Aashiqui 3
-
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్‌లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్‌లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు. -
హిట్ సినిమా సీక్వెల్లో మాజీ సీఎం మనవరాలికి ఛాన్స్
బాలీవుడ్లో ‘ఆషికీ’ మూవీ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘ఆషికీ, ఆషికీ 2’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలను టీ సిరీస్, వినేష్ ఫిల్మ్స్ నిర్మించాయి. హిట్ ఫ్రాంచైజీ కావడంతో ‘ఆషికీ 3’ని కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘ఆషికీ 3’ని 2022లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడిగా అనురాగ్ బసును అనుకుంటున్నారట మేకర్స్.తృప్తి డిమ్రికి చెక్కానీ ఇప్పుడు టీ సిరీస్–వినేష్ ఫిల్మ్స్ ప్రతినిధుల మధ్యలో ‘ఆషికీ 3’ గురించి విభేదాలు తలెత్తాయని టాక్. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందని బాలీవుడ్లో ప్రచారమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్గా త్రిప్తీ దిమ్రీ (Tripti Dimri)ని కూడా తప్పించారని సమాచారం. ఈ ప్లేస్‌ను బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ (Sharvari) భర్తీ చేశారని భోగట్టా. తృప్తి డిమ్రిని తప్పించడానికి ప్రధాన కారణం తను యానిమల్ సినిమాలో బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో నటించిడమేనని తెలుస్తోంది. దీంతో ఆషికి-3లో హీరోయిన్ పాత్రకు ఆమె సెట్ కాదని మేకర్స్ అభిప్రాయపడ్డారట. ఆ ఛాన్స్ ఇప్పుడు యంగ్ బ్యూటీ శార్వరీకి దక్కింది. ఆమె ఇప్పటి వరకు బాజీరావ్ మస్తానీ,ముంజ్యా,మహారాజ్,వేద వంటి మరో రెండు సినిమాలు మాత్రమే చేసింది. మాజీ ముఖ్యమంత్రి మనవరాలికి ఛాన్స్పదేళ్లుగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా మెప్పించింది లేదు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా మూడు సినిమాలకు పనిచేశారు. ఇంతకీ శార్వరీ ఎవరో తెలుస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోకసభ స్పీకర్ మనోహర్ జోషి సొంత మనవరాలు. నేటి రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి హీరోయిన్లుగా నటించేందుకు పెద్దగా ఎవరూ రారు. కానీ, శార్వరీ మాత్రం గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలోనే కొనసాగడం విశేషం. ‘ఆషికీ 3’లో శార్వరీ భాగం అయ్యారా? ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్‌కు వెళ్తుందా? అనే విష యాలపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి ఉండాల్సిందే. ఈ ప్రాజెక్టు కోసం కార్తిక్ ఆర్యన్ సరసన నటించడానికి కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, రష్మిక మందన్న, ఆకాంక్ష శర్మ లాంటి హీరోయిన్ల పేర్లను మేకర్స్ పరిశీలించారు. కానీ ఆయనతో ఇంతకు ముందు కలిసి పనిచేయని సరికొత్త నటి కోసం వెతుకున్న సమయంలో శార్వరీ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే, చివర వరకు రేసులో ఆకాంక్ష పేరు కూడు ఉందని తెలుస్తోంది.12వ ముఖ్యమంత్రిగా మనోహర్ జోషిమహారాష్ట్రకు 12వ ముఖ్యమంత్రిగా మనోహర్ జోషి పనిచేశారు. గతేడాదిలో ఆయన మరణించారు. శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో నమ్రత కుమార్తెనే ఈ శార్వరీ. View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) -
బాలీవుడ్లో కిక్ ఇస్తున్న ఫ్రాంచైజీ మూవీస్
బాలీవుడ్లో కొన్ని ఫ్రాంచైజీ మూవీస్ ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిలో కొన్ని సెట్స్‌పైకి వెళితే.. మరికొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది విశేషం ఏంటంటే... వివిధ ఫ్రాంచైజీస్లోని మూడో భాగాలు కొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరికొన్ని సెట్స్‌పైకి వెళ్తున్నాయి. ఇలా ‘ఏక్ దో తీన్..’ అంటూ థర్డ్ పార్డ్తో బిజీగా ఉన్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ టైగర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో పదేళ్ల క్రితం విడుదలైన ‘ఏక్తా టైగర్’ ఒకటి. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ జిందా హై’ (2017)లోనూ సల్మాన్, కత్రినా జంటగా నటించారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్. ఇక సల్మాన్, కత్రినా ‘టైగర్ 3’కి కూడా జోడీ కట్టారు. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల మాదిరి ‘టైగర్ 3’ కూడా స్పై ఫిల్మే. ‘ఏక్తా టైగర్’కు కబీర్ ఖాన్, ‘టైగర్ జిందా హై’ను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించగా, ‘టైగర్ 3’కు మనీష్ శర్మ దర్శకుడు. ‘టైగర్’ ఫ్రాంచైజీలోని మూడు సినిమాలకు ముగ్గురు దర్శకులు దర్శకత్వం వహించగా, హీరో హీరోయిన్లు మాత్రం సల్మాన్, కత్రినాలే కావడం ఓ విశేషం. ఓ వైపు దశ్యం.. మరోవైపు సింగమ్ హిందీ తెరపై ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్. హిందీ ‘దృశ్యం’ (2015), ‘దృశ్యం 2’ (2022) చిత్రాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. మలయాళంలో హీరో మోహన్‌లాల్– దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు హిందీ రెండు భాగాల ‘దృశ్యం’ రీమేక్. అయితే ఈసారి మలయాళంలో మోహన్‌లాల్‌తో, హిందీలో అజయ్ దేవగన్‌తో ఒకేసారి ‘దృశ్యం 3’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట జీతూ జోసెఫ్. ఇక హిందీ ‘దృశ్యం’కు నిషికాంత్ కామత్, ‘దృశ్యం 2’కి అభిషేక్ పాతక్ దర్శకత్వం వహించారు. ఇక దర్శకుడు రోహిత్ శెట్టి–హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్లో ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ల తర్వాత ‘సింగమ్ వన్స్ ఎగైన్’ చిత్రం తెరకెక్కనుంది. ఇలా డైరీలో రెండు థర్డ్ పార్ట్ చిత్రాలకు డేట్స్ కేటాయించారు అజయ్ దేవగన్. బిజీ కిలాడి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఈ బిజీ హీరో మూడు ఫ్రాంచైజీస్లోని మూడు థర్డ్ పార్ట్ సినిమాలకు అసోసియేట్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ హిట్ కామెడీ ఫ్రాంచైజీలో ‘వెల్కమ్’ తప్పక ఉంటుంది. 2007లో వచ్చిన ‘వెల్కమ్’, 2015లో విడుదలైన ‘వెల్కమ్ బ్యాక్’ (వెల్కమ్ 2) చిత్రాల తర్వాత ‘వెల్కమ్ టు ది జంగిల్ (వెల్కమ్ 3)’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, పరేష్ రావల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘వెల్కమ్, ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రాలకు అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించగా, ‘వెల్కమ్ టు ది జంగిల్’ను దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘హేరా ఫేరీ’ (2000), ‘ఫిర్ హేరా ఫేరీ’ (2006) చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హేరా ఫేరీ’ థర్డ్ పార్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని.. ఈ మూడో భాగంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటించనున్నామని ఇటీవల సునీల్ శెట్టి పేర్కొన్నారు. మరోవైపు ‘జాలీ ఎల్ఎల్బీ 3’ ఉంటుందని, ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటిస్తామన్నట్లుగా అర్షద్ వార్సీ ఇటీవల పేర్కొన్నారు. 2013లో ‘జాలీ ఎల్ఎల్బీ’, 2017లో ‘జాలీఎల్ఎల్బీ 2’ చిత్రాలు వచ్చాయి. కొత్త డాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్లోకి కొత్త డాన్ వచ్చాడు. ఈ డాన్ పేరు రణ్వీర్ సింగ్. హిందీలో ‘డాన్’ అనగానే తొలుత అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత షారుక్ ఖాన్ గుర్తొస్తారు. రచయితలు సలీమ్–జావేద్‌లు సష్టించిన డాన్ క్యారెక్టర్‌తో అమితాబ్ బచ్చన్ టైటిల్ రోల్లో చంద్ర బరోత్ తెరకెక్కించిన ‘డాన్’ (1978) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ తొలి డాన్‌గా అమితాబ్‌ని నిలిపింది. ఇక దాదాపు మూడు దశాబ్దాలకు ‘డాన్’ సినిమా ఆధారంగానే ఫర్హాన్ అక్తర్ 2006లో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ తీశారు. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. షారుక్ కూడా బెస్ట్ డాన్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో హీరో షారుక్ ఖాన్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్లో ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ (2011) వచ్చి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే ‘డాన్ 3’ తెరకెక్కనుంది. అయితే ఇందులో షారుక్ నటించడంలేదు. డాన్‌గా రణ్వీర్ íసింగ్ నటిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. బాలీవుడ్ బ్రహ్మాస్త్రం ఒక సినిమా హిట్ సాధించిన తర్వాత, ఆ సినిమా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ సెట్స్‌పైకి వచ్చిన సినిమాలు బాలీవుడ్లో చాలా ఉన్నాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం ఇందుకు విభిన్నం. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మూడు భాగాలుగా వస్తుందని ఈ సినిమాను ప్రకటించిన సమయంలోనే వెల్లడించారు మేకర్స్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమా తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ట్ 1 శివ’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 2: దేవ్’, ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 3’ చిత్రాలకు సంబంధించిన ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. అయితే సెకండ్, థర్డ్ పార్ట్ షూటింగ్ ఒకేసారి జరుగుతుందని వరు సగా 2026, 2027లో ఈ సినిమాలు విడుదల అవుతాయనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజా ్రపాజెక్ట్ ‘వార్ 2’ కాబట్టి ఈ కారణంగా ‘బ్రహ్మాస్త్ర’ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇటు ప్రేమ.. అటు భయం ‘ప్రేమ.. జీవితాన్ని జీవించేలా చేస్తుంది’ అంటూ 1990లో వచ్చిన ‘ఆషికీ’కి బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మహేశ్ భట్ దర్శకత్వంలో రాహుల్ రాయ్, అనూ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. కాగా రెండు దశాబ్దాల తర్వాత ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ‘ఆషికీ 2’ (2013) సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ‘ఆషికీ 3’కి శ్రీకారం జరిగింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు. మరోవైపు హారర్ ఫిల్మ్ ‘భూల్ భూలెయ్య 3’లో కూడా హీరోగా నటిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. ‘భూల్ భూలెయ్య 2’ను డైరెక్ట్ చేసిన అనీస్ బాజ్మీ, ఆ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లోనే ‘భూల్ భూలెయ్య 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియ దర్శన్ దర్శకత్వంలో 2007లో ‘భూల్ భూలెయ్య’ చిత్రం విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది. కామెడీ ఫుక్రే హీరో పుల్కిత్ సామ్రాట్, దర్శకుడు మగ్దీప్ సింగ్ లంబా కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘ఫుక్రే 3’ ఈ నెల 28న విడుదల కానుంది. 2013లో వచ్చిన ‘ఫుక్రే’, 2017లోని ‘ఫుక్రే రిటర్న్స్’ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ‘ఫుక్రే రిటర్న్స్’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. ఇలా బాలీవుడ్లో ముస్తాబు అవుతున్న మూడో భాగం చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
‘ఆషికీ 3’ హీరోగా సిద్ధార్థ్.!
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్టైనర్లు ఆషికీ, ఆషికీ 2. ముఖ్యంగా ఆషికీ 2 ఘనవిజయం సాధించటమే కాదు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సిరీస్‌లో మరో భాగాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అయితే మూడో భాగంలో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత మహేష్ భట్ ఆషికీ 3కి సంబంధించి సిద్ధార్థ్ తో చర్చలు జరిపారు. సిద్ధార్థ్ కూడా ఈ సూపర్ హిట్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆషికీ 2 చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వంలో వహించారు. మరో మూడో భాగానికి మోహితే దర్శకత్వం వహిస్తారా లేక మరో దర్శకుడు తెర మీదకు వస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
మూడో ప్రేమికుడు
1990లో మహేశ్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికి’ మ్యూజికల్‌గా ఎంత సూపర్‌హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే పంథాలో ‘ఆషికి-2’ పేరుతో మూడేళ్ల క్రితం వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ ఓవర్‌నైట్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ‘ఆషికి’కి మూడో భాగం రానుంది. ఇందులో జంటగా సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్లు నటించనున్నారు. తొలి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తోనే మంచి జంట అనిపించుకున్న వీరిద్దరూ ఇటీవల ‘కపూర్ అండ్ సన్స్’లో నటించారు. రియల్ లవర్స్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ రీల్ లవర్స్గానూ ఎలాగూ రాణిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.