Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Exit Polls Survey organizations concluded YSRCP clearly heading for victory
లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్‌’ పక్కా

సాక్షి, అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం ఖాయమని... ఏ లెక్కన చూసుకున్నా మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం పక్కా అని అధిక శాతం జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇవన్నీ స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌కు చెందిన టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 14 లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంటుందని.. ఎన్‌డీఏ కూటమి 48 శాతం ఓట్లతో 11 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడయింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తరహాలోనే దేశ వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉన్న దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌... రాష్ట్రంలో 15–17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. ఎన్‌డీఏ కూటమి 8–9 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని తన ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా తేల్చిచెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వంటి మీడియా సంస్థలు, సెఫాలజిస్టులు, ఆరా వంటి ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థలు నిర్వహించిన 32 ఎగ్జిట్‌ పోల్స్‌లో 24 ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమయింది. బీజేపీ భజన చేసే జాతీయ మీడియా ఎగ్జిట్‌ పోల్స్‌ తద్భిన్నం.. బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, జీన్యూస్‌.. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న నెట్‌వర్క్‌లోని సీఎన్‌ఎన్‌ న్యూస్‌–18 వంటి రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేల్చడం గమనార్హం. రాజధాని అంశంతోపాటు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో సానుభూతి వచి్చందని.. అదే ఎన్‌డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని ఆ సంస్థలు విశ్లేషించాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇటు వైఎస్సార్‌సీపీగానీ అటు ఎన్‌డీఏగానీ రాజధాని అంశాన్ని ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇక స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి బంద్‌లు గానీ, ర్యాలీలు గానీ, నిరసనలు గానీ జరగనేలేదు. తప్పు చేశాడు కనక అరెస్టయ్యాడనే రీతిలో జనం స్పందించారు. దీంతో హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూపన్లు ఇచ్చి మరీ ‘ఐటీ ఉద్యోగుల’ పేరిట స్థానికంగా ఒక ఈవెంట్‌లా నిరసన కార్యక్రమం చేశారు. అలాంటిది ఈ రెండు అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని, అందుకే కూటమి గెలుస్తోందని ఈ జాతీయ ఛానెళ్లు చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్లూ తప్పవుతుందని రాష్ట్ర వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మేదెలా? విచిత్రమేంటంటే ‘ఇండియా టుడే– మై యాక్సిస్‌’ సంస్థ శనివారంనాడు దేశవ్యాప్త ఎగ్జిట్‌పోల్స్‌ను వెలువరించింది. దీన్లో బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని చేర్చటమే లక్ష్యంగా ఒకో రాష్ట్రంలో స్వీప్‌ అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పైపెచ్చు రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీకి 2 నుంచి 4 లోక్‌సభ స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పిన ఇండియా టుడే సంస్థ... ఆ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ గుర్తును కూడా ఆప్‌ గుర్తయిన చీపురుగా చూపించింది. విశేషమేంటంటే దీన్నే తెలుగుదేశం పార్టీ తన ట్విటర్‌ ఖాతాలోనూ పోస్ట్‌ చేసుకుంది. మరి పార్టీ గుర్తు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మేదెలా? ఇక కొన్ని రాష్ట్రాల విషయంలోనైతే కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అక్కడ వాస్తవంగా ఉన్న మొత్తం స్థానాలకన్నా ఎక్కువ స్థానాలు ఎన్‌డీఏ గెలుస్తుందని చూపించటాన్ని ఇప్పటికే ట్విటర్లో పలువురు ట్రోల్‌ చేస్తున్నారు కూడా. ఇదే ఇండియాటుడే– మై యాక్సిస్‌ సంస్థ 2021లో బెంగాల్లో చేసిన ఎగ్జిట్‌పోల్స్, 2023లో ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లలో చేసిన ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తిగా రివర్సయ్యాయనేది ఇక్కడ గమనార్హం. నిజానికి ఈ సర్వేను ప్రసారం చేస్తున్నపుడు ‘ఇండియాటుడే’ ఛానెల్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సర్వే ఫలితాలతో విభేదించారు కూడా. తాను ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించానని, సర్వేలో చెప్పినట్లుగా పరిస్థితులు అక్కడ లేవని పేర్కొన్నారు. గ్రామీణ, మహిళా ఓటర్లు పూర్తిగా వైఎస్సార్‌ సీపీవైపే ఉన్నారని, అది తన పర్యటనలో కనిపించిందని సర్దేశాయ్‌ చెప్పగా... చంద్రబాబు నాయుడి అరెస్టు పట్ల జనంలో సానుభూతి పెల్లుబుకిందని, అదే కూటమి విజయానికి కారణమవుతోందని ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన ప్రదీప్‌ గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు. తాజాగా బీజేపీ కూటమికి దేశంలో అత్యంత భారీగా స్థానాలు వస్తాయని పేర్కొన్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌లో చిత్రవిచిత్రమైన తప్పులు కనిపించాయి. ఇండియాటుడే గ్రూప్‌లోని ఆజ్‌ తక్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో తమిళనాడులో కాంగ్రెస్‌ 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ 13–15 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చడంతో చర్చలో పాల్గొన్న వారే విస్తుపోయారు. రాజస్థాన్‌లో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలైతే.. ఆ రాష్ట్రంలో 33 స్థానాల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో టుడేస్‌ చాణక్య వెల్లడించడం గమనార్హం. జార్ఖండ్‌లో సీపీఐ (ఎంఎల్‌) ఒక స్థానంలో పోటీ చేస్తే.. రెండు నుంచి మూడు స్థానాల్లో ఆపార్టీ విజయం సాధిస్తుందని ఆజ్‌తక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. హర్యానాలో ఉన్నదే 10 లోక్‌సభ స్థానాలైతే 16–19 స్థానాల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని జీన్యూస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో తేల్చడం విస్మయకరమే. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నవే నాలుగు లోక్‌సభ స్థానాలైతే.. అక్కడ ఎన్‌డీఏ 6–8 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్‌ తేల్చింది. విశేషమేంటంటే ఈ సంస్థలన్నీ రాష్ట్రంలో కూటమికే మెజారిటీ లోక్‌సభ స్థానాలు దక్కుతున్నాయని చెప్పాయి. లోతుగా పరిశీలించినట్లయితే ఈ జాతీయ మీడియా సంస్థలకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి యంత్రాంగమూ లేదు. వీటిలో చాలావరకూ ప్రజల అభిప్రాయాన్ని ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ ద్వారా తెలుసుకుని.. వాటినే ఎగ్జిట్‌ పోల్స్‌గా వెల్లడించాయి. గ్రామీణ ఓటర్లు, మహిళలు, వైఎస్సార్‌ సీపీకి ఎప్పుడూ అండగా ఉండే బలహీనవర్గాలు ఇలాంటి సర్వేల్లో పాల్గొనే అవకాశం తక్కువ. దీన్ని బట్టి చూస్తే.. ఈ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌... జూన్‌ 4న పూర్తి స్థాయిలో తిరగబడతాయని స్పష్టంగానే చెప్పొచ్చు. వైఎస్సార్‌సీపీ ఓడిపోయే అవకాశమే లేదు..రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలను తెస్తూ... గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ... ఐదేళ్లుగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలను జనం పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో రుజువయింది. అర్హతే ప్రమాణికంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో 60 శాతానికి పైగా వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలుస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు.. మహిళల్లో వైఎస్సార్‌సీపీకి అత్యంత ఆదరణ ఉందని.. ఇదే ఆపార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఇవే జాతీయ మీడియా సంస్థలు గతంలో విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓట్లు పోల్‌ కావడం.. మహిళలు ఎన్‌డీఏ కూటమి కంటే వైఎస్సార్‌సీపీకి 12 శాతం అధికంగా వేశారని.. ఇది ఆపార్టీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని ఆరా మస్తాన్, చాణక్య పార్ధదాస్‌లు కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే తాము ఓడిపోయే అవకాశమే లేదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కౌంటింగ్‌ నాడు అక్రమాలకు తెగబడటానికే! రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వస్తుండటంతో పలువురు సెఫాలజిస్టులను చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ బెదిరించినట్లు వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సర్వే సంస్థ లోకేశ్‌ బెదిరింపులను తట్టుకోలేక... ఫలితాలను అట్నుంచి ఇటు మార్చి కూటమి గెలుస్తున్నట్లుగా ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ రెండ్రోజుల్లో తేలే ఫలితాల కోసం చినబాబు– చంద్రబాబు ఎందుకు ఇంతలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశాన్ని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. తామే గెలుస్తున్నామనే భ్రమలు కల్పించటం ద్వారా వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌లో నిరుత్సాహాన్ని నింపి... కౌంటింగ్‌ రోజున అవసరమైతే వారిని ప్రలోభపెట్టో, బెదిరించో తమ పబ్బం గడుపుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆలోచనగా చెబుతున్నారు. ఈసీ ఎలాగూ తమకే సహకరిస్తుంది కనక ఎలాంటి దారుణాలకైనా వెనకాడకూడదన్నది వీళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అయితే పురిట్లోనే సంధికొట్టినట్లు చాలామంది సెఫాలజిస్టులు వీరి బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్‌సీపీ గెలుస్తున్నదని చెప్పటం ‘బాబు’లిద్దరికీ మింగుడుపడటం లేదు.

YSRCP Legal Battle In Supreme Court On Postal Ballot Counting Updates
పోస్టల్‌ బ్యాలెట్లపై న్యాయపోరాటం.. సుప్రీంలో నేడు విచారణ

న్యూఢిల్లీ, సాక్షి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ విషయంలో ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టు ముందుకు ఈ అంశం విచారణకు రానుంది. రేపు ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాలన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మరికాసేపట్లో జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్‌ విచారణ చేపట్టనుంది. ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనా ఇచ్చిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది తెలిసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలన్న ఏపీ సీఈవో మెమోను.. తదనంతరం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైఎస్సార్‌సీపీ కోరుతోంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ వేసింది వైఎస్సార్‌సీపీ. ఇవాళ్టి కేసు జాబితాలో ఐటెం నెంబర్‌44గా వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ రికార్డయ్యింది.రేపే కౌంటింగ్‌ కావడంతో.. నేడు త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది, సుప్రీం ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అలాగే.. దేశం అంతటా ఎన్నికల సంఘం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని వాదనలు వినిపించే అవకాశాలున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌ వరకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ పిటిషన్‌ను అడ్డుతగలాలని టీడీపీ కుట్రలు చేస్తోంది.అడ్డుపుల్లకు టీడీపీ యత్నంసుప్రీం కోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ విచారణకు అడ్డు పడేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో కేవివేట్ దాఖలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్‌లో వెలగపూడి పేర్కొన్నారు. అంతకు ముందు.. ఏపీ హైకోర్టులోనూ ఆయన తమనూ ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ పిటిషన్‌ వేయడం గమనార్హం.హైకోర్టులో..ఇక వైఎస్సార్‌సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పోస్టల్‌బ్యాలెట్‌ ఈసీ మెమోపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అదే సమయంలో ఏపీ సీఈవో నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర ఎన్నికల సంఘం, మెమోలో కొంత పార్ట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ డబుల్‌ గేమ్‌ ఆడింది. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ బలమైన వాదనలే వినిపించింది. రాత్రికి రాత్రే మెమో తేవాల్సిన అవసరం ఏముందని, దేశంలో ఎక్కడా లేని రూల్‌ను ఏపీలో తీసుకురావడంలో ఆంతర్యమేంటని వాదించింది. కానీ, పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. దీంతో వైఎస్సార్‌సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం అనివార్యమైంది.

