Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Tribal Leader Mohan Charan Majhi Is The New Cm Of Odisha
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్‌ మాఝీ

సాక్షి, భువనేశ్వర్‌: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్‌ చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌ మాఝీ​కి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్‌ సింగ్‌ దేవ్‌, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, భూపేంద్ర యాదవ్‌ హాజరయ్యారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Ysrcp Complaint To Trai About Blocking Sakshi Tv Broadcasts
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత.. ట్రాయ్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబుల్‌ ఆపరేటర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సాక్షితో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోంది.సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైఎస్సార్‌సీపీ పేర్కొంది.మీడియాకు ఆంక్షలు.. కొత్త సర్కార్‌ విపరీత పోకడఏపీ సీఎం ప్రమాణస్వీకారానికి మీడియా, జర్నలిస్టులకు కొత్త ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాతో పాటు మరో రెండు ఛానళ్లకు అనుమతి నిరాకరించింది. కవరేజ్‌ కోసం మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వని అధికారులు.. ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి మీడియా కవరేజ్‌కు ఆంక్షలు విధించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాని పర్యటన వార్తలు కవర్‌ చేయొద్దన్న ఆంక్షలపై పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూలేని విపరీత పోకడలపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎల్లో మీడియాకు ఆహ్వానాలు అందగా, బాబు ప్రభుత్వం కొలువు దీరకముందే ఆంక్షలు విధించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, రాష్ట్రంలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు..

Rahulgandhi Bold Comments On Varanasi Election Result
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్‌ సంచలన కామెంట్స్‌

లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్‌ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం(జూన్‌11) నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు.

Must Keep in Mind These Rules When Your Applying Personal Loan
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి

పర్సనల్ లోన్ అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నవారు, బిజినెస్ చేసేవారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడానికి సిద్దమైపోతారు. ఇంతకీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? ఏ సమయంలో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనే విషయాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..వడ్డీ రేటుపర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి బ్యాంకులు ఎంత వడ్డీకి లోన్ ఇస్తుంది అనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటితో పోలిస్తే.. పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తీసుకొనే మొత్తాన్ని (డబ్బు) బట్టి, వ్యవధి, క్రెడిట్ స్కోరును బట్టి కూడా ఈ వడ్డీని నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 12 నుంచి 21 శాతం వరకు ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తపడాలి. అంతే కాకుండా.. మీకు వచ్చే వార్షిక ఆదాయానికి మించి లోన్ తీసుకుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరికి లోన్ ఇస్తారులోన్ అనేది ఉద్యోగం చేసేవారికైనా.. సొంతంగా బిజినెస్ చేసేవారికైనా ఇస్తారు. అయితే ఉద్యోగికి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. వారు మూడు నెలల పేస్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంతంగా బిజినెస్ చేసేవారికి డెబిట్ / క్రెడిట్ కార్డు హిస్టరీని చూసి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఫేమస్ కంపెనీలలో ఉద్యోగం చేసేవారికి మాత్రమే లోన్ ఇస్తాయి.ఆదాయాన్ని మించకుండా..పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి తన నెలవారీ జీతం కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే వచ్చే డబ్బుతోనే నిత్యావసరాలు, ఈఎంఐ వంటి వాటితో పాటు పిల్లల చదువులు ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బేరీజు చేసుకున్న తరువాత ఎంత లోన్ తీసుకుంటే.. ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. నెల జీతంలో ఈఎంఐ పోగా ఎంత మిగులుతుంది అనేది చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ అనేది 12 నెలలు (ఒక సంవత్సరం) మించగకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.లోన్ ఎప్పుడు తీసుకోవాలి?లోన్ తీసుకోవడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో, వేరే మార్గం లేని సమయంలో తీసుకోవాలి. ఆరోగ్యం మందగించినప్పుడు లేదా అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు తీసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సరదాల కోసం, గ్యాడ్జెట్స్ కొనుగోలు కోసం, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోకూడదు. తప్పకుండా ఇవన్నీ గుర్తుంచుకోవాలి.

Who Is Mohan Majhi Odisha First Bjp Chief Minister
ఒడిశాకు కొత్త సీఎం.. ఎవరీ మోహన్‌ చరణ్‌ మాఝీ?

భువనేశ్వర్‌ : ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి? ఎవరనే ఉత్కంఠతకు బీజేపీ అధిష్టానం తెరదించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మాఝీని ఎంపిక చేసింది.ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్‌ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్‌ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన,పార్టీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి.డిప్యూటీ సీఎంలుగాకేవీ సింగ్ డియో బోలంగీర్‌ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.తీవ్ర కసరత్తుఇక 24ఏళ్ల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రి నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసేంది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను పంపింది. భువనేశ్వర్‌లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరమ్ కూడా హాజరయ్యారు.

Ksr Comments On The Growth Of All Indian Regional Political Parties
గెలుపులు.. మలుపులు.. ప్రాంతీయ పార్టీల ‘జాతీయ’ బంధాలు..

దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ కూటమిలో భాగస్వామి అయితేనే ప్రయోజనమా అనే చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ విధానాలు, తమ సిద్ధాంతాలు, తమ వెనుక ఉండే ఓట్ బ్యాంక్ ఆధారంగా జాతీయ పార్టీల కూటమిలో కలవాలా? వద్దా? అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు పూర్తి అవకాశవాదంతో ఎటు వెళితే ఉపయోగమని అనుకుంటాయో అటు వెళుతున్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఒకప్పుడు రాష్ట్రాలలోని రాజకీయాలలో అంతగా తలదూర్చేవి కావు. కానీ రాను, రాను అవి కూడా ప్రాంతీయ పార్టీల ధోరణిలో ఆలోచించడం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో పట్టు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా జాతీయ పార్టీలతో చెలిమి చేస్తున్నాయి.స్వాతంత్రం వచ్చినప్పటినుంచి పలు ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. వాటిలో అనేకం జాతీయ పార్టీలలో విలీనం అవడమో, లేక పొత్తు పెట్టుకుని మనుగడ సాగించడమో చేశాయి. నాయకత్వ స్థాయిని బట్టి అవి కొంతకాలం నిలబడగలుగుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉవ్వెత్తున పైకి లేచినా, అనతికాలంలోనే పడిపోయింది. ఒంటరిగా పోటీచేసి అధికారం సాధించలేకపోవడంతో తర్వాత కాలంలో కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది.ఉమ్మడి ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో తన ప్రయాణం ఆరంభించి 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దశకు ఎదిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో టీఆర్ఎస్ కూడా ఉంటేనే ఏపీలో అధికారం సాధించగలుగుతామని నాయకత్వం భావించి పొత్తుపెట్టుకుంది. అది ఫలించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయి రెండు చోట్ల అధికారం పొందింది. టీఆర్ఎస్ తెలంగాణ సాధనకు ఏర్పాటైన ఉద్యమ పార్టీ కనుక కొద్దికాలానికే కూటమి నుంచి విడిపోయింది. తదుపరి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఫలితం పొందలేకపోయింది.ఆ తర్వాత పరిణామాలలో తెలంగాణ రాష్ట్రం రావడం, ఒంటరిగా టీఆర్ఎస్ పోటీ చేసి అధికారం సాధించడంతో పార్టీకి ఖ్యాతి వచ్చింది. తొమ్మిదినర్రేళ్లపాటు పవర్ లో ఉంది. ఆ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ వంటి పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడం విశేషం. కానీ 2023లో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలవడంతో సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అదే టీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో! ఒక దశలో బీజేపీతో స్నేహంగానే ఉన్నా, మరో సందర్భంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సహకరించినా ఒంటరిగానే రాష్ట్రంలో రాజకీయం చేసింది.ఆ రెండు పార్టీలు ప్రత్యర్ధి పార్టీలుగా మారడంతో బీఆర్ఎస్(పేరు మారిన టీఆర్ఎస్) ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పనిలో పడింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారం సాధించడానికి యత్నిస్తున్న పార్టీ కావడం, బీజేపీ పొత్తు వల్ల తమకు ముస్లిం మైనార్టీల మధ్దతు రాదేమోనన్న అనుమానంతో పొత్తు వైపు బీఆర్ఎస్ చూడలేదు. పైగా తనకు మళ్లీ అధికారం వస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంది. కానీ అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఏదో ఒక కూటమిగానే ఉండడం విశేషం. తొలుత సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నా, తదుపరి కాలంలో బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో స్నేహం సాగించింది.1994, 1996, 1998లలో వామపక్షాలతో కూటమి కట్టిన టీడీపీ 1999 లో బీజేపీ వైపు జంప్ చేసింది. 2004లో ఓటమి తర్వాత 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీచేసింది. అది ఫలించలేదు. దాంతో తిరిగి 2014 నాటికి బీజేపీతో జత కట్టి లాభం పొందింది. అప్పుడే ఏర్పడిన జనసేన కూడా ఉపయోగపడింది. 2018లో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ కూటమిలో టీడీపీ చేరి తెలంగాణలో పోటీ చేసింది. అది సఫలం కాకపోవడంతో 2019 ఏపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అలాగే జనసేన కూడా 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కూటమి కట్టినా ప్రయోజనం కలగలేదు. దానిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ అధినాయకత్వం ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఖర్చీఫ్ వేసింది. ఈలోగా టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించి తన తరపున పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వ్యూహాలలో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి. తొలుత బీజేపీకి అంత ఇష్టం లేకపోయినా, జనసేన ఒత్తిడితో మళ్లీ టీడీపీని ఎన్డీఏ లో చేర్చుకున్నారు. అది సత్ఫలితాన్ని ఇచ్చి రాష్ట్రంలో అధికారం పొందడమే కాక, కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇచ్చే దశకు టీడీపీ చేరుకుంది.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్సార్సీపీను ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే ప్రయాణం సాగించారు. దానినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 2019లో విజయం తర్వాత వైఎస్సార్సీపీ కనుక ఎన్డీఏ లో చేరి ఉన్నట్లయితే కేంద్రంలో తనకు మంచి పట్టు లభించినట్లయ్యేది. కానీ తన వెనుక ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కువగా బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉంటుందన్న భావనతో అలా చేయలేకపోయారు. కానీ ప్రధాని మోదీతో ఉన్న స్నేహం కారణంగా, కాంగ్రెస్ తో సరిపడదు కనుక ఎన్డీఏకే అవసరమైన అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి వారి అభిమానాన్ని పొందారు.2024 ఎన్నికల ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం వైఎస్సార్సీపీకి పొత్తు ఆఫర్ ఇచ్చినా అందుకు సిద్దపడలేదని చెబుతారు. ఒకవైపు చంద్రబాబు జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన అవకాశాలను మెరుగుపరచుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ఉన్న ఆత్మ విశ్వాసంతో దెబ్బతిన్నారనిపిస్తుంది. చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఇప్పుడు కలవగలిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ మోదీపై విమర్శలు చేయలేదు. కానీ ఎన్డీఏతో జతకట్టడానికి సిద్దపడలేదు. ప్రస్తుతం రాజ్యసభలో పదకుండు మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు వైఎస్సార్సీపీకి ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏతో సంబంధాలు మెరుగుపరచుకోవడం మంచిదని చెప్పాలి. అలా వైఎస్సార్సీపీ చేస్తుందో, లేదో తెలియదు.ఒడిషాలో బిజు జనతాదళ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. బీజేపీతో పొత్తు చర్చలు విఫలం అవడంతో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అదే ఎలాగొలా రాజీపడి పొత్తుపెట్టుకుని ఉంటే నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారేమో! అంటే జాతీయ పార్టీతో పొత్తుతో చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి నేతలు రాజకీయంగా, ఇతరత్రా లబ్దిపొందుతుండడం గమనించదగ్గ అంశం.ఇతర రాష్ట్రాలను చూస్తే తమిళనాడులో డీఎంకే గత కొంతకాలంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇది ఈసారి లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రతిఫలించింది. అన్నా డీఎంకే గతంలో మాదిరి బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా నష్టపోయింది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంటూ జాతీయ స్థాయిలో ఒక అండ పొందిందని చెప్పాలి. అదే సమయంలో రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంలతో పోటీ పడుతోంది. ఇదేమీ కొత్త కాదు. కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు పరస్పరం పోటీ పడుతాయి. ఢిల్లీ స్థాయిలో మాత్రం కలిసి ఒక కూటమిగా ఉంటున్నాయి. అలాగే వైఎస్సార్సీపీ వంటి పార్టీలు కూడా ఆ తరహా ప్రయత్నాలు చేస్తాయా? లేదా? అన్నది చూడాలి.ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ మొన్నటి వరకు ఏ కూటమిలో లేదు. బీజేపీ నుంచి తీవ్రమైన సమస్యలు ఎదుర్కుంటోంది. మద్యం స్కామ్ పేరుతో ఆప్ ను బీజేపీ దడదడలాడిస్తోందన్న భావన ఉంది. దాంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇండి కూటమిలో చేరారు. బీహారులో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలం కాంగ్రెస్, ఆర్జెడిలతో కలిసి, మరికొంతకాలం బీజేపీతో కలిసి రాజకీయం సాగిస్తూ ఇంతవరకు సఫలం అయ్యారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన బీజేపీతో జట్టుకట్టడం ఉపయోగపడింది.ఢిల్లీ స్థాయిలో కీలకమైన వ్యక్తిగా మారారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్.సీ.సీలలో చీలిక తెచ్చి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కర్నాటకలో బీజేపీతో జెడిఎస్ జట్టుకట్టడం వల్ల కేంద్రంలో ఆ పార్టీ అధినేత కుమారస్వామి మంత్రి కాగలిగారు. జమ్ము-కశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉంటాయి. సిక్కింలో ఘన విజయం సాధించిన సిక్కిం ప్రాంతీయ పార్టీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తోంది.ఓవరాల్ గా చూసినప్పుడు వీలైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీతో కూటమిలో భాగస్వామి అవడమో లేదా సత్సంబంధాలు పెట్టుకోవడమో చేయక తప్పని పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకు ఏర్పడుతున్నట్లు అనిపిస్తుంది. అధికార పార్టీతో వీలు కాకపోతే ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో అయినా చేరితే ఏదో ఒక అండ దొరికినట్లవుతుందన్న భావన ఏర్పడుతోంది. దేశ రాజకీయాలలో ఇది అత్యంత కీలమైన పరిణామంగా కనిపిస్తుంది. లేకుంటే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

YSRCP Leaders Meets YS Jagan At Camp Office
వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగనమోహన్‌రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్‌ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు.

Half-A-Dozen India Bloc MPs May Be Convicted In Uttar Pradesh
ఆరుగురు ఇండియా కూటమి యూపీ ఎంపీలు సభ్యత్వం కోల్పోనున్నారా?

లక్నో: ఇటీవల కొత్తగా ఎంపికైన ఇండియా కూటమిలోని ఆరుగురు ఎంపీలు తమ పదవుల్ని కోల్పోనున్నారా? క్రిమినల్‌ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆరుగురు ఎంపీలకు రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడనుందా? అదే జరిగితే వారు పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. సాధారణ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ఆరుగురు ఇండియా కూటమి ఎంపీలకు పదవీ గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆరుగురు క్రిమినల్‌ కేసులు ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. అదే జరిగితే ఈ ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. ఇక ఆ ఆరుగురిలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ఘాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అఫ్జల్‌ అన్సారీ ఇప్పటికే గ్యాంగ్‌స్టర్‌ చట్టం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. అతని నేరారోపణపై అలహాబాద్ హైకోర్టు గత నెలలో స్టే విధించింది. దీంతో ఆయన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్జల్‌ అన్సారీ కేసును జులైలో కోర్టు విచారించనుంది. కోర్టు శిక్షను సమర్థిస్తే అన్సారీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.అజంగఢ్ సీటును గెలుచుకున్న ధర్మేంద్ర యాదవ్‌పై కూడా నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అతను దోషిగా తేలితే రెండేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. దీంతో ఆయన సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మాయావతి హయాంలో మంత్రిగా పనిచేసిన బాబు సింగ్ కుష్వాహా నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మెషిన్‌(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) స్కామ్‌కు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై నమోదైన 25 కేసుల్లో ఎనిమిదింటిపై అభియోగాలు నమోదయ్యాయి. సుల్తాన్‌పూర్ స్థానం నుంచి గెలుపొందిన రాంభూల్ నిషాద్‌పై గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద ఒక కేసుతో సహా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. చందౌలీ లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి మహేంద్ర నాథ్ పాండేపై విజయం సాధించిన వీరేంద్ర సింగ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. సహరాన్‌పూర్‌ నుంచి గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ మసూద్‌పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. నగీనా రిజర్వ్‌డ్ స్థానంలో గెలిచిన సమాజ్ పార్టీకి చెందిన ఏడో అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్‌పై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏదైనా ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడితే అతని రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.అనేక మంది రాజకీయ నేతలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండడం గమనార్హం.

T20 World Cup 2024: Bangladesh Batter Jaker Ali Splits Bat Into Half In Frustration During South Africa Clash
T20 World Cup 2024: బ్యాట్‌ను రెండుగా చీల్చేసిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్‌ మధ్య నిన్న (జూన్‌ 10) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశీ బ్యాటర్‌ జాకెర్‌ అలీ కోపంతో బ్యాట్‌ను రెండు ముక్కలుగా చీల్చేశాడు. బంగ్లాదేశ్‌ గెలుపుకు 7 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో జాకెర్‌ అలీ ఈ పనికి పాల్పడ్డాడు. సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ ఆడే క్రమంలో జాకెర్‌ అలీ బ్యాట్‌ డ్యామేజ్‌ అయ్యింది. షాట్‌ మిస్‌ టైమ్‌ కావడంతో కోపంతో ఊగిపోయిన జాకెర్‌ స్వల్పంగా డ్యామేజ్‌ అయిన బ్యాట్‌ను రెండుగా చీల్చాడు. అనంతరం జాకెర్‌ కొత్త బ్యాట్‌ కోసం డ్రెస్సింగ్‌ రూమ్‌కు సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by ICC (@icc)ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి బంగ్లాదేశ్‌.. చివరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్‌ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా.. కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. కేశవ్‌ మహారాజ్‌ ఆఖరి ఓవర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన క్యాచ్‌లను కెప్టెన్‌ మార్క్రమ్‌ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న సౌతాఫ్రికా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో అత్యల్ప స్కోర్‌ను ఢిఫెండ్‌ చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ (46), డేవిడ్‌ మిల్లర్‌ (29), డికాక్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలరల్లో తంజిమ్‌ సకీబ్‌ 3, తస్కిన్‌ అహ్మద్‌ 2. రిషద్‌ హొసేన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. కేశవ్‌ మహారాజ్‌ (4-0-27-3), నోర్జే (4-0-17-2), రబాడ (4-0-19-2) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్‌ హ్రిదోయ్‌ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షాంటో (14), మహ్మదుల్లా (20) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

tollywood Actress Samantha Post Goes Viral On That Person To Find
అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు: సమంత పోస్ట్ వైరల్!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్‌ ఇండియా వర్షన్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం సమంత ఏ సినిమాలోనూ నటించడం లేదు. గతేడాది మయోసైటిస్‌ కోలుకున్న సమంత పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తోంది తాజాగా సామ్ ఇషా ఫౌండేషన్‌లో మెరిసింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఇషా ఫౌండేషన్‌లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్‌లో పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతారు. కానీ మీ జీవితంపై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం అనేది చాలా అరుదైన సందర్భం. మీకు జ్ఞానం కావాలంటే ఈ ప్రపంచాన్ని శోధించండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపుచతుంటాయి. మన ఆలోచన సాధారణమో.. అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తానంటే సరిపోదు. మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల సమంత ఆమె తన 37వ పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌పై రూపొందుతున్న తొలి చిత్రమిదే. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement