తెలుగు బిగ్‌బాస్ షోలో జంటలుగా అడుగుపెట్టినవారిలో మెరీనా- రోహిత్ కూడా ఉన్నారు.
ఈ బుల్లితెర సెలబ్రిటీ జంట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
ఎప్పటికప్పుడు తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు పంచుకుంటారు.
మెరీనా ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు వస్తున్న నేపథ్యంలో ఈ దంపతులు ఓ వీడియో రిలీజ్ చేశారు.
అందులో మెరీనా మాట్లాడుతూ.. మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను.
2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మొదటి స్కానింగ్‌లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది.
హార్ట్‌బీట్ వస్తుందేమోనని మూడు నెలలు ఎదురుచూశాం.
ఇంకా ఆలస్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో తీసేయించుకున్నాను.
2022లో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు హార్ట్‌బీట్ వచ్చింది.
ఒత్తిడి వల్లో.. నా శరీరం వీక్‌గా ఉందనో కానీ గర్భస్రావమైంది.
అప్పుడు నా ఆరోగ్యం మరింత దిగజారిపోయింది.
డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
తినకపోయినా లావైపోయాను. ఇక ఇప్పుడు నేను ప్రెగ్నెంటా? కాదా?
అని ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటవేసింది.
కానీ తన ముఖంలో గ్లో చూస్తుంటే మెరీనా ప్రెగ్నెంట్ అని అర్థమైపోయిందంటున్నారు ఫ్యాన్స్.


