాణ్యమైన, విలాసవంతమైన నివాస సముదాయాలను నిర్మించినందుకుగాను బెస్ట్ రియల్టీ బ్రాండ్-2015 కేటగిరీ కింద ‘సింబల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ రియాల్టీ’ అవార్డును దక్కించుకుంది. ఎకనామిక్ టైమ్స్ (ఈటీ) ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ చేతులమీదుగా ఈ అవార్డును సంస్థ జీఎం సీ సాయికుమార్ నాయుడు అందుకున్నారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.