Count Down Starts For AP Election Results Live Updates
AP Election Update: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

AP Elections Counting Count Down10:40 AM, 3rd June, 2024వైఎస్సార్‌సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్‌ఆర్‌సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్‌ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్‌ ఫోకస్‌ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ప్రెస్‌మీట్‌నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్‌ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్‌ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్‌ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా కామెంట్స్‌..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్‌’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్‌50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న దైనిక్‌ భాస్కర్‌(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్‌ పోల్స్‌లో 24 పోల్స్‌ వైఎస్సార్‌సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్‌డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్‌ఎన్‌ న్యూస్‌–18 ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్‌సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్‌ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్‌సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్‌డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్‌’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్‌సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్‌

Virat Kohli skips T20 World Cup practice again: Reports
విరాట్‌ కోహ్లికి ఏమైంది..? మరోసారి ప్రాక్టీస్‌ డుమ్మా!

టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న న్యూయర్క్‌ వేదికగా తలపడనుంది. ఇప్పటికే న్యూయర్క్‌ చేరుకున్న రోహిత్‌ సేన ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. టీమిండియా సోమవారం(జూన్‌ 3) తమ చివరి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు(జూన్‌ 4)న ఆటగాళ్లకు టీమ్‌ మెన్‌జ్‌మెంట్‌ విశ్రాంతి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం వీలైనంత ఎక్కువ సమయం పాటు నెట్స్‌లో గడపాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం.కోహ్లి ప్రాక్టీస్‌ డుమ్మా!ఇక జట్టుతో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకున్న టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఒక్క ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనలేదు. జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మాప్‌ మ్యాచ్‌కు దూరమైన కోహ్లి.. ఆదివారం(జూన్‌ 2)న ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోంటుడని పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు కూడా కోహ్లి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. జట్టుతో కలిసినప్పటికి అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విరాట్‌ సోమవారం జట్టు ఆఖరి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్‌-2024లో ఎలిమినేటర్‌లో ఓటమి తర్వాత కోహ్లి రెస్టులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా విరాట్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2024లో కోహ్లి దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 61.75 స‌గ‌టుతో 741 ప‌రుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా విరాట్ నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 వరల్డ్‌కప్‌లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Election Counting Preparation Ready In Telangana
Telangana: కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్‌ రిజల్ట్‌ అక్కడే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్‌కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.కౌంటింగ్‌లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్‌లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్‪గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‪లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది.

Study Said Rich People Are Genetically At Greater Risk Of Cancer
ధనవంతులకే ఆ వ్యాధి వస్తుందా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

పూర్వం ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అనుకునేవారు. ఎందుకంటే వారికి మంచి వైద్యంపొందే ఆర్థిక స్థోమత ఉంటుంది. ఈజీగా బయటపడతారు అనుకునేవారు. వారు కావాల్సిన పదార్థాలు ఎంత ఖర్చు చేసి అయినా తెప్పించుకుని తింటారు కాబట్టి. కొన్ని రకాల వ్యాధులు వారకే వస్తాయని అనుకునేవారు చామంది. కానీ అదెంత వరకు నిజం అనేది తెలియదు. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనంలో శాస్తవేత్తలు సామాజికి ఆర్థిక పరిస్థితితో అనే రకాల వ్యాధులు ముడిపడి ఉన్నాయని కనుగొన్నారు. సామాజికి ఆర్థిక పరిస్థితి కొన్ని రకాల కేన్సర్‌లు వచ్చేందుకు కారణమవుతుందని గుర్తించారు. వారి పరిశోధనలో పేదవారికంటే సంపన్నులకే జన్యుపరంగా కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్‌, వంటి ఇతర రకాల కేన్సర్‌ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్‌కి గురై ఆల్కహాల్‌కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్‌ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్‌ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్‌అప్‌ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్‌ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్‌ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్‌ హగెన్‌ బీక్‌ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్‌ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ​ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!)

Stock Market Rally On Today Opening
ఆల్‌టైమ్‌హై చేరిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 23100 మార్కు దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం ఆల్‌టైమ్‌హై చేరాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 570 పాయింట్లు లాభపడి 23,102కు చేరింది. సెన్సెక్స్‌ 1836 పాయింట్లు ఎగబాకి 75,805 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 80.03 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.8 శాతం లాభపడింది, నాస్‌డాక్‌ 0.01 శాతం నష్టపోయింది.ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అవి దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే శనివారం(1న) వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో అధికార బీజేపీ అధ్యక్షతన ఏర్పాటైన ఎన్‌డీఏ భారీ విజయాన్ని సాధించనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. దీంతో మంగళవారం వెలువడే లోక్‌సభ ఫలితాల్లో తిరిగి బీజేపీ కూటమి అధికారాన్ని అందుకుంటుందన్న అంచనాలు బలపడినట్లు రాజకీయ వర్గాలు తెలియజేశాయి.అయితే జూన్‌ 4న ప్రకటించనున్న వాస్తవిక ఫలితాలు అంచానాలకు భిన్నంగా వెలువడితే.. మార్కెట్లలో దిద్దుబాటుకూ అవకాశమున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Janhvi Kapoor Once Said She Didn't Want To Work With Rajkummar Rao
ఆ హీరోతో పని చేయనన్న హీరోయిన్‌.. ఇప్పుడు అతడితోనే హిట్‌..

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో రూహి ఒకటి. హారర్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌ కుమార్‌ రావు హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా రిలీజ్‌ సమయంలో 'రాజ్‌కుమార్‌తో పని చేయాలంటే చిరాకుగా ఉంది. ప్రతిసారి ఆయనతో కలిసి ఎలా నటించగలను? కాకపోతే ఆయన చాలా టాలెంట్‌.. నటిగా తన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. తనతో కలిసి పని చేయడం ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న ఫీలింగ్‌ వస్తుంది' అని చెప్పింది.మరోసారి జోడీఅతడితో పని చేయడమే చిరాకు అన్న జాన్వీ కపూర్‌.. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి చిత్రంలో మరోసారి రాజ్‌కుమార్‌ రావుతో జోడీ కట్టింది. ఈ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఆమె ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకు హాజరైంది. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ.. జాన్వీని ఊహించని ప్రశ్న అడిగాడు. రాజ్‌కుమార్‌తో మళ్లీ పని చేయనన్నావ్‌? అని ఇరకాటంలో పడేశాడు.అందుకే అలా చెప్పాఅందుకు జాన్వీ తెలివిగా సమాధానమిచ్చింది. మీడియా ఎప్పుడూ సెన్సేషనల్‌ హెడ్‌లైన్స్‌ కోసమే ఎదురుచూస్తుంది. నేను అలాంటి స్టేట్‌మెంట్‌ ఇస్తే సినిమా ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందనుకున్నాను. అలాగే తనతో పని చేయడం ఎందుకు కష్టమో కూడా చెప్పాను. తనకు చాలా అనుభవం ఉంది, టాలెంటెడ్‌.. అలాంటి వ్యక్తి పక్కన నటించడం కష్టమే కదా..! అని బదులిచ్చింది.చదవండి: ప్రముఖ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు

Rajdeep Sardesai said that rural people and women supported YSRCP
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్‌ మై ఇండియా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్‌ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్‌ ఎడిటర్‌ రాజీదీప్‌ సర్దేశాయ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్‌ మై ఇండియా అధినేత ప్రదీప్‌ గుప్తాకు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చురకలంటించారు.స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్‌ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్‌ రాహుల్‌ కన్వల్‌ స్పందిస్తూ.. కేజ్రివాల్‌ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్‌ సోరేన్‌ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్‌ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్‌ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్‌ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ 2021లో పశ్చిమ్‌ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది.

Kerala Organ Trade Case: Key Accused Also Try To Sell
తన కిడ్నీని అమ్మాలనుకుని, చివరకు..

హైదరాబాద్‌: కేరళ నెడుంబస్సేరి కిడ్నీ రాకెట్‌ మూలాలు నగరంలో బయటపడడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బెల్లంకొండ రాంప్రసాద్‌ అలియాస్‌ ప్రతాపన్‌(41) విచారణ సందర్భంగా కీలక వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముఠా ఏర్పడిన తీరు కూడా పోలీసులను ఆశ్చర్యపరిచింది.ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌, విజయవాడలో రియల్టర్‌ అయిన రాంప్రసాద్‌.. తన కిడ్నీని అమ్మాలని ప్రయత్నించాడు. అయితే అతనికి ఉన్న అనారోగ్యంతో అది వీలుకాలేదు. ఈలోపు ఇరాన్‌లో కిడ్నీ రాకెట్‌ నడిపించే మధుతో రాంప్రసాద్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికే మరో నిందితుడు సబిత్‌ కూడా తన కిడ్నీని అమ్మేశాడు. కిడ్నీ రాకెట్‌ ద్వారా మధు సంపాదన తెలిసి వీళ్లకూ ఆశపుట్టింది. అలా.. మధు ద్వారా రాంప్రసాద్‌, సబిత్‌.. ఇంకొందరు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రాంప్రసాద్‌ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించాడు. ఇరాన్‌తో పాటు కువైట్‌, శ్రీలంక కేంద్రాలుగా ఈ గ్యాంగ్‌ కిడ్నీ రాకెట్‌ వ్యవహారాన్ని నడిపించినట్లు దర్యప్తులో వెల్లడైంది. ఇక.. ఈ ముఠా దాదాపు 40 మందికిపైగా యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మినట్లు వెల్లడైంది. పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని.. యువకులకు గాలం వేసేది ఈ గ్యాంగ్‌. ఆధార్‌ కార్డు, ఇతర డాక్యుమెంట్లతో ఫేక్‌ పాస్‌పోర్టులు తయారు చేసి ఇరాన్‌కు తీసుకెళ్లేది. అక్కడ వాళ్లను అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్‌మెంట్‌లలో ఉంచేవాళ్లు. ఆ తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లి కిడ్నీలను సేకరించేవాళ్లు. కిడ్నీ దాతలను గుర్తించేందుకు హైదరాబాద్, విజయవాడలలో తనకు పలువురు సహకరించారని, అందులో వైద్య రంగానికి చెందిన వారితోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు, ఇందుకోసం వారికి కొంత కమీషన్‌ కూడా ముట్టజెప్పానని రాంప్రసాద్‌ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.ఇక.. ఈ కేసులో పోలీసులు సైతం ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. కిడ్నీ మార్పిడి చేయాలంటే రక్తం గ్రూపు నిర్ధారణ దగ్గర నుంచి అనేక పరీక్షలు నిర్వహించి, ఫలానా దాత కిడ్నీ ఫలానా గ్రహీతకు సరిపోతుందని నిపుణులైన వైద్యులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. రాంప్రసాద్‌ పంపిన వారందరి కిడ్నీలు ఇరాన్‌లో ఎదురుచూస్తున్న వారందరికీ సరిగ్గా సరిపోయాయి. గ్రహీతల వైద్య పరీక్షల వివరాలను రాంప్రసాద్‌ ముందుగానే తెప్పించుకునేవాడని, కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధమైనవారికి ఇక్కడున్న ల్యాబొరేటరీల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఎవరిది ఎవరికి సరిపోతుందో ముందుగానే నిర్ధారణకు వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. రాంప్రసాద్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరిన్ని అరెస్టులు ఈ కేసులో జరిగేలా తప్పడం లేదు. ఈ కేసులో అంతకు ముందే త్రిస్సూర్‌కు చెందిన సబిత్‌ నాజర్‌, కళామస్సేరికి చెందిన సాజిత్‌ శ్యామ్‌రాజ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సబిత్‌ను విచారణ చేపట్టాకే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగింది. ప్రస్తుతానికి ఈ గ్యాంగ్‌కు సంబంధించి భారత్‌లోని ముఠా సభ్యులందరినీ అరెస్ట్‌ చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్ట్‌ కావాల్సింది ఇరాన్‌లో రాకెట్‌ నడిపించిన మధు మాత్రమే.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement