ఉబర్ క్యాబ్ డ్రైవర్ హత్య | Uber driver stabbed to death in Bhopal after his cab hits two-wheeler | Sakshi
Sakshi News home page

ఉబర్ క్యాబ్ డ్రైవర్ హత్య

Feb 5 2017 12:26 PM | Updated on Oct 8 2018 3:17 PM

ఉబర్ క్యాబ్ డ్రైవర్ హత్య - Sakshi

ఉబర్ క్యాబ్ డ్రైవర్ హత్య

చిన్న వివాదం ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రాణం తీసింది.

భోపాల్: చిన్న వివాదం ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ లోని బర్కేదా పతానీ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఉబర్ క్యాబ్ డ్రైవర్ యోగేశ్‌ పూజారి(24) కృష్ణా నగర్ లో ప్రయాణికుడిని దించేసి వస్తుండగా అతడి కారు అక్కడే పార్క్ చేసివున్న బైకును తాకింది. దీంతో యోగేశ్‌ తో బైకు యజమాని అశ్విని సనాటే(19) గొడవకు దిగాడు.

ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరి దాడికి దారి తీసింది. అశ్విని పదునైన కత్తితో పొడవడంతో యోగేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు ఐటీఐ విద్యార్థిగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవిందపురా వాసి అయిన యోగేశ్‌ సొంతంగా కారు కొనుక్కుని ఉబర్ తరపున నడుపుకుంటున్నాడు. కుటుంబానికి ఏకైక ఆధారమైన అతడు మృతి చెందడంతో యోగేశ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement