T20 World Cup 2024: నిప్పులు చెరిగిన భారత పేసర్లు.. 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్‌ | T20 World Cup 2024: Team India Bowlers Shine, Ireland All Out For 96 | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: నిప్పులు చెరిగిన భారత పేసర్లు.. 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్‌

Jun 5 2024 9:34 PM | Updated on Jun 6 2024 9:58 AM

T20 World Cup 2024: Team India Bowlers Shine, Ireland All Out For 96

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్‌ 5) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేక మేడలా కూలింది. 

హార్దిక్‌ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-35-2), సిరాజ్‌ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్‌ పటేల్‌ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్‌ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో లోర్గాన్‌ టక్కర్‌ (10), కర్టిస్‌ క్యాంపర్‌ (12), గెరాత్‌ డెలానీ (26), జాషువ లిటిల్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్‌ స్టిర్లింగ్‌ (2), హ్యారీ టెక్టార్‌ (4), జార్జ్‌ డాక్రెల్‌ (3), మార్క్‌ అదైర్‌ (3), బ్యారీ మెక్‌ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement