breaking news
Aditi Sharma
-
గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు
హిందీ సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నటి అదితి శర్మ.. భర్త అభినీత్ కౌశిక్, అత్తింటి వారిపై గృహహింస కేసు పెట్టింది. ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. భర్త తనని శారీరకంగా మానసికంగా వేధించాడని, వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసేవాడని, తన నగలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)అదితి శర్మ చెప్పినదాని ప్రకారం.. 2021 జూన్‌లో ఆన్లైన్ యాక్టింగ్ క్లాసుల ద్వారా అభినీత్ కౌశిక్‌తో పరిచయం ఏర్పడింది. 2024 సెప్టెంబర్ నుంచి ఇద్దరూ కలిసి బతకడం మొదలుపెట్టారు. అదే ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని చిన్న చిన్న విషయాలకే తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని, నా డ్రస్సింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసేవాడని, తన దగ్గర నుంచే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించింది.2025 జనవరిలో కాఫీ విషయంలో జరిగిన ఓ గొడవ పెద్దది కావడంతో తనను దారుణంగా తిట్టారని, వివాహేతర సంబంధం కూడా అంటగట్టారని అదితీ తన ఫిర్యాదులో రాసుకొచ్చింది. తన మొబైల్ తరచూ చెక్ చేయడం, తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకోవడం లాంటివి కూడా అత్తింటివాళ్లు చేశారని తెలిపింది. తన మంగళసూత్రం, బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, గాజులు తదితర వివాహ ఆభరణాలని అడిగినా తనకు ఇవ్వట్లేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భార్యతో విడాకులు.. తల్లితండ్రులని కలిసిన హీరో)ఈ ఏడాది మార్చిలో అదితీ భర్త అభినీత్, అతడి తరఫు న్యాయవాది ఈమెపై పలు ఆరోపణలు చేశారు.'అపోల్లెనా' సీరియల్ సహనటుడు సమర్థ్య గుప్తాతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గుర్తించడంతోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పాడు. అదితి తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, ఇండస్ట్రీలో ఇది బయటపడకూడదనే ఉద్దేశంతో తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలని కోరిందని అభినీత్ పేర్కొన్నాడు. కుటుంబాల మధ్య రాజీ చర్చల సందర్భంగా రూ.25 లక్షలు, విడాకులు కోరినట్లు కూడా ఆయన ఆరోపించాడు.భర్త ఆరోపణలపై స్పందించిన అదితి.. పెళ్లైన నెల రోజుల నుంచే తనని చాలా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయాలు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున పూర్తి వివరాలు మాట్లాడలేనని చెప్పింది. గృహహింస తన వైపు నుంచి జరగలేదని స్పష్టం చేసిన ఈమె.. తన భర్త తనని, తన కుటుంబాన్ని పలుమార్లు అవమానించారని, అందుకే విడాకులు కోరినట్లు పేర్కొంది. తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలనే నిర్ణయం ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
సీక్రెట్ పెళ్లి.. నాలుగు నెలలకే విడాకులు.. స్పందించిన బుల్లితెర నటి
ఇటు ప్రేమ కావాలి, అటు కెరీర్ కావాలి అనుకుంది హిందీ బుల్లితెర నటి అదితి శర్మ (Aditi Sharma). అందుకే నాలుగేళ్లుగా డేటింగ్లో ఉన్న ప్రియుడు అభిజిత్ కౌశిక్(Abhineet Kaushik)ను సీక్రెట్‌గా పెళ్లాడింది. దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించి నాలుగు నెలలైందో లేదో అప్పుడే విడాకులు కావాలన్నాడు అభిజిత్. అదితి.. నటుడు సమర్థ్య గుప్తా అత్యంత సన్నిహితంగా ఉండటం చూశానని, తనతో ఉండలేనని మీడియా ముందు వాపోయాడు.సీక్రెట్ పెళ్లి- విడాకులు.. స్పందించిన నటితాజాగా ఈ విడాకుల వ్యవహారంపై అదితి తొలిసారిగా స్పందించింది. పెళ్లయిన నెలకే గొడవలు మొదలయ్యాయి. నాతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇంకా చాలా జరిగాయి. కానీ విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నందున ఇప్పుడవేవీ చెప్పలేను. అతడితో ఉండలేనని అర్థమైంది. అందుకే శాంతియుతంగా విడిపోవాలనుకున్నాం. ఇరు కుటుంబాలు అందుకు ఒప్పుకున్నాయి. అతడు చాలాసార్లు నా ఫ్రెండ్స్ ముందు.. నన్ను, నా కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడాడు. కానీ నేను ఎన్నడూ అతడి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. తనలా నేను హింసించలేదు. మనస్ఫూర్తిగా ప్రేమించాను.అందుకే చెప్పలేదుమరో విషయం.. మేము రహస్యంగా పెళ్లి చేసుకోలేదు. మా కుటుంబాలు, క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులందరికీ మా వివాహం గురించి తెలుసు. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. నా కెరీర్ గ్రాఫ్ బాగుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకున్నానని తెలిస్తే బాగోదనిపించింది. ఎందుకంటే అపోలెనా సీరియల్లో నేను 18 ఏళ్ల అమ్మాయి పాత్ర పోషిస్తున్నాను. అందుకే పబ్లిక్కు ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పకూడదనుకున్నాను అని అదితి శర్మ చెప్పుకొచ్చింది. అపోలెనా సీరియల్ నటుడు సమర్థ్య గుప్తాతో అదితిఆన్స్క్రీన్ కపుల్ మాత్రమే..ఇకపోతే అపోలెనా సీరియల్లో సమర్థ్య గుప్తా- అదితి జంటగా నటిస్తున్నారు. వీరు సన్నిహితంగా ఉంటూ దొరికిపోయారన్న అభిజిత్ మాటలపై సమర్థ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము ఆన్‌స్క్రీన్‌పై మాత్రమే జంటగా కనిపిస్తామన్నాడు. అభిజిత్ చెప్పినట్లుగా తాము అడ్డంగా దొరికిపోయామన్నదాంట్లో ఎటువంటి నిజం లేదని వెల్లడించాడు. ఇలాంటి పిచ్చికామెంట్ల వల్ల తన పేరెంట్స్ ఇబ్బందిపడుతున్నారన్నాడు.చదవండి: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ -
సీక్రెట్‌గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!
బాలీవుడ్లో నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత సహజమో..విడిపోవడం అంతే సహజం. ఇలా పెళ్లి చేసుకోని అలా విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో జంట విడిపోయింది. బాలీవుడ్ బుల్లితెర నటి,అపోలీనా(ఫేమస్ సైన్స్ డ్రామా సిరిస్) ఫేం అదితి శర్మ తన భర్త అభిజిత్ కౌశిక్‌తో విడిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగు నెలల కూడా కలిసి కాపురం చేయలేకపోయింది.నాలుగేళ్లుగా సహజీవనం.. సీక్రెట్‌గా పెళ్లిబాలీవుడ్ బుల్లితెరపై అదితి శర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియళ్లతో పాటు పలు షోలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె అభిజిత్ కౌశిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ విషయం బాలీవుడ్ మొత్తానికి తెలుసు. సోషల్ మీడియాలోనూ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసేవారు. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత గతేడాది నవంబర్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. తన కెరీర్‌కి ఇబ్బంది కలుగొద్దని ఇలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆమె ప్రవర్తన నచ్చక విడిపోయామని ఆమె భర్త అభిజిత్ కౌశిక్ చెప్పారు. అదితి ఒత్తిడితోనే పెళ్లి!తాజాగా ఆయన తన న్యాయ సలహాదారు రాకెశ్ శెట్టితో కలిసి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘అదితి నేను నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాం. గతేడాది నవంబర్ 12న మేం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాం. ఏడాదిన్నరగా అదితి నాపై ఒత్తిడి తెవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఓకే చెప్పాను. పెళ్లి విషయం బయటకు తెలిస్తే తన కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని అదితి చెప్పడంతో మా ఇద్దరి ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకున్నాం. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి’ అని అభిషేక్ చెప్పారురూ.25లక్షలు డిమాండ్అదితి శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభిషేకే ఇప్పుడు విడాకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అపోలీనా కో స్టార్ సమర్థ గుప్తాతో సన్నిహితంగా ఉంటుందని, వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చూశానని ఆరోపించాడు. ఈ కారణంగానే తాను విడాకులు కోరానని అభిషేక్ చెప్పారు. అయితే విడిపోవడానికి అదితి శర్మ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తూనే రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని అభిషేక్ న్యాయ సలహాదారు రాకేశ్ తెలిపారు.


