వొడాఫోన్ కొత్త ప్లాన్స్:40జీబీ 4జీ డాటా ఫ్రీ | Vodafone Red Postpaid Plan now offers 40 GB data after 4 times SuperNet 4G offer, takes on Reliance Jio | Sakshi
Sakshi News home page

వొడాఫోన్ కొత్త ప్లాన్స్:40జీబీ 4జీ డాటా ఫ్రీ

Jan 24 2017 10:50 AM | Updated on Sep 5 2017 2:01 AM

వొడాఫోన్ కొత్త ప్లాన్స్:40జీబీ 4జీ డాటా  ఫ్రీ

వొడాఫోన్ కొత్త ప్లాన్స్:40జీబీ 4జీ డాటా ఫ్రీ

టెలికాం రంగంలో పోటీని తట్టుకునేందుకు ప్రముఖ టెల్కో వొడాఫోన్ తన రీచార్జ్ పథకాలను మరోసారి రివ్యూ చేసింది.

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో పోటీని తట్టుకునేందుకు  ప్రముఖ టెల్కో వొడాఫోన్ తన  రీచార్జ్ పథకాలను మరోసారి రివ్యూ చేసింది. 200 మిలియన్ల  వినియోగదారుల బేస్ తో టెలికాం రంగంలో మార్కెట్ లీడర్లకు  గట్టిపోటిగా మారుతున్న  వొడాఫోన్ ఇటీవల పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అన్ లిమిటెడ్ ఆఫర్లు  ప్రకటించింది.  ప్రస్తుతం తన   వినియోగదారులకు   మరింత అధిక డాటాను  ఉచితంగా అందించనుంది. వివిధ ప్లాన్లపై ఈ  అపరిమిత కాలింగ్ తోపాటు4 జీ డాటాను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన హ్యాపీ న్యూయర్ ప్లాన్ లో అదనంగా  మరో మూడు  ప్లాన్స్ ప్రకటించింది. గతంలో ప్రకటించిన    రూ. 499నుంచి  ప్రారంభ మయ్యే  వొడాఫోన్ రెడ్  ప్లాన్  లో  ఉచిత డాటా, అన్ లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ ఎంఎస్ లు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త ప్లాన్స్
రూ. 1699 ల రీచార్జ్ పై హోం నెట్ వర్క్ లో ఉచిత కాలింగ్ , 20జీబీ 4జీలేదా3 జీ  డాటా అందిస్తోంది. నాన్ 4జీ  మొబైల్స్ పై   16 జీబీ 3 జీ డాటా , అన్ లిమిటెడ్ కాల్స్,  (లోకల్ అండ్ ఎస్టీడీ) 100 ఎస్ ఎంఎస్ లు  ఫ్రీ.
రూ.2,999  రీచార్జ్ పై   4జీ స్మార్ట్ ఫోన్లపై 40జీబీ 3జీ/4జీ డాటా ,  నాన్ -4జీ స్మార్ట్ ఫోన్లపై  10జీబీ డాటా  ఉచితం
రూ. 1999ల రీచార్జ్ పై 20 జీబీ నాన్ 4 జీ డాటా, 24 జీబీ 4 జీబీ డాటా ఉచితం. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్..100 ఎస్ ఎంఎస్ లు  ఫ్రీ.
పాత ప్లాన్స్
రూ. 499 లకు లోకల్ అండ్  ఎస్టీడీ కాల్స్, 1 జీబీ డాటా నాన్ 4 జీ మొబైల్స్ కు , 4 జీ మొబైల్స్ లో 3 జీబీ లేదా 4 జీ డాటా,100 ఎస్ఎంఎస్ లు ఉచితం.  రూ. 699 లకు   లోకల్  అండ్  ఎస్టీడీ కాల్స్, 5 జీ.బీ. 4 జీ లేదా 2.5 జీబీ డాటా 100 ఎస్ఎంఎస్ లను ఉచితం.

ఇవి  ప్రస్తుతం మధ్యప్రదేశ్,  ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, బీహార్,  ఝార్ఖండ్, జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సర్కిల్సో అమలవుతాయని పేర్కొంది. అయితే వివిధ సర్కిల్స్ లో ఈ ధరల్లో తేడా ఉండొచ్చని తెలిపింది.  డేటా పరిమితి  దాటిన  తరువాత  ఒక ఎంబీకి 50పైసలు చార్జ్ చేయనున్నట్టు చెప్పింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement